ముంగిలి > మన సంస్కృతి > ఆచార వ్యవహారాలు – నిరూపణలు, సాక్ష్యాలు

ఆచార వ్యవహారాలు – నిరూపణలు, సాక్ష్యాలు

నిన్న కాశీకి వెళదామని మొదలు పెట్టి, రామేశ్వరానికి చేరినట్టు ముందరి టపా వ్రాయటం జరిగింది. ఇవాళ ఎలాగైనా నేను వ్రాయదలుచుకున్న విషయాన్నే వ్రాయాలని పట్టు బట్టీ కూర్చోని మరీ వ్రాస్తున్నాను. ఇది నా జీవితంలో యదార్థంగా జరిగిన విషయం. పురాణాలు, ఇతిహాసాలను ప్రామాణంగా ప్రతిపాదించడంలేదు. బహుశః ఒకరో ఇద్దరో దగ్గిరవారికి మాత్రమే తెలిసిన అంతరంగాలలో దాగి ఉన్న విషయం. అలా అని రహస్యమేమీ కాదు.

ఎన్నో ఏళ్ళ క్రితం మా తాతగారి తద్దినం కొన్ని కారణాల వల్ల మా ఇంట్లో జరిగింది. ఎప్పుడూ పెద్దవారయిన మా పెదనాన్నగారింట్లో జరిగేది. నేను విద్యార్థిగా ఉన్న రోజులు. మొదటి సారి ఆ తంతును చూడడం. అంతకు మునుపు ఎప్పుడూ చూడలేదు. అంతా పూర్తయ్యాక, కుతూహలంకొద్దీ మా నాన్నగారిని అడిగా “అంటే, ఇప్పుడు ఈ తంతు జరిగిన తరువాత మీరు అనుకున్నట్టు మీరు కోరుకున్నట్లు తాతగారికి చేరి ఉంటుందా?” అని. తెలుసుకోవాలనే అడిగాను. నమ్మకం అపనమ్మకం ఏమీ లేదు. ఇది ఏంటి? ఎందుకిలా చేయడం? ప్రయోజనమేంటి? సహజమైన ప్రశ్నలే కదా! నాకే కాదు, ఈ విషయంలో ఇప్పటికీ శ్రాద్ధకర్మలను ఆచరిస్తూనే, ఎంతో కొంత ఈ అనుమానం చాలా మందికి ఉండే ఉంటుంది. తరువాత కొన్నేళ్ళకు మా అమ్మ చెప్పింది. నేను వేసిన ప్రశ్నలు ఆయన్ని కోంత ఆందోళణకు గురిచేశాయని. “వీడికి వీటిమీద నమ్మకం లేనట్టుంది. మనకు శ్రాద్ధ ఖర్మలు గట్రా చేస్తాడో లేడో” అని.

కొన్నేళ్ళు గడిచాక నా జివితంలో నన్ను బాగా క్రుంగదీసే సమయం వచ్చింది. ఒకటి తరువాత ఒకటిగా ఎప్పుడూ తెలియని కష్టాలు. ప్రశ్నలు వేసినందుకు, అనుమానం వచ్చినందుకని నా ఉద్దేశ్యం కాదు. మా నాన్న గారు ఆసుపత్రిలో చేరడం జరిగింది. అప్పటి వరకు క్లినిక్ తప్ప ఆసుపత్రి ముఖం ఎరగను. ఆరు నెలలు తెల్ల గౌను వేసుకున్న కింకరుల చేతిలో భూమి మీదే నరకం అనుభవించి, భీష్ముడిలా ఉత్తరాయణం కోసం వేచివున్నట్లు, సరిగ్గా సంక్రాంతి మరునాడు, ఆయన కన్నుమూశారు. నన్ను నన్నుగా ప్రేమించిన వ్యక్తులలో మొదటి వ్యక్తి ఆయన. కోడుకులా కాక ఒక ఎదిగిన గౌరవనీయ వ్యక్తితో ప్రవర్తించినట్లు నన్ను బాగా అభిమానించేవారు. ఆయన మరణం నాకు మింగుడు పడలేదు. అసలు ఆ నిజంతో రాజీకి రాలేక పోయాను. నా మనసు, బుద్ధి ఏవీ అంగీకరించడం లేదు. దిక్కు తోచని పరిస్థితి. ఏమి జరుగుతోందో, ఏమి చేస్తున్నానో అర్థమవ్వటంలేదు. మన నమ్మకంతో “నిజం” అనే పదానికి పనేంటీ? స్పృహలో పక్కవారందరూ ఉంటారుగా? నాతో చేయించ వలసిన తంతులన్నీ, శాస్త్రీయంగా జరిపించారు. రుద్ర భూమికి వెళ్ళడం మొదటిసారి. తిరిగి వచ్చాము, పడుకున్నట్టు ఏదో ప్రయత్నం.

మరునాడు ఉదయం మళ్ళీ మరుభూమిలో తంతు. ఉదయాన్నే వెళ్ళాము. కళ్ళళ్ళో నీళ్ళు “మగాణ్ణి కాబట్టి ఏడవకూడదు” అనే భావనతో కుస్తీ పడుతూ పదే పదే గెలుస్తున్నాయి. కానీ అంత నిశ్పృహలో కూడా ఒక సంఘఠన నేను మరచిపోలేని విధంగా నా మనసులో ముద్రవేసుకుంది.

