ముంగిలి > మన సంస్కృతి, సనాతన ధర్మం > మూల ప్రామాణాలు [సనాతన ధర్మం / 2]

మూల ప్రామాణాలు [సనాతన ధర్మం / 2]

ప్రతి మతానికి ఒక ప్రామాణం ఉంటుంది. ఆ మతాన్ని అవలంబించేవారు దేనిని అనుసరించాలి? ఏ పథంలో జీవనం సాగించాలి? దేని కోసమై పాటుపడాలి? ఒకటో కొన్నో పవిత్ర గ్రంథాలు ఈ ప్రశ్నలకు సమాధానం అందజేస్తాయి. ఆ పవిత్ర గ్రంథాలు నిర్దేశించిన విదంగా ఆ మతస్తులు తమ జీవన విధానాన్ని అవంలంబిస్తారు. అదే పంక్తిలో, సనాతన ధర్మం యొక్క ప్రామాణం ఏమిటి? మనకు బాగా తెలిసినటువంటి రామాయణ, మహాభారత, భగవద్గీత, భాగవత గ్రంథాలా? వేదాలూ-ఉపనిషత్తులా? అవి ఎక్కడ లభిస్తాయి? మరి పురాణాలేంటి? ఇతిహాసాలేంటి? ఆయుర్వేదం ఒకానొక వేదమా?

దోసెడు గంగాజలం చేతబూని గంగ గురించి వివరించడం వంటిది ఈ విషయం. కానీ “గంగి గోవు పాలు గరిటెడైనను చాలు” అన్నట్టు ఓ చిన్ని ప్రయత్నం.

ఒక్క మాటలో చెప్పాలంటే, “వేదం.” వేదాన్ని ఎవరు రచించారు? సమాధానం – అవి ఒకరు రచించినవి కావు. అనాది-అపౌరుషేయాలు. ఎప్పటి నుండి ఉన్నాయో, ఎవరు సృజించారో తెలియదు. క్లుప్తంగా చెప్పాలంటే, వేదాలు ఈశ్వరుని నిశ్వాసితాలు. ఆ పరాత్పరుని ఊపిరి. వీటిని మానవమాత్రులు రచించలేదు. ఋషులు ధ్యానం చేసి సంకలనం చేశారు. అటువంటి ఋషులను మంత్ర ద్రష్టలంటారు. కాస్త జటిలంగా అనిపిస్తోందా? ఒక సులభమైన తరహాలో ప్రయత్నిద్దాం. గురుత్వాకర్షణ శక్తి ఎప్పటి నుండి ఉందో ఎవరూ చెప్పలేరు. కానీ న్యూటన్ మహాశయుడు దానిని గుర్తించాడు. ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించక ముందు కుడా ఆ ఆకర్షణ శక్తి ఉండేదే. కానీ అంతే సాధారణ విషయమయిన టెలిఫోన్ సంగతి అలా కాదు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ దానిని సృష్టించక ముందు అటువంటి యంత్రం లేదు. న్యూటన్ మహాశయుడు గుర్తించిన గురుత్వాకర్షణ శక్తి ఒక ప్రాకృతిక నియమం. దానిని ఆయన సృష్టించ లేదు కేవలం దర్శించి సిద్ధాంతీకరించారు. వేదాలూ అంతే. తపస్సుచేసి, ధ్యానించి వాటిని మహా ఋషులు మనకు గురు-శిష్య పరంపర ద్వారా అందించారు. శృతి, ఆమ్నాయము, నిగమము అని కూడ వేదాన్ని సంభోదిస్తారు. గురువు నుంచి శిష్యుడు విని మననం చేసి నేర్చుకోనబడే అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూలము. ఆ అనంత వేద సాగరంనుంచి మహర్షులు కొన్ని మంత్రాలను మాత్రమే గ్రహించ గలిగారు. అనంతుడైన ఈశ్వరుని నిశ్వాసితాలను పుర్తిగా గ్రహించగలగడం సాధ్యమేనా?

