ముంగిలి > సందర్శన > రాష్ట్రపతి నిలయం

రాష్ట్రపతి నిలయం

మన దేశ రాజధానిలో భారత రాష్ట్రపతి భవనమున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అదికాక, శిమ్లా నందునూ మరియూ మన రాష్ట్ర రాజధాని యగు హైదరాబాదులోనూ రెండు విశ్రాంతి గృహాలున్న విషయం బహుశః అంతగా తెలిసిన విషయం కాదు. (Presidential Retreats).

సికందరాబాదు (లష్కర్) లోని బొలారం నందు రాష్ట్రపతి నిలయం కలదు. 90 ఎకరాల విస్తీర్ణంలో నగర రోజువారీ సందడికి కాస్తంత దూరంలో ఉన్న ఈ రాష్ట్రపతి నిలయం, ఎంతో ఆహ్లాద పరచే ప్రశాంత వాతవరణంలో నెలకొని ఉన్నది.

ఇటీవలే మన రాష్ట్రపతి గౌరవనీయులయిన శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు భాగ్యనగరానికి విచ్చేసి ఇచట బస చేయడం జరిగింది. ఆవిడ దేశ రాజధానికి తిరుగు ప్రయాణమయ్యాక, ప్రజల సందర్శనార్థం ఈ నిలయాన్ని జనవరి 1 నుండి 10, 2011 వరకు తెరిచి ఉంచారు.

దాన్ని సందర్శించినప్పుడు తీసిన కొన్ని చిత్రాలను, కొన్ని అనుభవాలను ఈ పుటలో మీముందుంచుతున్నాను.

ప్రవేశద్వారం

ప్రవేశద్వారం - నగరానికి కాస్తదూరానున్నా, ప్రజల రద్ది, ఊహించినదానికన్నా కాస్త ఎక్కువే అనిపించింది.

కోలాహలం

కోలాహలం - ప్రవేశద్వారం వద్ద తినుబండారాల అమ్మకం, కొనుగోలుదార్ల కోలాహలం

మొదటి దృశ్యం

మొదటి దృశ్యం - రాష్ట్రపతి నిలయం యొక్క మొదటి దృశ్యం

ఆహ్లాదకర దృశ్యం

ఆహ్లాదకర దృశ్యం - రాష్ట్రపతి నిలయపు ఆహ్లాదపూరిత వాతావరణం

పళ్ళతోటలు

పళ్ళతోటలు - గౌరవనీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి కోరికమేర పెంచబడుతున్న పళ్ళతోటలలో ఒక తోట

ప్రకృతి శోభ

ప్రకృతి శోభ - ఎంతగానో ఆహ్లాదపరిచే రమణీయ ప్రాకృతిక వాతావరణం

ఆకర్షణ

ఆకర్షణ - కొత్తగా నెలకొల్పబడిన ఔషధీ తోటలోని ఆకర్షణ. గౌరవనీయులయిన శ్రీమతి ప్రతిభా పాటిల్ గారిచే ఇటీవలే ప్రారంభింపబడిన ఔషధీ మొక్కలూ, వృక్షాల తోటలోని ఆకర్షణ.

అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాన్ని చక్కగా వాడి, ఎన్నో ఔషధీ మొక్కలు కూర్చి ఓక ఔషధీ మొక్కల తోటను రాష్ట్రపతిగారీ చేతులమీదుగా ఇటీవలే ఉద్ఘాటన చేయించారు. ఆ తోటలోని కొన్ని అరుదయిన, మనకు తక్కువగా తెలిసిఉన్న మొక్కల చిత్రాలు, వాటి వివరాలు…

కరక్కాయ - Terminalia Chebula

కరక్కాయ - Terminalia Chebula

శంఖపుష్పి, అపరాజిత - Clitoria Ternatia

శంఖపుష్పి, అపరాజిత - Clitoria Ternatia

రుద్రాక్ష - Elaeocarpus Ganitrus

రుద్రాక్ష - Elaeocarpus Ganitrus

వస - Acorus Calamus

వస - Acorus Calamus

అశ్వగంధ - Withania Somnifera

అశ్వగంధ - Withania Somnifera

భూతులసి, సబ్జ - Ocimum Basilicum

భూతులసి, సబ్జ - Ocimum Basilicum

లవంగ తులసి - Ocimum Gratissimum

లవంగ తులసి - Ocimum Gratissimum

ఎర్ర చందనం - Pterocarpus Santalinus

ఎర్ర చందనం - Pterocarpus Santalinus

మానవ వికాసానికి సంబందించిన విశయాలేవీ ప్రదర్శనలో లేవు కాని కొందరి సందర్శకుల ప్రవర్తన చూస్తే మాత్రం మర్కటాలనుంచి మనము ఉద్భవించామన్న విషయం తెలుపకనే తెలుస్తుంది. మొదటి రెండు రోజులు సందర్శకులను భవనాలలోపలికి కూడా అనుమతించారు. కానీ ఆకతాయి చేష్టల కారణంగా, మూడో రోజు నుంచి కేవలం అద్దాలలో నుంచి మాత్రమే చూడడాన్ని అనుమతించడం మొదలు పెట్టారు. పోనీ దాని తరువాతన్నా ఏమన్నా మారిందా? లేదు. తోటల్లోని వృక్షాల మీద రాళ్ళతో, నీటి బాటాళ్ళతో దాడి. దేనికి? చింతకాయల కోసం!

ఓ సంఘటన
మొక్కల సందర్శనలో లవంగ తులసి (Ocimum Gratissimum) వద్ద ఒక కుటుంబం ఆ మొక్కని సబ్జా మొక్క అదే భూతులసి (Ocimum Basilicum) అని భావించారు. ఆ అపార్థమేమోగాని, ఇంతలోనే తెలంగాణా భావావేశాన్ని వెలిబుచ్చారు. “మన భాష ఏది? ఏందేందో రాసిర్రు. ఇది సబ్జా చెట్టు గదా” అని. వెంటనే సర్దిచెప్పి వారికి అసలు మొక్క ఎక్కడుందో చెప్పాను. ఏదో నా వంతు ఉడతా భక్తి సాయం. తెలుగు కుటుంబంలో చిచ్చు ఎంత దారుణంగా రగులుతోందో చూస్తే  చాలా బాద కలిగింది.

కొసమెరుపు

  • ప్రవేశం ఉచితం. నిజమండి. తెలుగు తల్లి సాక్షిగా!
  • త్రాగు నీరు ఉచితం. మళ్ళీ నిజమే రాశానండి. ఈసారి తెలంగాణా తల్లి మీదొట్టు.
ప్రకటనలు
వర్గాలుసందర్శన ట్యాగులు:
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s