ముంగిలి > పిచ్చాపాటి > హోదాలకు అతీతమైన జిహ్వ చాపల్యం

హోదాలకు అతీతమైన జిహ్వ చాపల్యం

ఉదయం పది-పన్నెండు మద్య దాహార్తిని తీర్చుకోవాలని దారిలో కొబ్బరి బోండం తాగడానికి భాగ్యనగరంలోని ఒక సంపన్న పరిసరాలలో ఆగాను. అలా కొబ్బరి బోండం తాగుతున్నప్పుడు ఎదురుగా ఒక కారు రహదారిమీద ఆగి కనిపించింది. ఖరీదైన కారు (BMW). ఇంజిన్ అలాగే నడుస్తున్న శబ్ధం వస్తూ ఉండడం గమనించాను. లోపల వ్యక్తులున్నారు. ఏ.సీ. నడవడానికి అలా ఇంజన్ నడుస్తున్న శబ్దం వస్తోందని అర్థమయింది. నా కొబ్బరి బోండం పూర్తయ్యేలోపు అద్దం కాస్త కిందకి చేసి ఒక వ్యక్తి మంచి నీళ్ళ ప్యాకెట్టు బయటకు విసిరినప్పుడు అర్థమయింది. రోడ్డుకు ఆవల కొన్ని తోపుడు బళ్ళ మీద ఇడ్లీలు, ఆమ్లెట్లు అమ్ముతున్నారు. అలా ఏవో తినడానికని కారులోపల వ్యక్తులు కారును రోడ్డు మీద ఆపి, ఏ.సీ. వేసుకొని ఏవో తిండి పదార్థాలను సేవిస్తున్నారు. బహుశః చాలా రుచికరంగా ఉంటాయేమో ఆ తోపుడు బండిలో అమ్మే టిఫ్ఫిన్లు!

బయట కూర్చొని ఇతరులతో ఆరగిద్దామంటే, హోదా అడ్డొస్తుంది. జిహ్వేమో కావాలంటుంది! సీత కష్టాలు సీతవి – పీత కష్టాలు పీతవి… కదూ?

అప్రయన్మంగా ఓ చిరుమందహాసం. వెంటనే ఒక క్లిక్…

ఖరీదైన కారు...రోడ్డు ప్రక్కన టిఫ్ఫిన్లు

ఖరీదైన కారు...రోడ్డు ప్రక్కన టిఫ్ఫిన్లు

రోడ్ల పక్కన అమ్మే టిఫ్ఫిన్లకో, ఖరీదైన కార్లలో తిరిగే వారికో వ్యతిరేకిని కాదండోయ్! కాకపోతే, ఒక నిరుపేద స్టార్ హోటళ్ళలలో ఏదన్నా తినడం ఎప్పుడూ చూడలేదు. అంతే!

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
  1. 10:49 సా. వద్ద మార్చి 8, 2011

    మంచి అబ్సర్వేషన్ అండీ.
    నేను అనుకోవడం ఏంటంటే ఈ రోజుల్లో ఇలాంటి ఖరీదైన కార్లలో తిరిగే వారు బహుశా డబ్బులో పుట్టి పెరిగిన వారు కాకపోవచ్చు. సాధారణ మూలాల్లోంచి ఎదిగి వచ్చిన వారికి ఇలాంటి రుచులు గుర్తుంటాయ్, అంత త్వరగా మరిచిపోలేరు. ఆ రోజుల్లో రామారావు ఇత్యాదులు పెద్దపెద్ద స్టార్లయ్యాక కూడా విజయవాడ బాబాయ్ హోటలుకి వచ్చి పెసరట్టు తిని వెళ్ళేవాళ్ళుట. దానికి ఇది ఈ నాటి వెర్షను అనుకోండి.

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s