ముంగిలి > సందర్శన > కలకత్తా నగరం

కలకత్తా నగరం

నిన్ననే కలకత్తా నుండి తిరిగి రావడం జరిగింది. గొప్పగా ఉందనో, సమయం వృధా అనో చెప్పడం కష్టం. అలాంటి తీర్పులివ్వదలచుకోలేదు. కాకపోతే, అక్కడ తీసిన కొన్ని చిత్రాలను మీతో ఈ టపాలో పంచుకుంటున్నాను. ఇదే నేను మొదటిసారి కలకత్తాకు వెళ్ళడంకనుక, వివరాలు అంతంత మాత్రంగానే జత పరుస్తున్నాను. మీరుకానీ ఇంకాకొన్ని వివరాలు జత చేయ గలిగితే ముందస్తు కృతజ్ఞతలు.

కలకత్తా టాక్సీ వాహనాలు

కలకత్తా టాక్సీ వాహనాలు - కలకత్తా నగరంలో ఏ ముఖ్య రహదారి పరికించినా, పసుపు బొట్లు పెట్టినట్టు, అంబాసడర్ టాక్సీ వాహనాలు కనిపిస్తాయి. నేను చూసినంతమటుకు, మామూలు వాహనాలకన్నా వీటి సంఖ్యే ఎక్కువనిపించింది. మన ఆటోలలా.

ఝాల్ మూరి

ఝాల్ మూరి - అక్కడి ప్రజల ముఖ్య చిరుతిళ్ళలో ఒకటి. మరమరాలతో చేస్తారు.

ఒక కూడలి
ఒక కూడలి – బహుశః ఆదివారం కనుక, అంత రద్దీగా లేదనుకుంటాను. సాధారణ పనిదినాలలో, రద్దీ కాస్త ఎక్కువేనని చెప్పారు.
చారిత్రిక మిఠాయి దుకాణం - కే.సీ.దాస్

చారిత్రిక మిఠాయి దుకాణం - కే.సీ.దాస్ అని మన పుల్లారెడ్డిలాంటిదనుకోండి. ఈ దుకాణంవాళ్ళూ రసగుల్లా అనే ప్రసిద్ధమయిన బెంగాలీ మిఠాయిని కనుగొన్నది తమే అని చెబుతుంటారు.

ఎల్.ఐ.సీ. భవనం

ఎల్.ఐ.సీ. భవనం - కాస్తంత పురాతనమయిన కట్టడం. దగ్గిరనుంచి చూస్తే, ఎప్పుడు కూలుతుందా అనిపించింది.

రక్షక భటుడు

రక్షక భటుడు - పెద్ద విషయమేమీ లేదులెండి. ఇక్కడి రక్షకభటులు తెల్లని వస్త్రాలను ధరిస్తారు. అందుకే ఒక 'క్లిక్'

కలకత్తా ట్రామ్

కలకత్తా ట్రామ్ - ఈ నగర ప్రత్యేక గుర్తింపు. ఇంకా నడుస్తున్నాయండోయ్.

విక్టోరియా మెమోరియల్ భవనం

విక్టోరియా మెమోరియల్ భవనం - ఒక ఆకర్షణ. ఆంగ్లేయులు కట్టించినది. ఇప్పుడిదోక మ్యూజియం.

ప్రకటనలు
వర్గాలుసందర్శన ట్యాగులు:
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s