ముంగిలి > మన సంస్కృతి > స్త్రీలకు రజోవికారమేందుకు కలుగుతుంది?

స్త్రీలకు రజోవికారమేందుకు కలుగుతుంది?

మన దేశంలో ఎంతటి నవీన భావాలు కలిగిన స్త్రీ అయినా ఆ కొన్ని దినాలలో పుణ్యకార్యాలు, పెళ్ళిళ్ళు, గుళ్ళూ-గోపురాల యాత్రలు వంటి వాటికి దూరంగా ఉంటూ ఉంటుంది. మునుపటి కాలంలోలాగా చాలామంది ఓ మూలను కూర్చోకపోయినా, కొన్ని నిభందనలు వారంతట వారే విధించుకుంటారు. పూజామందిరంలోకి వెళ్ళటం వంటివాటికి దూరంగా ఉంటారు. కాని బహుశః కొద్దిమందికే దీని పౌరాణిక కారణం తెలుసు. ఈ టపాలో ఈ విషయంపై అభిప్రాయ వ్యక్తీకరణ నా ఉద్దేశ్యం కాదు. పౌరాణికంగా ఈ విషయం ఎక్కడ ప్రస్తావించ బడింది, ఆ సంధర్భం ఏమిటి అని తెలుపడమే!

కానీ ముందుగా ఓ రెండు గమనించవలసిన ముఖ్య విషయాలు.

1. పురాణాలలో ఒక విషయాన్ని తేలికగా పట్టుకొనడానికి వీలుండే విధంగా, కథల రూపంలో ప్రతిపాదించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. విటిని యథాతధంగా విశ్లేషిస్తే, “ఇలా జరుగుతుందా?” అనే భావనలు తలెత్తుతాయి. అందుకని, వీటిని సాంకేతిక పరంగా విశ్లేషించడం సాధ్యం కాదు.

2. చలన చిత్రాలలో, ధారావాహికాలలో, నాటకాలలో, ఇంద్రుడు-నారదుల వంటి వారిని తప్పుగా చిత్రీకరిస్తుంటారు. ఎప్పుడు తప్పులు చేస్తూ ఇంద్రుడు, గోడవలు పెడుతూ నారదుడు చూపించబడుతూ ఉంటారు. నూటికి తొంబై తొమ్మిది శాతం అలాగే అనుకుంటారు కూడా! అది సరి కాదు. ఈ పౌరాణిక ప్రస్తావనలో ఇంద్ర దేవుడి పాత్ర ప్రధానం. ఇప్పటికి నా మాట నమ్మి తొందర పడి తీర్పులకు విమర్శలకు తావివ్వకండి. నిత్య జీవితంలో స్త్రీజాతికి రజోవికారం శారీరిక ధర్మం, ప్రాకృతిక నియమం. దానికి శాస్త్రీయంగా కారణాలూ ఉన్నాయి. ఈ టపా కేవలం పౌరాణిక కోణంలో తెలుసుకోడానికే.

ఈ విషయం ఆష్టాదశ పురాణాలలో ప్రశస్తి వహించిన శ్రీమద్భాగవత పురాణంలో ఆరవ స్కందమునందు ప్రస్తావించబడినది. బమ్మెర పోతనామాత్యులు తెలుగులో అనువదించిన సంగతి అందరికీ తెలిసిందే!

విశ్వరూపుడు దేవతలకు ఆచార్యుడై యజ్ఞాలు చేయిస్తూ వారితో కలసి మెలసి ఉంటూ వారితోపాటు హవిర్భాగాలు అందుకుంటూ ఉండేవాడు. ఈయనకు మూడు శిరస్సులు. వానిలో మొదటి తల సురాపానం చేస్తుంది. రెండోతల సోమపానం చేస్తుంది. మూడో తల అన్నం భుజిస్తుంది. ఇలా ఉండగా అతని బుద్ధిలో మార్పు వచ్చింది. ఆతని తల్లి రచన రాక్షసుల ఆడపడుచు.  విశ్వరూపుడు యజ్ఞాలలోని హవిర్భాగాలను తల్లివైపు వారైన రాక్షస ప్రముఖులకు పంచిపెట్టడం మొదలు పెట్టాడు. ఈ సంగతి తెలుసుకున్న దేవేంద్రుడు భయభ్రాంతుడై విశ్వరూపుని మూడు శిరస్సులను ఖండించాడు.