వేదం

వేదానికి భిన్నమైన పాఠాలు, భిన్నరీతులలో పఠించే పద్దతులున్నాయి. వీటిని పాఠాంతరాలంటారు. అలాంటి ఒకో పద్దతిని శాఖగా భావించవచ్చును. లెక్కకుఅందనన్ని ఉన్నా, కొన్నింటిని మాత్రం కూర్చి నాలుగు వేదాలుగా వర్గీకరించారు. ఒకటైన వేదాన్ని వ్యాసులవారు విభాగించారని చెబుతుంటారు. కనుకనే ఆయనకు వేద వ్యాసుడని పేరు వచ్చిందని విశ్వాసం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియూ అథర్వణ వేదం. ఋగ్వేద శాఖలు పూజారాధనలను, యజుర్వేద శాఖలు యజ్ఞ విధానాలను, సామవేద శాఖలు దేవతలను ప్రీతి పరిచే సంగీతరూపమైన మంత్రాలను, అథర్వణవేద శాఖలు యజ్ఞ నిర్వహణా మనుష్యుల రక్షణా మంత్రాలను అందిస్తాయి.

చతుర్వేదాలు

చతుర్వేదాలు

చతుర్వేదాలు కలిపితే ఒక వెయ్యి ఒక వంద ఎనభై శాఖలుంటాయి. వీటన్నిటిలో లక్షపైచిలుకు శ్లోకాలున్నాయంటారు. కానీ ప్రస్తుతం సుమారుగా ఇరవై వేలపైచిలుకు శ్లోకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

వేదసకలనం

వేదసకలనం

ప్రతి వేదశాఖని నాలుగు భాగాలుగా వర్గీకరించవచ్చును. మంత్ర సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు మరియూ ఉపనిషత్తులు. మంత్ర సంహిత మంత్రాల సంకలనములు. బ్రాహ్మణాలు ఆ వేద మంత్రాల తాత్పర్యం మరియూ వాటికి సంబందించిన తంతును తెలియజేస్తాయి. ఆరణ్యకాలు వీటిని తాత్వికంగా పరిశిలిస్తాయి. ఇక చివరివైన ఉపనిషత్తులు వీటిలోని జ్ఞానాన్ని అందజేస్తాయి. మరో దృక్పదంలో చూచినట్లైతే మంత్ర-సంహితా బ్రాహ్మణాలు కర్మ కాండగా, ఆరణ్యకాలు ఉపాసన కాండగా, ఉపనిషదులు జ్ఞానకాండగా గోచరిస్తాయి.

వేదాంగాలు

చతుర్వేదాలకు ఆరు వేదాంగాలున్నాయి. వీటిలో ప్రవేశంలేకపోతే వేదాధ్యయనం కష్టతరమే!
1. శిక్ష – ఉచ్చారణకు సంబందించిన వేదాంగం
2. వ్యాకరణము – వ్యాకరణకు సంబందించిన వేదాంగం
3. ఛందస్సు – వ్రాతకు సంబందించిన వేదాంగం
4. నిరుక్తము – నిఘంటువు వంటిది. ప్రతిమాట వ్యుత్పత్తి, అర్థము వివరించేది
5. జ్యోతిషం – గ్రహగతులకనుగూణంగా సరైన సమయాన్ని తెలియజెప్పే వేదాంగం
6. కల్పం – కర్మ లేదా ఒక తంతు విధి విధానాలను వివరించే వేదాంగం

ఉపవేదాలు

నాలుగు వేదాలు. వాటి ఆరు వేదాంగాలు. ఇవికాక నాలుగు ఉపవేదాలు కూడా ఉన్నాయి.
1. ఆయుర్వేదం
2. అర్థశాస్త్రం
3. ధనుర్వేదం – యుద్ధవిద్య
4. గాంధర్వవేదం – లలిత కళలైన సంగీత, నృత్య నాటకాలు ఇత్యాదుల శాస్త్రం

