ముంగిలి > సరదాగా, హాస్యం > తెలుగూళ్ళు – [సరదాగా / 1]

తెలుగూళ్ళు – [సరదాగా / 1]

నిన్న రాత్రి నాకు కలలో పంచ మాతృకల దర్శన భాగ్యం కలిగింది. పంచ మాతృకలు ఎవరనేనా మీ ధర్మ సందేహం?

1. రాయలతెలంగాణా తల్లి
2. సీమాంధ్ర తల్లి
3. తెలంగాణ తల్లి
4. కళీంగాంధ్ర తల్లి
5. ఉత్తరాంధ్ర తల్లి

తెలుగు తల్లి ఎక్కడనుకుంటున్నారా? వృద్ధాశ్రమంలో చేర్పించడానికి సిద్ధంగా ఉండి ఈ మధ్య ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్ళు లేక బిక్కు బిక్కు మంటు ఓ మూలన కూర్చోనుందిలెండి.

మళ్ళీ నా కల విషయానికొద్దాం. ఆ పంచ మాతృకలు నాకు జ్ఞాన బోధ చేశారు.

గిదేందిరా తమ్మీ? నాక్‍తెల్వక అడుగుతా…అల్లెప్పుడో కదేంటి ఈ ఆంధ్రప్రదేశ్ పుట్టీంది? ఇంకా పట్టుకు వేళ్ళాడతావేంటి? నీ మొహమీడ్చ! అరే థాయ్…రేపు మూడు ముక్కాల లోపు మేంజెప్పిన పన్జేయలేదనుకో? నీ సంగతంతే.

ఇంకా చాలానే జరిగిందనుకోండి. ఇతివృత్తమేమిటంటే, నన్ను ఒక పురాణాన్ని రచించమని ఆజ్ఞాపించారు. ఆ పురాణంలో రాగల కాలంలో జరుగబోయే కొన్ని అద్భుత విషయాలగురించి ప్రస్తావించాలి. పురాణాలంటే జరిగిన విషయాలు కదా అని అనుమానం వచ్చినా, ఎందుకో నోరు పెగల్లేదు. పోను పోను, ఈ పంచమాతృకల ప్రభావం లోకమంతా వ్యాప్తి చెంది ఆర్క్టిక్, అంటార్క్టిక్ ద్వీపాలు మినహా మిగిలిన ఐదు ద్వీపాలు ఈ ఐదుగురి పాలనలోకి వస్తాయి. మొదటిగా, నన్ను ఈ ఐదు ద్వీపాలలోని ముఖ్యమయిన నగరాల పేర్లు మార్చమని ఆజ్ఞాపించారు. కాసుకోండి.

      Addis Ababa అద్దాలవలస
      Dar-es-Salaam దారుకాస్థలం
      Fort William పార్థ నిలయం
      Gibraltar గిబ్బలూరు
      Madrid మదిరాద్రి
      Prague పరుగుపల్లి
      Vatican వేటకొలను
      Zagreb చాకిరేవు
      Moscow మసకూరు
      Birmingham బ్రహ్మంగారిధామం
      Havana హోమవనం
      Johannesburg జగన్నాథపురం
      Tripoli తేరిపల్లి
      Remicourt రామకుర్తి
      Kabul కాపులూరు
      Buckingham భక్తిధామం
      Damascus దారంచెర్ల
      Miranda మిర్యాలకొండ
      Singapore సింహపురి
      Tehran తేరిపార
      Edinburgh ఎద్దులూరు
      Muscat మస్కాపేట్
      Frankfurt పంకుపర్తి
వివేన్ ఉవాచ
      Houston హస్తిన
      Pittsburg పిట్టలూరు
      Washington, D.C. వాజేడువలస
      Portland పోడుకొండ
సుజాతౌవాచ
      San Jose సన్నాసి పాడు
      Saltlake City ఉప్పులూరు
      New Jersey కొత్తజెరిసిపల్లి
      Oklahoma City ఒక్కుముక్కలపట్నం
      Colombo కొలనుపర్తి

|| ఇతి శ్రీ అంతర్జాల పురాణే, వర్డ్ ప్రెస్‌ ఖండే, ప్రథమోధ్యాయం సంపూర్ణం ||

బాబ్బాబు. మరీ బొత్తిగా ఒక్క పుటకూడా ఖర్చవ్వకుండానే మొదటి అధ్యాయం పూర్తిచేస్తే బాగోదు. ఇంకా ఎమన్నా కొన్ని పేర్లు మార్చిపెడుదురు, పుణ్యముంటుంది.

ప్రకటనలు
వర్గాలుసరదాగా, హాస్యం ట్యాగులు:,
 1. 12:35 సా. వద్ద జనవరి 14, 2011

  Houston – హస్తిన
  Pittsburgh – పిట్టలూరు
  Washington, D.C. – వాజేడువలస
  Portland – పోడుకొండ

 2. 3:48 సా. వద్ద జనవరి 14, 2011

  అష్టలక్ష్ముల్ని ఆరాధించినా అసలు లక్ష్మి ఒకరే కదండీ! తెలుగు తల్లి కొచ్చిన ఢోకా ఏమీ లేదు

  San Jose: సన్నాసి పాడు
  సాల్ట్ లేక్ సిటీ: ఉప్పులూరు
  న్యూజెర్సీ:కొత్తజెరిసిపల్లి
  ఒక్లహోమా సిటీ: ఒక్కుముక్కలపట్నం
  కొలంబో:కొలనుపర్తి

 3. vamshi
  1:30 ఉద. వద్ద జనవరి 24, 2011

  ఈ లిస్టు తాడెపల్లి సుబ్రమణ్యానికి ఇస్తే పండగ చేస్కుంటాడు.. తెలుగు తల్లి గ్రూప్ కాస్తా.. తెలుగుతల్లి గుంపు అయ్యింది… రాను రాను మహా చాందస వాదులు తయారవుతున్నారు…

 4. 6:19 సా. వద్ద నవంబర్ 23, 2012

  nice telugu names for western names

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s