ముంగిలి > శిరోభారం > అద్దాల మేడలు

అద్దాల మేడలు

ఎవరైనా నొక్కి వక్కాణిస్తారు, ఖండిస్తారు లేకపోతే బల్ల గుద్ది చెబుతారు. వీళ్ళేంటండి అద్దాలు పగులగొట్టి చెబుతామంటారు? అర్థం కాలా? తెలంగాణా వేర్పాటు వాదులు. కొత్త సంవత్సరంలో శ్రీకృష్ణ కమీషన్ నివేదిక సమర్పిస్తుందని, భాగ్యనగరంలో అద్దాలమేడల్లో వ్యాపారాలు చేసుకుంటున్నవారు తమ భవనాలమీద వలలాంటి ఒక కవచాన్ని కప్పిపెడుతున్నారు. అల్లరి మూకలు రాళ్ళు విసిరితే ఆ అద్దాలు పగులకుండా ఉండడానికన్నమాట. ఇవాళే తీసిన రెండు మూడు చిత్రాలు క్రింద జోడింపబడ్డాయి.

అద్దాల మేడ - 1

అద్దాల మేడ - 2

తెలంగాణా కావాలి. అందులో హైదరాబాదు అతర్భాగమై ఉండాలి. దిక్కుమాలిన ఆకతాయి పోకడ కాక పోతే, అదే హైదరాబాదుని ధ్వంశం చేసుకుంటారా? ఎమిటీ చోద్యం? భవనాలు మాత్రమే కాదండోయి, రోడ్డు రవాణా సంస్థ బస్సుల సంగతీ ఇంతే. దిక్కులేక ఆర్.టీ.సీ. వారు, ప్రతీ బస్సుమీద ఐదు వేలు వ్యత్యించి, వాటికీ కవచాలు తొడుగుతున్నారు, రక్షకభట శకటాలను తలపిస్తూ. ఈ వెధవల తద్దినం జన విజ్ఞాన వేదిక వాళ్ళు పెట్ట! (శాపనార్థం లెండి, జన విజ్ఞాన వేదిక వాళ్ళు తద్దినాలు గట్రాలను పెద్దగా నమ్మరనుకోండి, అది వేరే విషయం)

కానీ ఒక ఆలోచన తడుతోంది ఇదంతా చూస్తుంటే. ఆంధ్రా వాళ్ళో, రాయలసీమ వాళ్ళో, ఎంచక్కా అద్దాలు తయారుచేసే సంస్థలు స్థాపించుకుంటే ఎలా ఉంటుంది? అమ్మకాలు తగ్గినప్పుడల్లా, రెచ్చగొట్టే విధంగా తెలంగాణా వారిని కవ్విస్తే అద్దాలు బద్దలు! మళ్ళీ అద్దాల గిరాకీ పెరిగి కొనుగోళ్ళే కొనుగోళ్ళు. ఉద్యమానికి ఉద్యమం. వ్యాపారానికి వ్యాపారం. పీనుగుమీద పేలాలేరుకునేలా!!!

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s