ముంగిలి > మన సంస్కృతి, సనాతన ధర్మం > హైందవ మతం…కాదు కాదు సనాతన ధర్మం [సనాతన ధర్మం / 1]

హైందవ మతం…కాదు కాదు సనాతన ధర్మం [సనాతన ధర్మం / 1]

ఆర్యావర్తము, భారత్, India (ఇండియా), హింద్, జంబూద్వీపం, భారతం, హిందుస్తాన్… భరతవర్షానికి ఎన్నో పేర్లు. జపాన్ వారు ఈ దేశాన్ని “తెన్జికు” (天竺) అని సంభోదించేవారట. దాని అర్థం స్వర్గమధ్యమనిట (Center of the heaven).

వీటన్నిటిలో, India మరియూ హిందుస్తాన్ బహుశః అంత పురాతనమైనవి కాకపోవచ్చు. హిందుస్తాన్ అనే పేరు పుట్టు పూర్వోత్తరాల గురించి పలు రకాల వ్యాఖ్యానాలున్నాయి. కొందరు “హిందువులుండే దేశం” కాబట్టి అలా పిలుస్తారని, మరి కొందరు “సింధ్ పదం నుండి వచ్చినదని”, మరికొందరు ఇంకొన్ని.

హిందుస్తాన్ అనే పేరు గురించి నా మటుకు నాకు ఒక అభిప్రాయమంటూ ఏమీ లేదు. కాకపోతే ఆ పదం విన్నప్పుడల్లా కొన్ని ఆలోచనలొస్తుంటాయి. కొత్తగా వ్యాఖ్యానాలేవీ దాఖలు చేసే ఉద్దేశ్యంలేదు కానీ, కొన్ని విశేషాలు పంచుకుంటాను.

అసలు హిందుత్వం ఒక మతమా? పలు మతాల్లో అదొకటా? ఒక మతానికుండే ప్రత్యేకతలు ఎందుకు కనిపించవు?

దేశ విభజనకు ముందు మొహమ్మద్ ఇక్బాల్ గారు వ్రాసినట్టు…
युनान-ओ-मिस्र-ओ-रोमा सब मिट गए जहाँ से |
अब तक मगर है बांकी नामो-निशान हमारा ॥7॥
सारे जहाँ से अच्छा हिन्दोस्तान हमारा हमारा । सारे जहाँ से अच्छा ||

యూనాన్ (గ్రీకు సామ్రాజ్యం), మిశ్ర్ (ఈజిప్టు సామ్రాజ్యం) మరియూ రోమా (రోమను సామ్రాజ్యం) అన్నీ తుడుచుకుపొయ్యాయి. కానీ మన అస్థిత్వం ఇంకా ఉంది అనేది రమారమిగా తర్జుమా. నిజమే కదా? వీటికన్నా ఈ దేశ చరిత్ర ఎంతో పురాతనమైనదైనా, కాసేపు సమకాలీనాలనుకుందాము. వారు అవలంబిచిన జీవన విధానం, అదే, మతం-ధర్మం ఇప్పుడున్నాయా? ఉంటే వాటి వైభవం ఇంకా నిలిచి ఉందా? ఎందుకు మరుగున పడ్డాయి? అదే పంక్తిలో ఉన్న ఈ దేశ ఆచార వ్యవహారాల సమాహారమైన “హైందవ మతం” ఇంకా ఎలా నిలిచి ఉంది?

ప్రతీ మతానికి ఆధారభూతమయిన గ్రంథం ఒకటుంటుంది. జొరాష్ట్రియన్లకు “జెండ్-అవెస్తా”, యూదులకు “తోరా” గ్రంథము, ఇస్లాం మతస్తులకు “ఖురాన్” గ్రంథం, క్రిష్టియన్లకు “బైబిల్” వంటివి. కానీ పురాతన ధర్మాలయిన “షింటో”, “తాఓ”, “హైందవం” వంటి వాటికి “ఇదీ” అని ఖచ్ఛితంగా చెప్పడం చాలా కష్టం. ఇవి జీవన విధానాలు, ధర్మాలు.

నా ఉద్దేశ్యంలో అసలు “హైందవ మతము” అన్న గుర్తింపు తప్పు. “హైందవ ధర్మం” లేదా “సనాతన ధర్మం” సరైన సంబోధన. అదొక జీవన సరళి; విధానం. నాకున్న కొందరు ముస్లిమ్ మరియూ క్రిష్టియన్ పరిచయస్తులు, స్నేహితులు ఈ దేశ ప్రత్యేక పద్దతులు అవలంబించడం ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. పెళ్ళిలో మంగళ సూత్రం వంటిది, కాళ్ళకు మెట్టెలు, శుభ ముహుర్తాలకు పంచాంగం వాడడం, తలంబ్రాలు, ఇంకా ఎన్నో. ఇవి “హిందూ మత” ఆచార వ్యవహారాలనడం పూర్తిగా సరైనది కాదని నా ఉద్దేశ్యం. ఇవి హిందుస్తాన్ పద్దతులు.

సనాతన ధర్మం” అనే శీర్షిక కింద, నాకు తెలిసినవి-నచ్చినవి అయిన విశేషాలు టపాలుగా మీముందు ఉంచుతాను. దేవాలయాల శీర్షిక కూడా నడుస్తోంది. ఈ “ననాతన ధర్మం” భూమిక టపాపై ఏవన్నా అభిప్రాయాలున్నా, తప్పులు కనిపించినా తప్పక తెలియజేయ గలరు.

ప్రకటనలు
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s