ముంగిలి > శిరోభారం > తెలుగువాడినా, ఆంధ్రుడినా లేక తెలంగాణా వాస్తవ్యుడినా?

తెలుగువాడినా, ఆంధ్రుడినా లేక తెలంగాణా వాస్తవ్యుడినా?

ఈ ప్రశ్న నన్ను తరచుగా తొలచివేస్తోంది. బహుశః నేను మాత్రమే ఈ ప్రశ్నచేత వేదింపబడుతున్నాని అనుకోవట్లేదు. ఇటువంటి సందిగ్ధావస్తతో బహుశః మరెందరో మదనపడుతూ ఉండి ఉంటారనుకుంటున్నాను.

నాది తెలుగుదేశమందామనుకుంటే, రాజకీయ దుర్వాసన వస్తుంది. లేదా ఆంద్రుడిని అందామనుకుంటే, ఈ గొడవల్లో అది నా అస్తిత్వాన్నే దెబ్బకొట్టగలదు. హైదరాబాదు వాస్తవ్యుడనా; తెలంగాణేతరులతో తెగతెంపులు చేసుకున్నట్లె.

నేనెవరిని? నా గుర్తింపు ఏమిటి?

చారిత్రికపరంగా అసలు తెలుగువారెవరు? తెలంగాణావాస్తవ్యులు, ఆంధ్రులు, రాయలసీమ వారు వీరందరు వేరా? విభిన్న జాతులు, తెగలు కలిసి తెలుగు వారయ్యారా లేక తెలుగు వారే రాజకీయలబ్ధికొరకు విడివిడిగా విడగొట్టబడ్డారా?

క్రింది సంస్కృత శ్లోకము బ్రాహ్మణుల వర్గీకరణకు సంబందించినది.

కర్ణాటకాశ్చ తైలంగ ద్రావిడా మహారాష్ట్రకాః |
గుర్జరాశ్చేతి పంచైవ ద్రావిడా వింధ్యాదక్షిణే ||

బ్రాహ్మణులను ఉత్తర మరియూ దక్షిణ దేశాలకు చెందిన రెండు తెగలుగా వర్గీకరించి చూచినట్లైతే, పై శ్లోకము ఆ దక్షిణ దేశీయుల అంతఃవర్గీకరణను గూర్చినది.

1. కర్ణాటక
2. తైలంగీయులు
3. ద్రవిడులు
4. మహారాష్ట్రులు
5. గుజరాతులు

పైన ఉటంకింపబడిన “తైలంగ” అను పదము ఎందుకు వాడబడినది? ఆంధ్ర లేదా తెలుగు పదాల ప్రయోగం ఎందుకు జరుగలేదు?

“ఆంధ్ర” పదము కన్నా అసలు తెలుగు అనే పదానికి అతి దగ్గరగా ఉండే పదం “తెలంగాణ.” అటువంటిది, తెలుగు తల్లి మాది కాదు. మాది తల్లి తెలంగాణా అనటం ఎంతమటుకు సమంజసం?

పోనీ, తెలుగు మాది అని తెలంగాణావాదులు వాదిస్తే, అప్పుడు ఇతరుల భాషా గుర్తింపు ఏమిటి?

“తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది” అని ఇక ముందు ఎవరైనా పాడడం అటుంచి అసలు కూనిరాగాన్నైనా తీయగలిగే రోజు వస్తుందా?

ఏమో? ఆ తెలుగుతల్లో, తెలంగాణాతల్లో, లేదా ఆంధ్రా తల్లో దయతలచి యీ విభజనకారుల స్వార్థాన్ని కట్టడిచేసి “ఉందిలే మంచికాలం ముందు ముందునా…అందరూ సుఖపడాలి నందనందనా…” అనేట్టుచేస్తే యెంత బాగుండునో? మళ్ళీ నేను తెలుగువాడినని చెప్పుకుంటూ భుజాలనెగరేసుకుంటూ తిరగాలనుంది…

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s