సారాంశం

వేదాల గురీంచి క్లుప్తంగా ప్రస్తావించి ఇది ప్రామాణం అని ముగీంచలేము. సాధారణంగా వంటకాలలో తీపి రుచికి మూలము చెక్కెర లేదా బెల్లము. కానీ వాటిని అలాగే స్వీకరించము. పండక్కి చెక్కెరో లేక బెల్లమో తెచ్చి అలాగే సేవించడం సాధారణంగా చెయ్యరు. ఒక వంటకంలో వాటిని చేర్చి మధుర పధార్థాన్ని వండి వాటిని సేవిస్తుంటాము. తీపికి మూలం చెక్కెర. కానీ దాన్ని అలాగే సేవించడం ఎలా కుదరదో, వేదాన్ని సామాన్య జన జీవనానికి యథాతదంగా అనుసంధానించడమూ కష్టమనే చెప్పాలి. మూల ప్రామాణం వేదమయినప్పటికీ, మన జీవితాలకు తేలికగా మార్గదర్శకత్వం చేయడానికి, సులభంగా అర్థం చేసుకోడానికి, వేరే సాధనాలు కావాలి. వాటి గురించి మరో టపాలో ప్రస్తావిస్తాను. తేలికగా జ్ఞాపకముండడానికి పై విషయాలనన్నిటిని ఒక చిన్న బొమ్మగా క్రీంద జోడించాను.

మూల ప్రామాణాలు

మూల ప్రామాణాలు

–సశేషం

ప్రకటనలు
 1. 2:33 ఉద. వద్ద జనవరి 29, 2011

  క్షమించాలి. వేదాల గురించి నాకు ఏమాత్రం తెలియదు. నావి రెండు ప్రశ్నలు
  వేదాలలో మన జీవన విదాన ప్రామాణాలు ఉంటాయా?

 2. 7:52 సా. వద్ద జనవరి 29, 2011

  వేదాలని గురించి సరళంగా రాయడం బాగుంది. ఇది ఒక సిరీస్‌గా రాస్తారని ఆశిస్తాను.
  పైన ప్రశ్న అడిగిన రవి గారికి – మీ ఉద్దేశంలో జీవన విధాన ప్రమాణాలు అంటే ఏంటి? ప్రమోషన్ ఎలా సంపాయించాలి, పిల్లకి పెళ్ళి ఎలా చెయ్యాలి, పిల్లోణ్ణి ఏదన్నా పదవిలో ఎట్టా కూర్చోబెట్టాలి, ఎన్ని అప్పుల్లో కూరుకుపోయినా స్ట్రెస్ లేకుండా ఎలా ఉండాలి – ఇలాంటివైతే ఉండవు. మనిషి ఏమి చేస్తే తన సహజమైన స్థానాన్ని పొందగలుగుతాడో అది ఉన్నది.

 3. 8:36 సా. వద్ద జనవరి 29, 2011

  కొత్తపాళీ గారు, మీరు చదివారా వేదాలు, ఊరికే అడుగుతున్నాను.సహజమైన స్తానం అంటే ఏమిటి? ఏమి చెయ్యాలి వాటికి?

 4. 2:42 ఉద. వద్ద జనవరి 30, 2011

  @రవి గారు, కొద్దిగా చదివాను. బాగా తెలిసిన వారు చెప్పినవి విన్నాను. మనిషి జన్మ ఎత్తినందుకు మానవుడికి సహజమైన స్థానం ఒకటి ఉన్నది. దాని స్వరూపం ఏమిటో, ఎలా చేరుకోవాలో ముందు వేదాల్లో, ఉపనిషత్తుల్లో, అటుపైన భగవద్గీత వంటి బోధనల్లో, పతంజలి యోగసూత్రాల్లో, వీటన్నిటిపైన వచ్చిన భాష్యాల్లో వివరంగా చెప్పారు. నేను చెప్పగలిగేంత వాణ్ణి కాను. ఎవరికైనా ఆ తృష్ణ ఉంటే, వారికి తగిన గురువు లభిస్తారు, సరైన దారి చూపేందుకు.

 5. 9:22 ఉద. వద్ద జనవరి 31, 2011

  కొత్తపాళీ గారు, ధన్యవాదాలు. మీరు ధన్యులు, వినే,తెలుసుకునే అదృష్టం కలిగినందుకు.
  నేను వెతుకుతున్నాను ఒక గురువు కోసం.
  బాటసారి

  Visit Bighelp For Education

 6. durgeswara
  10:31 ఉద. వద్ద మార్చి 2, 2011

  మీబ్లాగు అభినందనీయము .
  ధార్మికచర్చలకోసం ఏర్పడ్డ వందేమాతరం నకు మీకు ఆహ్వానం పలుకుతున్నాము.
  మీవంటివారు వచ్చిచేరవలెనని మనవి
  లింక్
  https://groups.google.com/group/vandemaatulam?hl=en

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s