ముంగిలి > పిచ్చాపాటి > ఆచార వ్యవహారాలు – సైన్స్

ఆచార వ్యవహారాలు – సైన్స్

సహజంగా మనిషి నైజం; తెలియని విషయాన్ని అనుమానించడం, తెలిసిన విషయాన్ని చులకనగా చూడడం. “అబ్బే! అంతా బూటకం“, “ఓ అదా! ఏడిశాడు. చిటికెలో పని.” ఎంత చదువుకోంటే అంత ఘాటుగా ఉంటాయి ఇలాంటి అభిప్రాయాలు. చదువుకున్న వాళ్ళ సంగంతి వేరనుకోండి.

ఈ రెంటిలో, తెలియని విషయాల గురించి కొన్ని అభిప్రాయాలు.

మనలో ఎంత మంది ఆణువు, పరమాణువులను చూశారు? డిఆక్సీరైబో కేంద్రక ఆమ్లం (DNA) తమ కళ్ళతో చూశారని ఎంతమంది చెప్పగలరు? ఏమో? కానీ, దానికి “సైన్స్” అనే పూత పూస్తే అంతే! బహుశః ఈ విషయాలను “సైన్స్” తెరపై కాకుండా, ఆచార వ్యవహారాలు, పురాతన నమ్మకాలన్న తెరపై చూపితే, నమ్మే వాళ్ళ కన్నా నమ్మని వాళ్ళే ఎక్కువుంటారు. అదే, చదువుకొన్న వాళ్ళు! “సైన్స్” అనగానే, ఏ విషయాన్నైనా నమ్మేస్తారు. “సైన్స్” అనే ఏకైక పదం ఈ కాలం మనిషిని “తెలియని విషయాలను” నమ్మించాలంటే బ్రహ్మాస్త్రం…కాదు కాదు “అంతర్మహాద్వీపీయ ప్రాక్షేపిక ఆణు ప్రక్షేపాస్త్రం” (ICBM).

మా చిన్నప్పుడు “సైన్స్” ప్రకారం గ్రహాలు తొమ్మిది. మరి ఇప్పుడో? ఎనిమిది. “ప్లూటో”ను పీకి పారేయడం జరిగింది జాబితాలోంచి. కానీ, అభ్యంతరాలెంత మాత్రం? అదే ఒక మోసగాడు నమ్మకం పేరిట ఒక వెధవ పని చేస్తే, మొత్తం ఆచార వ్యవహారాలను దుమ్మెత్తిపోస్తారు.

తొందర పడి నాకు సైన్స్ గురించి గల అభిప్రాయాల గురించి మీరు ఏ అభిప్రాయానికి రాకండోయ్. ఇలా ఒక టపాను రాసి నాకు తెలిసిన, తెలియని వాళ్ళతో ఇంటర్నెట్ ద్వారా శ్రమ లేకుండా, ఒక మాట మాట్లాడకుండా, ఒక్క అక్ష్రరం కాగితం మీద రాయకుండా వ్యక్త పరచ గలుగుతున్నానంటే, అది “సైన్స్” పుణ్యమా అనే. తలనొప్పి కలిగితే, పారాసిటామాల్ వేసుకుంటాను, మడి కట్టుకోని ఆయుర్వేదం మందే కావాలి అని భీష్మించుకొని కూర్చోకుండా. కృతఘ్నుడను కాదుసుమా!

వచ్చిన తిప్పల్లా, “సైన్స్” అంటే నమ్మడం, మన గంభీరమైన వైజ్ఞానిక ఆచార వ్యవహారాలను నమ్మకపోవడం. ఆ “సైన్స్” అన్న పదం వెనకనున్న నమ్మకాన్ని మోసంతో సొమ్ము చేసుకున్న సంఘటనలు లేవా? కానీ అదే అచార వ్యవహారాలనేటప్పడికి, ఎందుకో అపనమ్మకం, చదువుకొన్న వాళ్ళకి. అక్కడే మండేది.

ఈ ఆచార వ్యవహారమేంటి? దీని మూలాధారం ఏమిటి? అని ఎంత మంది శోధన చేస్తారు? తెలుసుకోవాలంటే, బద్దకం. కాబట్టి నమ్మము. మన సంస్కృతిని మనం కాపాడుకోలేక పోతే, ఎవరో తెల్ల వాళ్ళు వచ్చి కాపాడాలా? కానీ విచిత్రమేమిటంటే, ఓ తెల్ల వాడు వచ్చి ఇది వీళ్ళ ఆచార వ్యవహారం దీని వెనుకనున్న కారణం ఇది అని చెబితే, ఓహో ఇక చూడండి…

మధ్యలో ఇంకో వ్యంగ్యం. అటూ ఇటూ కాని అఘాయిత్యపు పండితులను తెరమీదికెక్కిచ్చి, తింగరబుచ్చి ప్రశ్నలేసి మరీ హాస్యాస్పదంగా మారుస్తారు మన మీడియా సోదరులు. టీ.ఆర్.పీ. పెరగొద్దు మరి? ఇక హిందీ వార్తా ఛానళ్ళు భళి భళి. అసహ్యం పుట్టేలా చూబిస్తారు కొన్ని కొన్ని విషయాలు. టి.వీ.ని బద్దలుకొట్టాలనిపిస్తుంది.

టపా మొదలెట్టింది ఒక కారణానికి, కాని వ్రాసింది మరొకటి. మరో టపాలో అసలు విషయం ప్రస్తావిస్తాను.

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
  1. 2:43 సా. వద్ద ఫిబ్రవరి 11, 2011

    మీ వ్యాస పరిచయం బాగుంది.

  2. aragundu vedava
    1:14 ఉద. వద్ద ఫిబ్రవరి 12, 2011

    hehe

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s