పక్కనే ఆరుతున్న మరో చితివద్ద ఇద్దరు వ్యక్తులు. చూడడనికి ఏ కూలో నాలో చేసుకొని బ్రతుకీడుస్తున్న వారిలా కనిపించారు. బ్రతికున్నప్పుడే ఏ.సీ.లు, డిలక్స్ సౌకర్యాలు. రుద్ర భూమిలో ఆ తేడాలేమీ ఉండవుగా? నిజమైన సామ్యవాదం అక్కడ బాగా కనిపిస్తుంది. ఆ చితి పక్కనే ఒక గాజు గ్లాసులో ఆవిర్లు వస్తూ టీ, పక్కనే ఓ బన్ను ముక్క ఉన్నాయి. ముందు అర్థం కాలేదు. చితి పక్కన టీ లో బన్ను ముక్క నంజుకోని తీంటానికా అని అనుమానమొచ్చింది. వారిలో ఒకరు కంట తడి తుడుచుకుంటూ, ఆ రెంటినీ చితికి కాస్త దగ్గిరగా జరిపాడు. అప్పుడు అర్థమైంది వారి అంతరార్థం.

ఆ మరణించిన తమ బందువుకోసమని ఆ టీ ఇంకా బన్ను ముక్కా. అంతటి దారుణమైన పరిస్థితిలో కూడా నన్ను ఆ సంఘటన చాలా లోతుగా ప్రభావితం చేసింది. చూడటానికి బొత్తిగా చదువుకున్న వారిలా అగుపించడంలేదు వారిద్దరు. చుట్టు పక్కల జనం లేరు, తంతుతో పనిలేదు. వారిరువురు అలా ఒక గ్లాసు టీ, ఓ బన్ను ముక్క ఏ నమ్మకంతో పెట్టారు? వాళ్ళకి ఎవరు చెప్పారు? ఎంత ఖర్చు పెట్టారనేది ముఖ్యం కాదు. అలా మౌనంగా రోదిస్తూ, ఆ చితిలో మరణించి కాలిపోయిన వ్యక్తికి వారు నిండు నమ్మకంతో ఇచ్చిన తర్పణాలు అవి. చదువులెందుకు? స్థోమతతో పనేంటీ మనసులో నమ్మకం, చిత్తశుద్ధులు లేకపోతే?

అలా ఆ విషయం లోలోపల బలంగా పాతుకుపోయినా, ఆ పరిస్థితిలో ఆ సంఘఠనను నేను విశ్లేషించలేదు. ఎలా కుదురుతుంది? కానీ కాస్త సద్దుమణిగాక, పదే పదే ఆ సంఘఠన గుర్తుకొచ్చేది. నేను వేశిన ప్రశ్నలకు సమాధానమా అనిపించింది. ఖచ్చితంగా సమాధానమే. “సైన్స్” పరంగా కొన్ని ఆచార వ్యవహారాలకు ఋజువులు చూపించవచ్చును. కొన్నింటికి బాగా కష్టపడాలి. శ్రాద్ధ కర్మల వంటి వాటికైతే బొత్తిగా కుదరదు. ఈ విషయాలు, మనకు గోచరించే ప్రపంచానికే అతీతం. కేవలం విశ్వాసం, నమ్మకాలతో మాత్రమే కుదురుతుంది.

ప్రకటనలు
వర్గాలుమన సంస్కృతి ట్యాగులు:
 1. చిలమకూరు విజయమోహన్
  5:17 ఉద. వద్ద ఫిబ్రవరి 12, 2011

  మీ టపా గత ఇరవై రోజులనుంచి నేను అనుభవిస్తున్న మానసిక పరిస్థితిని ప్రతిబింభించింది.

 2. 5:19 ఉద. వద్ద ఫిబ్రవరి 12, 2011

  మనల్ని పెంచి చదువులు చెప్పించి పెద్దచేసిన వాళ్ళని, వాళ్ళు పోయిన తరువాత తల్చుకునే రోజే తద్దినం. పాశ్చాత్య దేశాలలో అయితే పూలు పట్టుకుని సమాధి దగ్గర పెట్టి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటారు.ఏమయినా ఆరోజు వాళ్ళని తలచుకుంటారు విధానాలు వేరు అంతే.

  • 10:11 సా. వద్ద ఫిబ్రవరి 12, 2011

   రావు గారు, మీ విశ్లేషణ బావుంది. నాకు తెలిసినంతవరకు కొన్ని ప్రాంతాల్లొ సంక్రాంతికి కూడా చనిపోయిన పెద్దలని గుర్తు చెసుకుంటారు. వారికోసం కొత్త బట్టలు చూపించడం ఒక అనవాయితి.

 3. చిలమకూరు విజయమోహన్
  7:49 ఉద. వద్ద ఫిబ్రవరి 12, 2011

  శ్రాద్ధంలో భావ శుద్ధి,శ్రద్ధ ముఖ్యం, అశక్తతవల్ల శ్రాద్ధం పెట్టలేనప్పుడు పరిపూర్ణ శ్రద్ధా భక్తులతో పితరులనుద్దేశించి ఏడ్చినా,క్షమా ప్రార్థన చేసినా వారు తృప్తులౌతారు,అనుగ్రహిస్తారు.శ్రాద్ధము వేదవిదే.దానిని మీర తగదు.

 4. Kameswara Rao
  1:44 సా. వద్ద ఫిబ్రవరి 13, 2011

  నేను తెలుగులొ మీ గురిన్చ్ వ్యఖ్య వ్రాయలన్టె యెలగు?

 5. 7:04 సా. వద్ద ఫిబ్రవరి 13, 2011

  ఇప్పుడు మీరు వ్రాసింది తెలుగులోనే కదా మాష్టారు? వామభాగంలో “తెలుగు లేఖన సాధనాలు” అని కొన్ని లంకెలు పెట్టాను. వేటినైనా ఎంచుకోవచ్చును.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s