ముంగిలి > శిరోభారం > దేవాదాయం – ధర్మాదాయం

దేవాదాయం – ధర్మాదాయం

ఇతర రాష్టాల విషయం తెలియదు కానీ, మన ప్రభుత్వశాఖల్లో ఒకటయిన దేవాదాయ-ధర్మాదాయ శాఖ పోకడ, వాళ్ళ ధ్యేయం ఏమిటో కాస్తంత జటిలమైన విషయమే. అసలు దేవాదాయమేమిటి? ధర్మాదాయ అర్థమేమిటి? పులిహోరా – దద్దోజనం.

చతుర్విద పురుషార్ధ పరంగా (ధర్మ, అర్థ, కామ మోక్షాలు) అర్థం (ఆదాయం) ధర్మబద్దమై ఉండాలి. ధర్మం నుంచి ఆదాయం కాదు! పోనీ, ధర్మంనుండి ఆదాయమని కాస్త చూసీ చూడనట్లు ఒదిలేసినా, వీళ్ళ పోకడ మరీ విడ్డూరం. పంచమహా పాతకాలలో మధ్యపానం ఒకటి. అటువంటి మద్యం తయారీపరిశ్రమకు అధినేతను తీసుకెళ్ళి మరో పదవి లేనట్టు కలియుగ వైకుంఠమైన ఆ తిరుమలకే ధర్మాధికారిగా కూర్చోపెట్టేంత ఘనులు. ఆ పదవిలో తులతూగుతూ మడికట్టుకు పనిచేసిఉండొచ్చని నమ్మేవారుంటారనుకోను. ఖచ్చితంగా అటూ ఇటూ జరిగే ఉంటుంది. అలా రాబట్టిన ఆదాయం ఏ అనాథశరణాలయానికో, దీనజనోద్ధరణకో వాడి ఉంటాడనుకోవటం నేతి బీరకాయలో నెయ్యి ఉందనుకోవడం. ఖచ్చితంగా తన పరిశ్రమలో కాస్తో కూస్తో పెట్టి ఉంటాడు. అంటే, ఆ దేవదేవుని సొమ్ము పంచమహాపాతక “అభివృద్ధిలో” భాగమయిందన్నమాట. హరి హరీ! కలియుగమా ఎంతటి బలీయమైన శక్తి నీది?

దానికి టికెట్టు, దీనికి టికెట్టు, వేలంపాటలు, భక్తులనుండి విరాళాలు, వందలకోట్ల ఆదాయం, హైటెక్కు విధానాలు, ఆన్లైన్ అమ్మకాలు, పారద్శతలేని పద్దతులు. ఇదంతా భక్తిని సొమ్ముచేసుకోవడమే! దైవాన్ని నిమిత్తమాత్రుడిని చేసి తెలిసీ తెలియక ఘోరాతి ఘోరాలు చేస్తున్నారు. దేవాలయ మాగాణుల “హాం ఫట్”; ఆలయ నగల మాయం కొసమెరుపు.

ఎన్నెన్నో దేవాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి. పట్టించుకునే నాథుడు లేడు. మరెన్నో దేవాలయాల నిర్వహణకు తగినన్ని నిధులులేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఆదాయం సరిపోక అర్చకులు వేరే జీవనాధారాలు వెతుక్కుంటున్నారు. ఆలయాలు కూలిపోయి, అర్చకులు పారిపోతే, ఎక్కడి దేవాదాయం, ఎక్కడి ధర్మాదాయం?

అల్పవర్గాల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, పాడి పరిశ్రమ సంక్షేమ, మానవ వనరుల సంక్షేమ శాఖ, శిశు సంక్షేమ శాఖ…ఇన్నిన్ని సంక్షేమ శాఖలున్నాయే? కాస్త కనికరించి దేవాలయ సంక్షేమ శాఖగా వీరి విధానాన్ని మార్చుకోవచ్చుగా? ఆదాయమే పరమావధిగా పనిచేస్తే ఎలా?

నడుమ వీళ్ళేందిరో? వీళ్ళ పీకుడేందిరా???

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
 1. madhavaraopabbaraju
  4:26 సా. వద్ద జనవరి 6, 2011

  ఆర్యా, నమస్కారములు.

  మీ వ్యాసం ద్వారా చక్కటి అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. ఇకపోతే, ` దేవాదాయ – ధర్మాదాయ ‘ అని అనికూడదు. వీటిని, ` దేవదాయ – ధర్మదాయ ‘ అని పకాలి, వ్రాయాలి.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • 8:22 సా. వద్ద జనవరి 6, 2011

   ఆర్యా,

   మీ సలహాకి ధన్యవాదములు. తెనుగుభాషలో వ్యాసకూర్పు నాకు కొత్త. మెల్లి మెల్లిగా నేర్చుకుంటున్నాను. తప్పకుండా మీ సలహాను పాటిస్తాను. కాకపోతే, ఆంధ్రభూమి వంటి వారు కూడా అలాగే ప్రయోగించారు. బహుశః ఈ తప్పు వ్యాప్తి చెంది, ఒప్పుగా మారిందేమో.

   మీ విధేయుడు…

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s