భూసురుఁ డనక మహాత్మా, గ్రేసరుఁడన కతఁడు పూర్వకృత కర్మగతిన్ వేసరఁ డనక మహేంద్రుఁడు, భూసురు తల లపుడు రోషమునఁ దెగ నడిచెన్.

బ్రాహ్మణుడని భావించకుండా, మహానుభావులలో మహనీయుడని తలచకుండా, విధివైపరీత్యంవల్ల ఇలా జరిగిందని అనుకోకుండా, మహేంద్రుడు రోషావేశంతో విశ్వరూపుని తలలు తెగగొట్టాడు. అప్పుడు సోమపానంచేసే శిరస్సు కౌజుపిట్టగా, సురాపానం చేసే శిరసు కలవింకమయింది. అన్నం భక్షించే శిరస్సు తీతువుపిట్ట అయింది. ఈ విధంగా బ్రహ్మహత్యా మహాపాతకం మూడు విధాలైన పక్షి రూపాలు ధరించి ఇంద్రుణ్ణి చుట్టుముట్టి మమ్మల్ని పరిగ్రహించమని నిర్భంధింప సాగింది. త్రిలోకాలకు అధీశ్వరుడైనప్పటికీ ఆ బ్రహ్మహత్యను తప్పించుకొనలేక పోయాడు. చేతులొగ్గి ఆ మహాపాపాన్ని స్వీకరించాడు. ఒక సంవత్సర పర్యంతం భరించాక ఇక వల్ల కాక ఎలాగైనా వదిలించుకోవాలని నిశ్చయించి భూదేవిని, జలాలను, వృక్షాలను, స్త్రీలను పిలిచి ఆ మహాపాపాన్ని నాలుగు విధాలుగా చేసి మీరు పుచ్చుకోండి అని ప్రార్థించాడు.

…ధరణి యిరిణ విధంబునను, నుదకంబు బుద్బుదఫేన రూపంబునను, మహీరుహంబులు నిర్యాసభావంబునను, నింతులు రజోవికారంబునను నిట్లు చతుర్భాగంబులం బంచికొనిరి. ఆంత.

భూమి ఆ ప్రభావంవల్ల ఉప్పురియటం, చౌడు కురియటం రూపంలో ఆ దోషాన్ని ప్రకటించింది. జలాలు బుడగల రూపంలోనూ నురుగు రూపంలోనూ ఆ పాపాన్ని స్వీకరించాయి. చెట్లు జిగురు రూపంలో ఆ పాపాన్ని అందుకొన్నాయి. స్త్రీలు రజోవికారం రూపంలో ఆ పాపాన్ని పంచుకొన్నారు.

దీనికి ప్రతిఫలంగా ఈ నలుగురు ఇంద్రుడినుంచి వరాలు పొందారు. భూమి తనయందు చేయబడిన గోయి దానంతట అదే పూడి పోయేటట్లుగా, జలాలు సమస్తమూ తమయందు ప్రక్షాళనం కాగానే పవిత్రం అయేటట్లుగా, వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లు వరం కోరి పొందారు.

ఇది స్త్రీల రజోవికారం వెనకనున్న పౌరాణిక కారణం! తెలిసిన పెద్దవాళ్ళు అందుకే పిల్లలను చెట్టు జిగురుతో, నీటి బుడగలతో ఆడుతుంటే వారిస్తుంటారు. అంటే ఇప్పుడు నురగ రాని సబ్బులు వగైరాలు వెతుక్కోమని కాదు. ఎలా నడుస్తున్నదో అలాగే నడవనీయడం మేలు. కాకపోతే కారణం తెలుసుకున్నారు. అది తృప్తి! సహజంగా చేరే నురగకి దూరం ఉంటే మంచిది. చెట్ల జిగురంటారా? చెట్లేవి? వాటినెక్కి ఆడుకునే పిల్లలేరి? ఆ గొడవ లేనే లేదుగా?

ప్రకటనలు
వర్గాలుమన సంస్కృతి ట్యాగులు:
 1. Seetharam
  2:07 ఉద. వద్ద ఫిబ్రవరి 2, 2011

  What blessing did women got for bearing the sin?

