ముంగిలి > పిచ్చాపాటి, హాస్యం > పండుకి స్పృహ తప్పిందా?

పండుకి స్పృహ తప్పిందా?

క్రితం నెలే పదహారు దాటి పదిహేడేళ్ళొచ్చాయి. “నిన్నే పెళ్ళాడతా” చిత్రంలో టబూ గుర్తొచ్చిందా? అవును. పండు చిన్నప్పుడు ఆ సినిమా చూసి వాళ్ళమ్మకు బాగా నచ్చేసి ముద్దుపేరుగా అలా పిలవడం మొదలుపెట్టారు. అసలు పేరు చాలా తక్కువ మందికే తెలుసు. ఎంతో గొప్పదైనా విడగొట్టడం పిచ్చపిచ్చగా కుదించి అర్థాలుమారే విధంగా పిలవడం ఇష్టంలేక పండు అన్న పేరుతోనే పిలిచేవాళ్ళు. పెళ్ళైన పన్నేండేళ్ళకు కలిగిన ఏకైక సంతానం. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏఁవడిగితే అది. ఏమి కావాలంటే అవి. కళ్ళళ్ళో పెట్టుకోని పెంచుకున్నారు పండు తల్లి తండ్రులు. పండు కూడా ఇచ్చిన శ్వేచ్ఛని ఎప్పుడూ దుర్విన్యోగం చేయలేదు. క్లాసు ఫష్టు కాకపోయినా, కనిసం ఎనభై శాతానికి తగ్గకుండా మార్కులు. ఆటల్లో చాలా చురుకు. చదరంగం, కారంబోర్డులలో మంచి నైపుణ్యం. గుళ్ళూ గోపురాలంటే చిరాకు పడకుండా వెళ్ళే అలవాటు. పెద్దలకు మర్యాద ఇవ్వడం, చిన్నపిల్లలతో తేలికగా కలిసిపోవడం…వగైరా…వగైరా అన్నమాట. వెరసి ప్రతి తల్లీ తండ్రి సంతానం ఎలా ఉండాలనుకుంటారో అలా!

పాలరాతి వన్నెలో మెరిసిపోయే నున్నటి చర్మం. అందమైన ముక్కు, చిన్న నోరు, పెద్ద కళ్ళు. ఇప్పుడే పెడీక్యూర్ మానిక్యూర్ చేయించుకున్నట్టు చేతులు పాదాలు.  అంత లావూ కాదు సన్నం కాదు. తోటి వయసు వాళ్ళు తరచూ అసూయ పడుతూండేవాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే మొదటిసారి చూసిన వాళ్ళు తమ చూపును అతి కష్టంమీద పక్కకు తిప్పుకునేవాళ్ళు. పదహారేళ్ళ వయసులో ఎర్రగా బుర్రగా ఉంటే అంతే మరి!

పండు వాళ్ళ నాన్నగారు బ్యాంకు ఉద్యోగి. ప్రతి మూడు-ఐదేళ్ళకు బదిలీలు. ఇప్పుడు కర్నూలు పట్టణంలో చేస్తున్నారు. పండువాళ్ళ మెనమామ కూతురైన మధుమతి పెళ్ళికై అమలాపురం వచ్చారు. అక్కా చెల్లెళ్ళెవరూ లేరు కాబట్టి పండుకి మధుమతి అంటే చాలా మక్కువ. ఒకళ్ల ఊరు ఒకళ్ళు వెళ్ళినప్పుడు అక్కా అక్కా అంటు ఎప్పుడూ మధుమతి చుట్టూ తిరగడమే. మధూకి కూడా పండు అంటే చాలా ప్రేమ. తను కూడా ఒక్కగానొక్క కూతురు పండు వాళ్ళ మేనమామగారికి.

పెళ్ళికి వారం ముందే దిగారు, పండుతో సహా వాళ్ళ అమ్మా నాన్నలు. అంత ఉపోద్ఘాతం చదివాక ఇక పండుగురించి పెళ్ళి పనుల్లో “ఫుల్ల్ బిజి” అని వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను! “పండూ…ఆ పూలు ఇలా పట్రా” అంటు ఒకళ్ళు అరుస్తుంటే, ఇంకో పక్కనుంచి బామ్మ గారు “పండూ…నా కళ్ళాద్దాలు కాస్త చూసి పెట్టు” అంటూ అరుపు. ఇక పిల్లల సంగతి సరే సరి. వాళ్ళందరితో పండు ఎంతో బాగా కలిసిపోయిన పుణ్యమా అని తల్లి బాతు చుట్టూ పిల్ల బాతుల్లా, పిల్లలందరూ “పండూ…పండూ” అని వెంట పడుతు ఆడుకుందామని పిలుస్తున్నారు. చాలా కోలాహలం. అసలే తెల్లటి వన్నె, దానికి తోడు కాస్త కొట్టొచ్చినట్టు కనబడే ఆకుపచ్చ దుస్తులు. ఎండా కాలమేమో, కాస్త చిరు చెమట కూడా పట్టింది. మొత్తానికి అందరి దృష్టి పండుపైనే!

ఆ పేళ్ళికి గిరి అనే ఒక ప్రభుద్ధుడు కూడా తగలడ్డాడు. అర్థం కాని వ్యవహారం. విచిత్రమైన వేషధారణ.

