ముంగిలి > సరదాగా, హాస్యం > సినిమా పోస్టర్లు – [సరదాగా / 2]

సినిమా పోస్టర్లు – [సరదాగా / 2]

తెలుగు చలన చిత్రాలు చూడడానికి కావలసిన అర్హతలైన కళాత్మక దృష్టి, మనోధైర్యం, పరిపక్వత నాకు లేవు గనక, కాస్తంత దూరంగా ఉంటూంటాను. నా అర్హతకు తగ్గ చిత్రాలు సంవత్సరంలో ఒకటో రెండో వస్తుంటాయి. అవి మాత్రం చూస్తాను. కాకపోతే చిత్రాల పోస్టర్లు నా అర్హతానర్హతలతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. చలన చిత్ర పరిజ్ఞానం తక్కువ కాబట్టి, నా మనసు ప్రతి పోస్టర్కి తగ్గట్టు ఏదో ఓ కథ అల్లుతుంటుంది. అలాంటి కొన్ని అల్లికలు పంచుకుంటున్నాను.

కత్తితో సరసం
కత్తితో సరసం: ఏంటిది? సరసానికి పిలిచి నా కత్తితో నీ జుత్తు కత్తిరించుకుంటానంటున్నావ్? కత్తొదులు…వదలమంటుంటే వినవేంటి?

 నిండా ముణిగినవాడికి చలేంటి?
నిండా ముణిగినవాడికి చలేంటి? ఒకటి చేసినా, రెండు చేసినా, ఎన్ని చేసినా తప్పులన్నిటి ప్రతిఫలితమొకటే కదా? So just enjoy…

కొత్త స్టైల్
కొత్త స్టైల్: మనదంతా కొత్త స్టైల్. పెళ్ళికొడుకు స్నానం ముందు నూనె రాసుకుంటే “అభ్యంగన స్నానం.” నాలా స్నానం తర్వాత రాసుకుంటే “గిబ్యంగనం స్టైల్.”
ఎప్పుడూ పెళ్ళీ కూతురు సిగ్గుపడుతూ కూర్చోవడం పాత స్టైల్. నాలా వరుడు సిగ్గు పడుతూ కూర్చోవడం కొత్త స్టైల్. అర్థమయిందా?

पह्ले डैरेक्टरको गोली मार
पह्ले डैरेक्टरको गोली मार: సుబ్బీ! సెంటు బాగుందే! ఎక్కడ కొన్నావేంటి? కానీ ఇదేంటే? డైరెట్రు నిన్ను గోలీ మార్ అంటాడు? మనిద్దరం ముందు అతణ్ణేసేసి పక్కకెళ్ళి సెంట్ గురీంచి మాట్లాడుకుందామేంటి?

 తొందరేం లేదు
తొందరేం లేదు: ఆలస్యం అమృతమన్నమాట. ప్రేక్షకులెలాగూ ఆలస్యంగా వస్తారు లేకపోతే రానే రారు? అంత వరకూ మేమిద్దరం ఇలా కొట్టుకుంటూ ఆడుకుంటామేఁ? అప్పుడెప్పుడో జెంటిల్మెన్ సినిమాలో డిక్కిలోనా-డిక్కిలోనా అని చెప్పిన ఆట నేర్చుకోడానికైనా ఈ సినిమా చూడండేఁ?

 Times are చేంజింగూ
Behind every successful man there is a woman. Old saying.
In front of every aspiring man there has to be a gorgeous woman! Latest సేయింగూ

నాకు పరమ వీర చక్రం కావాలంతే!
బాలయ్య: ఢిల్లీ కొచ్చా! రాష్త్రపతి భవన్‍కొచ్చా! అశోకా హాలుకొచ్చా! ఈ డ్రెస్సు చూడు. అధిరింది కదా. తీ! నా పరమ వీర చక్ర అవార్డు.
గుమాస్తా: సార్. ఇలాంటి డ్రెస్సేసుకుంటే ఇవ్వరు సార్.

 నాకు పరమ వీర చక్రం కావాలంతే!
బాలయ్య: పోనీ. జై జవాన్! జై కిసాన్! చూడు. గన్నుపట్టుకున్న రైతు బిడ్డ డ్రెస్సేసుకొచ్చా. ఇప్పుడైనా తీ!
గుమాస్తా: సార్. డ్రెస్సులెసుకుంటే ఇవ్వరు సార్. అర్థం చేసుకోండి.

 నాకు పరమ వీర చక్రం కావాలంతే!
బాలయ్య: సరే కానీ. ఇప్పుడు చూడు. డ్రెస్సులు కాదు. వేషం వేసుకొచ్చా. ఇప్పుడైనా తియ్యి.
గుమాస్తా: అయ్య బాబోయ్. ఎలా వచ్చినా కుదరదు సార్.

 నాకు పరమ వీర చక్రం కావాలంతే!

బాలయ్య: రేయ్! నన్నే రెచ్చగొడతావ్‌రా? నీ సంగతి చూస్తానుండు.
ఏడి? ఎక్కడా? గుమాస్తా పారిపోయాడా?

ఏదో సరదాగా హాస్యంకోసం. అంతే. ఎవరినీ కించ పరిచే ఉద్దేశ్యం కాదు. అన్యథా భావించొద్దేఁ!?!?

ప్రకటనలు
వర్గాలుసరదాగా, హాస్యం ట్యాగులు:,
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. 6:58 సా. వద్ద నవంబర్ 1, 2011

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s