ముంగిలి > జిడ్డు ప్రశ్నలు > ఇలా ఎందుకు జరుగుతుంది? – పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల లెక్చరర్లు

ఇలా ఎందుకు జరుగుతుంది? – పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల లెక్చరర్లు

గురుః బ్రహ్మా, గురుః విష్ణుః గురుదేవో మహేశ్వరః…ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా కంఠస్తమైన శ్లోకము. ఈ కాలంలో అందరూ కనీసం పాఠశాలలో, స్థోమత ఉంటే కళాశాలలో “చదువుకున్న” లేక “చదువుకొన్న” వాళ్ళే! పాఠశాలలో ఉపాధ్యాయులు కళాశాలలో ఉపన్యాసకులు (లెక్చరర్లు) మన విద్యాధ్యయనంలో తోడ్పడిన వాళ్ళు. ఈ రెండు గుర్తింపులకు తేడా “ఎంత వివరంగా” విషయాలను బోధించారన్నది. పెరిగి పెద్దవారవుతున్న కొద్ది, గ్రహించే శక్తి పెరిగి, చిన్న పిల్లలకు సవిస్తారంగా బోధించినంత అవసరం ఉండదు కాబట్టి కళాశాలలో బొధకులను “టిచర్” అనకుండా “లెక్చరర్” అని సంబోధిస్తారు. కానీ మౌలికంగా ఇద్దరి వృత్తి ఒక్కటే. ‘బోధన’. ఒకరు పూర్తిగా వికసించని మెదడు గలవారికైతే ఒకరు కాస్తంత ఎదిగిన మనుషుల కోసం. ఇద్దరు గురువులే కదా? కానీ ఇక్కడే నాకు బోధపడని విషయం ఒకటుంది.

పాఠశాల ఉపాధ్యాయులకిచ్చినంత గౌరవం, కళాశాల ఉపాధ్యాయులకెందుకివ్వరు? “చిన్నప్పటి మా మాష్టారుగారు“, “మా టీచర్ గారు” అని ఎదో ఒక విధంగా వారికి మన జ్ఞాపకాలలో గౌరవనీయ స్థానం ఇస్తాము. కానీ కళాశాల లెక్చరర్లను అంతటి హోదాలో కూర్చోపెట్టము. “అలా కాదు! మీరు పప్పులో కాలేశారు. నాకు మా పాఠశాల ఉపాధ్యాయులెవ్వరూ గుర్తుకు లేరు కానీ మా బోటనీ లెక్చరర్ గారు మాత్రం దైవంతో సమానం” అని అనకండి. ఉంటారు. ఉపాధ్యాయులలో మనం మరచిపోయిన వాళ్ళుంటారు, లెక్చరర్లలో “రాధాకృష్ణ” వంటి వారూ ఉన్నారు, కాదనను. కానీ సాధారణంగా పాఠశాల ఉపాధ్యాయులకే పెద్ద పీఠ. మళ్ళీ చెబుతున్నా. “సాధారణంగా

సాక్ష్యం కావాలంటే చలన చిత్రాలను చూడండి! నూటికో కోటికో ఒక్క చిత్రంలో పాఠశాల ఉపాధ్యాయుడిని తప్పుగా చూపించొచ్చేమో కానీ, ప్రతీ మూడో చిత్రంలో లెక్చరర్లను ఒక “బఫ్ఫూన్ కారెక్టర్” లా వాడుకుంటారు. మనసుకు బాధ కలుగుతుంది. ‘గురువు’ అనే కనీస మర్యాద లేకుండా చాలా అసహ్యంగా చూపిస్తుంటారు. విధ్యార్థులతో వెక్కిలిగా ప్రవర్తిస్తూ, మరో ఆడ లెక్చరర్ వెంట పడుతూ, వెధవలకు పెద్ద పీఠ వేస్తూ…ఛీ ఛీ!!!

విద్యతో పాటు వినయం వస్తుందంటారే? మరి ఇదేంటి? విజ్ఞానం పెరిగిన కొద్దీ గురువులకు మర్యాద తక్కువ ఇవ్వాలని ఎలా బోధ పడుతుంది? గౌరవం ఇవ్వకపోవడం కాస్తో కూస్తో అరాయించుకోవచ్చు, కానీ ఇలా కించ పరిచే విధంగా చిత్రీకరించడం దేనికి?

ఎంటో? కొన్ని విషయాలు ఎంతకీ అర్థం కావు!

గమనిక: నేను ఏ రకంగానూ విద్యారంగంతో సంబందం లేని వ్యక్తిని.

ప్రకటనలు
  1. aswinisri
    1:38 సా. వద్ద ఫిబ్రవరి 11, 2011

    నాకు తెలిసి టీన్ ఏజ్ రాక పూర్వం పిల్లల్లో నేర్చుకోవడం అనేది ఎక్కువ శాతం అనుకరణ ద్వారా జరుగుతుంది.వాళ్ళకు నచ్చిన వాళ్ళని ఎంచుకుని,వాళ్ళని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు–హీరోలు, వగైరాలు వదిలేస్తే,వాళ్ళు చూసేవాళ్ళు తల్లితండ్రులు,టీచర్లు వుంటారు.ఇక కాలేజీకి వస్తే,వయసుతోబాటే ఈ లక్షణం కొంచెం మారి చుట్టూ ప్రతీదాని ఇది ఇలా వుండకూడదు, దీన్ని మార్చేసి ఏదో చేయాలి అనే తపన,ఇంతకు ముందున్నవారి కంటే మనం ఎక్కువ అనే దూకుడూ స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని పాజిటివ్ గా మార్చుకుని కొంచెం ఓపికగా ప్రయత్నిస్తే , కాలేజీ లెక్చరర్లకీ ఆ గౌరవం దక్కుతుంది. అయితే దానికి సరిపడే టైం వీరికీ, అటు విద్యార్థులకీ దొరకట్లేదేమో!ఏదైనాగానీ సినిమాల్లో చూపించినంత ఛండాలంగా నిజానికి కాలేజీ పిల్లలు కూడా లేరు. నాకు తెలిసి! ముఖ్యంగా వాళ్ళకు అంత తీరిక లేదు.నాకు విద్యారంగంతో అంతో ఇంతో సంబంధం వుందండీ!:)కాబట్టి ఇదంతా పిల్లల్లోని లెర్నింగ్ యాటిట్యూడ్ ని టీచింగ్ చేసే వాళ్ళు ఉపయోగించుకోవడంలో వుందనిపిస్తుంది. అయితే వొకటి, చెప్పేదొకటి చేసేదొకటి లాగా టీచింగ్ కమ్యునిటివాళ్ళూ వుండకూడదు, పిల్లల్లూ వుండకూడదు. ఇదీ విషయం! ఆయ్యా! మరి సెలవ్!శ్రి మద్రమారమణ గోవిందో హారి!kaadanTaaraa? hammaa!ayitea miiku punishment tappadu!!!

  2. 10:52 సా. వద్ద మార్చి 8, 2011

    నిజమే. ఎంతైనా పసి వయసులో మనసు మీద ముద్ర పడినట్టు టీనేజిలో పడదు కదండీ. అదీకాక కాలేజికి వచ్చేప్పటికి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనే తపన ఎక్కువుంటుంది, అది ఇంకొకరి ప్రభావాన్ని (ఉపాధ్యాయులైనా) అంత ఈజీగా గుర్తించదు.

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s