పక్కన బామ్మగారి గుసగుసలు వినిపించాయి పండుకి. “గిరిగాడు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడా? ఇంకా అటూ ఇటూ తిరుగుతూండే ఉద్యోగమేనా? ఎక్కడన్నా కుదుట పడ్డాడా? ఇప్పుడెక్కడ? ఇంకా ముంబైలోనేనా?” అని. ఎవరా అనుకుంటుండగా గిరిగాడొచ్చి పలకరించాడా బామ్మగారిని. అప్పుడర్థమైంది పండుకి; గిరి అంటే ఎవరని. బామ్మగారిని పలకరిస్తూ అటూ ఇటూ చూస్తుండగా గిరిగాడి కళ్ళు మన పండు కళ్ళతో కలిశాయి. పండు ఒక చిరునవ్వుతో పలకరిస్తే గిరిగాడి కళ్ళు అలా అతుక్కుపోయాయి పండు మీద. “హెల్లో” అని పలకరించి తప్పుకుందామనే పండు ప్రయత్నంతో, గిరిగాడి చూపులు విడి బామ్మగారితో మళ్ళీ మాటల్లో పడ్డాడు. పెళ్ళి హడావుడిలో అవకాశం దొరికినప్పుడల్లా లేదా అవకాశం కల్పించుకొని మరీ గిరిగాడు పండుతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

పెళ్ళి చాలా బాగా జరిగింది. పెళ్ళిభోజనం చాలా బాగుందని అందరూ అనుకున్నారు. దేవుడి దయవల్ల ఏ అపశృతి చోటు చేసుకోలేదు. “ఇవాళ రాత్రే మనం పెళ్ళి మడపం ఖాళీ చేయాలి” అని మధుమతి వాళ్ళ నాన్నగారు అందరినీ తొందర పెడుతున్నారు సామాన్లు సద్దుకోమని. ఎప్పడిలాగే మన పండు “ఫుల్ల్ బిజి.” కబుర్లాడడం మానేసి అందరూ సద్దుకోవడంలో నిమగ్నమైపోయారు. సాయంత్రం మళ్ళీ ఇంటి దగ్గిర బోలెడంత పనాయె!

మండపానికే ఆనుకోనున్న గదిలోకి ఓ పెద్దావిడ ఏదో తెచ్చుకుందామని వెళ్ళి ఒక్కసారిగా కేక పెట్టింది స్పృహ తప్పి పడిఉన్న పండుని చూసి. అందరూ ఎక్కడి సద్దుడు యవ్వారం అక్కడే ఆపేసి పరిగెత్తారు. పండు వాళ్ళ అమ్మా-నాన్న సంగతి వేరే చెప్పాలా? ఎం జరిగింది? ఏమయింది? అనే ఆరాటం. ఎంతైనా పండంటే అందరికి అభిమానమే. కాస్త నీళ్ళు మొహాన చిలకరించి మెల్లిగా స్పృహలోకి తెచ్చారు. కాస్త సోడా తాగించి మెల్లిగా విచారించారు ఏమి జరిగిందని. ఒక్కసారిగా అందరికీ ఒళ్ళు మండిపోయినట్టు అరుపులు – వెతుకుడు. “ఏడి ఆ గిరి గాడు,” “ఏం పోయే కాలం వాడికి?” “ఇవేం పిచ్చపన్లు?” “అవ్వా!” “ఛి ఛీ!” అని సద్దడం విషయం మరచి జొరబడిన పాముకోసం వెతికినట్టు గాలిస్తున్నారు గిరి గాడి కోసం.

పండు పక్కనే అవాక్కై అమ్మా-నాన్నలు నుంచోనున్నారు. మొహంలో అసహ్యం-ఆశ్చర్యం! ఎంటిది? ఇలా కూడా జరుగుతుందా? అని వీస్తూపోతు. మళ్ళీ ఆడిగారు సావధానంగా ఏం జరిగిందో చెప్పమని. “నేనేమో ఈ గదిలో పెట్టిన సూట్కేస్ బయటకు తెద్దామని వచ్చాను. వెంట వెంట గిరి కూడా జొరబడి తలుపులు మెల్లిగా మూసి నా దగ్గరకొచ్చాడు. మీద మీద పడిపోతు ఏంటేంటో వాగాడు. అర్థం కాలా! మెల్లిగా వాడి చెయ్యి నా మీద వేసే ప్రయత్నం చేస్తుంటే చిరాకొచ్చి కాస్త దూరంగా తోసా. మళ్ళీ దగ్గిరకొచ్చి ఏవేవే పిచ్చ మాటలు పేలాడు. ఇక విసుగొచ్చి బయటకు వద్దామనుకుంటుంటే చెయ్యి పట్టి లాగి క్షమాపణ చెప్పడం మొదలు పెట్టాడు. వాడిని తప్పించుకొని బయటకు వస్తుంటే గట్టిగా చెయ్యి పట్టి మళ్ళీ లాగితే విసురుగా వెళ్ళి కింద పడ్డా. తర్వాత మీరంతా!” అని. ఇంతకీ పండు అసలు పేరు చెప్పలేదు కదూ. యజ్ఞ వరాహ ముర్తి. ఒక్కగానొక్క కొడుకు.


ప్రకటనలు
 1. krishna
  11:07 సా. వద్ద ఫిబ్రవరి 5, 2011

  బాబోయ్ ఇంత షాకేంటండి బాబు ???

 2. pandu
  2:01 సా. వద్ద ఫిబ్రవరి 7, 2011

  Nice naration never got to know whether pandu is “HE” or “SHE” till end. Next time becareful, do not think of “tabu” or any other girl when you hear a name like “pandu” LoL

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s