ముంగిలి > పిచ్చాపాటి > మళ్ళీ విద్యాభ్యాసం

మళ్ళీ విద్యాభ్యాసం

ఓ దశాబ్దిన్నర తరువాత మళ్ళీ ఒక విద్యాలయానికి విద్యార్థిగా వెళుతున్న విచిత్రమైన అనుభూతి. తేడా ఎమిటంటే, తోటి విద్యార్థులంతా ఉన్నత పదవిలో ఉన్నవారు కావడం; అందువల్ల, వాతావరణం మామూలు విద్యాతరగతికి కాస్త భిన్నంగా ఉండడం.

కలకత్తాకు నేను ఇది మొదటిసారి రావడం. బుధవారం (12 జన) నాడు కలకత్తాకు చేరుకున్నాను. ఇతర ప్రధాన నగరాలనుండి తోటి విధ్యార్థులుకూడా వచ్చారు. నాలుగు రోజులు ఐ.ఐ.ఎమ్. కాల్కటాలో తరగతులు జరుగుతాయి. తరువాత మళ్ళీ అందరం ఎవరి ఊళ్ళకు వాళ్ళు తిరుగు ప్రయాణమయ్యి దూర దృశ్య శ్రవణ పద్దతి ద్వారా తరగతులలో పాల్గొనడం జరుగుతుంది. అరవైమంది దాకా ఉంటారు.

ఇదో విచిత్రమైన అనుభూతి. సాధారణ విద్యా తరగతులలో, అద్యాపకులది ఎప్పుడూ నిర్ణేత స్థానం. కానీ, ఇక్కడ ఇంత మంది ఉన్నతోద్యోగులు కావడంచేత, అద్యాపకులు చాలా మర్యాద పూర్వకంగా, తోటి విద్యార్థులమల్లే ప్రవర్తించడం జరుగుతోంది. విద్యార్థులుకూడా కాస్త విచిత్రంగానే ప్రవర్తిస్తున్నారు. నా అభిప్రాయంలో, అధ్యాపకుడు నేర్పిన విషయాలు శ్రద్ధగా విని, సందేహ నివృత్తి కోసం ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకోవడం సాధారణం. కానీ, ఇక్కడ అద్యాపకుని కన్నా విద్యార్థులే ఎక్కువ మాట్లాడడం జరుగుతోంది. ప్రతీ విద్యార్థి ఏదో నిరూపించుకోవాలనే తపనతో మదన పడుతున్నట్టు ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. ప్రతీ వాడు పక్కవాడి కన్నా ఎంత వైవిద్యమైన ప్రశ్న వేద్దామా, ఎంత విచిత్రమైన సమాధానం ఇద్దామా; అవి తప్పని ఎవరన్నా సమాధాన పరిస్తే, వెంటనే పెళ్ళాణ్ణి ఓట్రించినట్టు తన మాట నిలబెట్టుకోనే ప్రయత్నం. చేపల సంతని తలపిస్తున్నారు.

దానికి తగ్గట్టు, ప్రొఫెస్సర్లు ఎంచక్కా ఓ పుస్తకాన్ని అంటగట్టి, రెండు గంటలపాటు అద్యయనం చేయమని చెప్పి తప్పించుకోవడమూ జరుగుతోంది. ఇక రేపటితో ఈ తడవు ఆఖరి రోజు. ఎంతో ఉత్సాహంగా అనిపిస్తోంది. మళ్ళీ నా సాధారణ జీవితానికి తిరిగి వెళ్తున్నానన్న కారణంగా. గోప్ప ఆశలతో రాకపోయినా, ఎందుకో ఏదో వెల్తితో తిరిగి వెళ్తున్నానన్న భావన కలుగుతున్నా, ఇంత మంది గోలకు దూరంగా వెళ్తుంనందుకు ఒకింత సంతోషమేలెండి.

తిరిగి ఇల్లు చేరుకొని కాస్త కుదుట పడ్డాక మరిన్ని విశేషాలు పంచుకుంటా.

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s