ముంగిలి > మన సంస్కృతి, సనాతన ధర్మం > అష్టాదశ మహా పురాణాలు – [సనాతన ధర్మం / 3]

అష్టాదశ మహా పురాణాలు – [సనాతన ధర్మం / 3]

క్రితం టపాలో వేదాలు లేదా శృతుల గురించి క్లుప్తంగా కొన్ని విషయాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఆ టపాను ముగిస్తూ, వేదాలను తేలికగా గ్రహించి సామాన్య మానవుడు తన జీవన విధానాన్ని మలచుకోడానికి ఒక సాధనంలాగా వాడుకోవడం కొంత మేర కష్టమే అని ముగించాను. శృతులు ఆధారంగా, స్మృతులను మహర్షులు మనకు అందజేశారు. ఆ కోవలేనే సగటు మనిషి వేద సారాన్ని తేలిక గ్రహించడానికి కథల రూపంలో, వివరణాత్మకంగా, ఒకటి లేదా కొన్ని విశేషాలను సమాహారంగా కలిగి ఉండేవి పురాణాలు. మనకు తెలిసీ తెలియకుండానే ఎన్నో పురాణ విశేషాలు మన జీవితాల్లో అంతర్భాగాలై నిమిడి ఉన్నాయి. ఉదాహరణకు పుణ్య తీర్థ-క్షేత్రాల మాహాత్మ్య జ్ఞానం, సత్యనారాయణ వ్రతం వంటి ఎన్నో వ్రతాలు, పండుగలు వాటి కారణాలు, మనము నిత్యమూ పఠీంచే స్తోత్రాలు-సహస్రనామాలు వంటివి. కానీ ఇక్కడ మనము గ్రహించ వలసిన విషయం ఒకటుంది. మనకు ఎంతగానో పరిచయమున్న రామాయణ, మహాభారత, భగవద్గీతల వంటివి పురాణాలు కావు. “రామాయణ,” “మహాభారతాలు” ఇతిహాసాలు. కొన్ని పురాణాలలో ఇతిహాస విశేషాల గురించి ప్రస్తావనలున్నా, ఇతిహాసాలు ఒకానొక సమయంలో జరిగిన విశేషాలతో కూర్పబడినవి. ఉదాహరణకు రామాయణం సకలగుణాభిరాముడైన శ్రీరామ చంద్రుని జీవిత చరిత్ర. శ్రీరామునితో సంబంధం ఉన్నవారు మరియూ విశేషాలు, రామాయణంలో ప్రస్తావించబడ్డాయి.

పురాణాలు ఎన్ని? అవి ఏవి?

అన్ని పురాణాలను రచించినది వ్యాసుడే! ఆయన రచించిన పురాణాలను తేలికగా గుర్తించడానికి పద్మ పురాణంలో గల ఈ క్రింది సూత్రం తోడ్పడుతుంది.

ద్వయం ద్వయం చైవ బ్రత్రయం చతుష్టయం |
‘ ‘నా‘ ‘‘ ‘లిం‘ ‘‘ ‘కూ‘ ‘స్కాని పురాణాని పృథక్ పృథక్ ||

‘మ’ మరియూ ‘భ’ అక్ష్రరంతో మొదలయ్యెవి రెండు, ‘బ్ర’ అనే అక్ష్రరంతో మూడు, ‘వ’తో నాలుగు మరియూ ‘అ’, ‘నా’, ‘ప’, ‘లిం’, ‘గ’, ‘కూ’, ‘స్కా’ అను శబ్దాలతో ఒకొక్కటి; మొత్తం 18.

శబ్ధము సంఖ్య పురాణాలు
‘మ’ 2 మత్స్య మరియూ మార్కండేయ పురాణాలు
‘భ’ 2 భాగవత, భవిష్య పురాణాలు
‘బ్ర’ 3 బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ పురాణాలు
‘వ’ 4 వరాహ, వామన, వాయు మరియూ విష్ణు పురాణాలు
‘అ’ 1 అగ్ని పురాణం
‘నా’ 1 నారద లేదా నారదీయ పురాణం
‘ప’ 1 పద్మ పురాణం
‘లిం’ 1 లింగ పురాణం
‘గ’ 1 గరుడ పురాణం
‘కూ’ 1 కూర్మ పురాణం
‘స్కా’ 1 స్కంద లేదా స్కాంద పురాణం

పురాణలలో నారద పురాణానికి ఓక ప్రత్యేకత ఉన్నది. అష్టాదశ పురాణాలలో చెప్పబడిన విషయానుక్రమణిక పూర్వ భాగంలో 92 నుంచి 109 అధ్యాయాలలో ఇవ్వబడింది. దీని ఆధారంగా, ప్రస్తుతం లభ్యం అవుతున్న పురాణాల మూల రూపము, ప్రక్షిప్త అంశాలను తేలికగా తెలుసుకోనవచ్చును. నారద పురాణమును బట్టి పైన ప్రస్తావించిన 18 పురాణములు, వాటి గుర్తింపు సరితూగుతున్నాయి. ఈ దృష్టాంతాన్ని ఇక్కడ ప్రస్తావించడానికి ఒక బలమైన కారణమున్నది. ఇతర ప్రాచీన ఐతిహాసిక విషయాలకులాగానే, పురాణాల పట్టిక మీద (మహా పురాణాలు ఏవి?) కొన్ని విభేదాలున్నాయి. ఉదాహరణకు భాగవతం అంటే కొందరు పండితులు “దేవీ భాగవతం” అని మరి కొందరు “విష్ణు భాగవతం” అని భావిస్తారు. అలాగే, వాయు పురాణం స్థానంలో కొందరు శివ పురాణాన్ని చేరుస్తారు. ఏది ఏమైనా, అన్నీ ధర్మాన్నే భోదిస్తాయి కాబట్టి, ఏదనుకున్నా తప్పు లేదని నా అభిప్రాయం.