  Regards

  Seetharam

 2. Indian Minerva
  8:32 ఉద. వద్ద ఫిబ్రవరి 2, 2011

  నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. ఈ “కలవికానిక”మనేది పక్షిపేరా? ఐతే దాని తెలుగు పేరు లేదా వ్యవహారిక నామమేమిటి? చిన్న పిల్లలను నీటిబుడగలతో ఆడుకోకుండా నిరోధించడంలో శాస్త్రీయత వున్నట్లు నాకనిపించడంలేదు వివరించగలరు.

 3. Indian Minerva
  8:57 ఉద. వద్ద ఫిబ్రవరి 2, 2011

  మహాపాతక రూపమైనప్పుడు కౌజు పిట్టని హిందువులు అశుభంగా భావించాలిగా. మరి భావించరేందుకు?

 4. 4:40 సా. వద్ద ఫిబ్రవరి 2, 2011

  కలవికానిక అనే శబ్దం లేదు. కలవింకము ఉంది. కలవింక మంటే పిచ్చుక.

 5. 8:39 సా. వద్ద ఫిబ్రవరి 2, 2011

  సితారాంగారు: కావాలనే ఆ విషయాన్ని స్పృశించడం జరగలేదు. కానీ, మీ ప్రశ్న సమంజసమే! సమాధానం “…భూమి తనయందుఁ బ్రక్షాళితం బైనం బావనం బగు నట్టి వరంబును, వృక్షంబులు ఛేదింపబడి పునఃప్రరోహంబు గలుగునను వరంబును, స్త్రీలెల్లప్పుడుం దమకుఁ గామసుఖంబు గలుగు నను వరంబును గోరిన, నతం డట్లుగాక యని యొసంగిన…

  Indian Minerva: అచ్చుతప్పు సరిదిద్దడం జరిగింది. శంకరయ్య మాష్టారుగారి సవరణ, దాని అర్థము మీ మొదటి ప్రశ్నకు సమాధానం.

  మొదట్లోనే వివరించినట్టు, పురాణ విషయాలన్నీ యథాతధంగా శాస్త్రీయ కోలమానంలో తూయలేము. చెట్ల జిగురు కూడా ఏమి పాపం చేసిందని? విషయాన్ని లోతుగా విచారిస్తే, వీటన్నిటికి ఏదో ఒక బలమైన శాస్త్రీయ కారణం లభించగలదు. రాబోవు టపాలలో, ఈ విషయాన్ని తప్పకుండా ప్రస్తావించి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నిరీక్షించగలరు.

  కౌజు పిట్ట సంగతంటారా? ఉన్న మాట చెప్పాలంటే, దాని విషయం నాకు పూర్తిగా తెలియదు; అందుకని ఇప్పటికి దాటవేసినా, పై విధంగానే, సమాధానానికి ప్రయత్నిస్తాను.

  కంది శంకరయ్యగారు: మీ సవరణ-వివరణలకు కృతజ్ఞతలు.

 6. 10:54 సా. వద్ద ఫిబ్రవరి 2, 2011

  good info..

 7. lak
  8:02 ఉద. వద్ద ఫిబ్రవరి 3, 2011

  దీనికి ప్రతిఫలంగా ఈ నలుగురు ఇంద్రుడినుంచి వరాలు పొందారు. భూమి తనయందు చేయబడిన గోయి దానంతట అదే పూడి పోయేటట్లుగా, జలాలు సమస్తమూ తమయందు ప్రక్షాళనం కాగానే పవిత్రం అయేటట్లుగా, వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లు వరం కోరి పొందారు

  What women got benefit?

  సమాధానం “…భూమి తనయందుఁ బ్రక్షాళితం బైనం బావనం బగు నట్టి వరంబును, వృక్షంబులు ఛేదింపబడి పునఃప్రరోహంబు గలుగునను వరంబును, స్త్రీలెల్లప్పుడుం దమకుఁ గామసుఖంబు గలుగు నను వరంబును గోరిన, నతం డట్లుగాక యని యొసంగిన…”

  I don’t understood any thing from above answer. Please tell me clearly what women got the benefit.

 8. kamal
  5:29 సా. వద్ద ఫిబ్రవరి 7, 2011

  pls answer to lak
  (Please tell me clearly what women got the benefit.)

 9. 6:28 సా. వద్ద ఫిబ్రవరి 7, 2011

  Well, the benefaction was Corporeal Copulatory Bliss. Hope this answers!

 10. kishore
  1:50 సా. వద్ద ఏప్రిల్ 24, 2012

  I thnink Women also got benefit… that benefit is is she ll get pregnant…. nd every girl proud 2be a mother..

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s