ముంగిలి > శిరోభారం > ముక్కు పచ్చలారని పసివాళ్ళట

ముక్కు పచ్చలారని పసివాళ్ళట

దూరదర్శనిలో ప్రభుత్వంవారి విజ్ఞప్తిమేర వార్తాఛాణళ్ళు, భాగ్యనగరంలో శ్రీకృష్ణ కమీషన్ నివేదిక ప్రేరిత అల్లర్లని, విధ్వంశాన్ని మసి పూసి మారేడుకాయ చేసి ప్రసారం చేయట్లేదు. కొన్ని ఛాణళ్ళు అసలు దాని ఊసే ఎత్తడంలేదు. ఖచ్చితంగా హర్షించదగ్గ పరిణామమే. కానీ ఒకటి రెండు ఛాణళ్ళు మాత్రం ఉత్తర్వును పక్కన పెట్టి గోరొంతను కోడంత చేసే అలవాటుని అలాగే కొనసాగిస్తున్నాయి.

అలాంటి ఒక ఛానల్ ప్రతినిధి బంద్ ప్రభావాన్నిగూర్చి నివేదిక వినిపిస్తూ “ముక్కు పచ్చలారని విద్యార్థుల మిద పోలీసువారి అత్యాచారానికి నిరసనగా బంద్ పిలుపునివ్వడం జరిగిందని“, “అన్ని విద్యాసంస్థలు స్వచ్చందంగా బంద్‍లో పాల్గొంటున్నాయని” నివేదించాడు. ఇవాళటి (జన 7) వార్తా పత్రికలో ప్రచురించిన ఒక చిత్రాని క్రింద జత చేశాను. ఇది నిన్న జరిగిన అల్లర్లలో ఆ ముక్కు పచ్చలారని విద్యార్థులది.

ముక్కు పచ్చలారని అల్లరి మూకలు

ముక్కు పచ్చలారని అల్లరి మూకలు

ముక్కు పచ్చలారని” అంటే ఇదేనా? బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. నోటికి తోచినట్టు పేలడమే! ఒక రోడ్డు రవాణా సంస్థ వాహనాన్ని ధగ్ధం చేసి దాన్ని తోసుకెళ్ళడానికి వచ్చిన మరో దాన్ని తగులబెట్టి అదుపుతప్పిన రాక్షసుల్లా, గురి తప్పిన గుట్కా ఉమ్మిలా ప్రవర్తించిన వారిపై పోలీసువారు కేవలం లాఠిలు, భాష్ప వాయువు, రబ్బరు బుల్లెట్లు మాత్రమే ప్రయోగించారు. ఇదా నిరసన తెలియజేసే పద్దతి? 500 పైచిలుకు పుటల నివేదిక చదవకుండానే, విధ్వంసానికి దూకేసారు. ముక్కు పచ్చలారడం అటుంచి అసలు ఏ కోణానయినా కనీసం విధ్యార్థుల్లా ఉన్నారా వీళ్ళు? రాజకీయ నిరుద్యోగుల కిరాయి గూండాలు.

ప్రపంచ ప్రసిద్ధం కాక పోయినా, ఉస్మానియా విశ్వ విద్యాలయానికి ఒక గుర్తింపు, హోదా ఉన్నాయి. మట్టి కొట్టుకు పోతోంది. ముందు ముందు ఎవరైనా నేను ఓస్మానియా పట్టభద్రుడనని చెప్పుకోడానికే సిగ్గు పడేలా దాని ఆత్మను మానభంగం చేసేస్తున్నారే? ఎంత గర్హించతగ్గ విషయం!

కొన్నేళ్ళ క్రితం దాకా తార్నాకా, హబ్షీగూడాలు ఎంతో ప్రశాంతమయిన పేరున్న ప్రదేశాలు భాగ్యనగరంలో. జనాలు అసహ్యంతో, భయంతో పారిపోతున్నారు అక్కడనుంచి. ఏఁ? ఉస్మానియా చుట్టు ప్రక్కల స్మశానాలు తయారు చేసే ప్రణాళికేమైనా ఉందా?

ఇంకో పేలుడేంటి? “అన్ని విద్యాసంస్థలు స్వచ్చందంగా బంద్‍లో పాల్గొంటున్నాయి” స్వచ్చందంగా కాదు బాబు, భయంతో తలుపులు మూసుకున్నాయి. ఏ అల్లరిమూకలో దాడి చేస్తే, ఎక్కడ పిల్లల్ని అయోమయ పరిస్థిలో బయటకు తరిమేయాల్సి వస్తుందో నన్న భయం. భయానికీ, స్వచ్చందానికి తేడా తెలీదు?

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
 1. 1:32 ఉద. వద్ద జనవరి 8, 2011

  రేచ్చిపోయినోళ్ళం చస్తున్నాం ,
  రెచ్చ గొట్టేతోల్లెన్నడైన చచ్చిన్రా
  యని యోచనైన చేయలేని
  బాల్య మనస్కులు
  నిజంగా ముక్కుపచ్చలారని
  వసి వాడని పసికందులు..
  నిజం !
  పాపం వారు ముక్కుపచ్చలారని వారు.
  ఆకారం పెరిగినంతమాత్రాన
  వయసున ఎదిగినంత మాత్రాన …
  పెద్దో ళ్ళాయి పోయినట్టా
  డిగ్రీలు చదువుతున్నంత మాత్రాననే
  విజ్ఞానఖనులై పోతారా
  సదువు చెప్పెతోల్లె
  చలో బందుకంటుంటే …వాల్లనేమి అనకండి పాపం !

  రేచ్చిపోయినోళ్ళం చస్తున్నాం ,
  రెచ్చ గొట్టేతోల్లెన్నడైన చచ్చిన్రా
  యని యోచనైన చేయలేని
  బాల్య మనస్కులు
  నిజంగా ముక్కుపచ్చలారని
  వసి వాడని పసికందులు..వాల్లనేమి అనకండి పాపం !

 2. Rammohan
  9:34 సా. వద్ద జనవరి 23, 2011

  This post reflects many of the people’s untold inner feelings.

 3. vamshi
  1:34 ఉద. వద్ద జనవరి 24, 2011

  భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని అప్పటి బ్రిటిష్ వాళ్ళు మీలానే అని ఉంటారు…

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s