మరో ముఖ్య గమనిక. పైన ప్రస్తావించిన సూత్రంలో “అనాపలింగకూస్కా” (‘‘, ‘నా‘, ‘‘…)ని విడగొట్టినప్పుడు, నా వద్దనున్న వివిధ గ్రంథాలు ఎకోన్ముఖంగా ‘‘, ‘నా‘, ‘‘, ‘లింగ‘, ‘కూ‘ మరియూ ‘స్కా‘ లుగా పేర్కొంటున్నాయి. ఆ విధంగా ‘లింగ‘ అని పరిగణించినట్లైతే, మొత్తం సంఖ్య 17కు చేరుతున్నది. పద్దెనిమిదవది “శ్రీమద్భాగవతం” అని పేర్కొన బడుతున్నది. కానీ, నాకు తోచినంత మటుకు అది ‘లింగ‘ గా కాక ‘లిం‘ మరియూ ‘‘లుగా భావించినట్లైతే నారద పురాణముతో సరిగ్గా సమన్వయమవుతున్నది. కనుక పైవిధముగా దాని విశ్లేషణను ప్రతిపాదించాను. ‘లింగ‘ అని పరిగణించినపుడు, గరుడ పురాణము ను ప్రస్తావించడం కుదరదు. ఇది మరో కారణం.

పురాణ లక్షణాలు

ప్రతిదానికి ఒక లక్షణం అనేది ఉంటుంది. అది ఎలా ఉండాలి, దానిలో కనీసం ఏవేవి ఉండాలి? ఇదే క్రమంలో పురాణమంటే ఏమిటి అని చాలామందికి సందేహం కలుగుతుంటుంది. తేలికగా, ’పురాణం పంచ లక్షణం’ అని మత్స్య పురాణంలో సమాధానము దొరుకుతుంది; అనగా పురాణానికి ఐదు లక్షణాలుండాలని.

సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ |
వంశాను చరితం చేతి పురాణం పంచ లక్షణమ్ ||

అనగా (1) సర్గము, (2) ప్రతి సర్గము, (3) వంశము, (4) మన్వంతరము మరియూ (5) వంశానువర్ణనములు ఉండవలెను అని.

1. సర్గము: ఈ చరాచర ప్రపంచము దానిలోని నానా పదార్థాల ఉత్పత్తి లేదా సృష్టినే సర్గ అంటారు.
2. ప్రతిసర్గము: సర్గమునకు వ్యతిరేకమైనది ప్రతిసర్గము; అనగా లయము లేదా ప్రళయము.
3. వంశం: బ్రహ్మద్వారా ఎందరు రాజులు సృష్టించబడ్డారో (ప్రజాపతులు) వారియొక్క భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో గల సంతాన పరంపరను వంశము అనవచ్చును.
4. మన్వంతరము: విభిన్న కాలాలలో జరిగిన సంఘటనలకు గుర్తుగా ఉండే కాల గణనం. ఉదాహరణకు మనము నిత్య పుజలో చేయు దేశ కాల సంకీర్తనములో “వైవస్వత మన్వంతరే” అంటాము. అనగా ఈ కల్పమునకు వివస్వంతుడు (వైవస్వతుడు) మనువు.
5. వంశానుచరితము: పైన తెలుపబడినట్లుగా చక్రవర్తులు, ఋషుల వంశాలలో ఉత్పన్నం చెంది, ఆయా వంశాలకు మూల పురుషులైన రాజుల విశిష్ట వర్ణనమే వంశాను చరితం.

పురాణముల గురించి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలున్నాయి. మున్ముందు, మరికొన్ని విశేషాలను, ఈ టపాలో నామమాత్రంగా ప్రస్తావించిన “స్మృతుల” గురించి, పద్దెనిమిది పురాణాలలో ప్రతిదాని గురించి క్లుప్తంగా టపాలు వ్రాసే ప్రయత్నం చేయగలను.

–సశేషం

ప్రకటనలు
 1. durgeswara
  11:47 ఉద. వద్ద ఫిబ్రవరి 18, 2011

  mamchi samaachaaramistunnaaru dhanyavaadamulu

 2. 8:53 సా. వద్ద ఏప్రిల్ 1, 2011

  These are very good.I want more stories about morals.

 3. అనామకం
  10:12 ఉద. వద్ద మార్చి 5, 2013

  garuda puranam ante enti

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s