రామేశ్వరము / 2

చెన్నై ఎగ్మోర్ రైల్వేస్టేషను నుండి సాయంత్రం ఐదు గంటలకు కదిలే రామేశ్వరం ఎక్స్‍ప్రెస్ బండి ఎక్కి రామేశ్వరానికి ఉదయం నాలుగున్నర ప్రాంతాల్లో చేరుకున్నాము. రామేశ్వరం తరువాత మరే స్టేషను లేదు కాబట్టి ఉదయం నాలుగున్నరకు దిగడమేంటబ్బా అని కాస్త ఆలోచనలో పడ్డాను. మరుసటి ఉదయం ఇందులోని మర్మం అర్థమయింది. కొందరు ప్రయాణికులు బండి దిగీ-దిగగానే, కాలకృత్యాలను త్వరగా ముగించుకొని ఉదయం ఆరింటివరకే లభ్యమయ్యే స్ఫటికలింగ దర్శనానికి రావడం చూసి సూర్యోదయం కాకముందే బండి రామేశ్వరం చేరుకోవడానికిగల కారణం అర్థమయింది. ఒక్కరోజు మాత్రమే కేటాయించగలిగే యాత్రీకులకు ఉదయం నాలుగున్నర ప్రాంతాల్లో బండి రామేశ్వరం చేరుకోవడం ఒక వరమే!

దేవాలయ ఇతిహాసం

మొదట ఈ ఆలయం ఒక ఆశ్రమంలోని పర్ణశాలలో ఉండేదట. పన్నెండవ శతాబ్ధంలో పరక్రమ బాహు అనబడే సింహళదేశ (సిలోన్) రాజు గర్భగుడి కట్టించారట. పదిహేనవ శతాబ్దంలో రామనాడు ఉదయన్ సేతుపతి మరియూ నాగపట్టణ నివాసి అయిన ఒక వైశ్యుడు 78 అడుగుల పశ్చిమ గోపుర నిర్మాణం కావించారు.

పశ్చిమ గోపురం

పశ్చిమ గోపురం

ఇంచుమించు అదే సమయంలో మధురై పట్టణవాసి అయిన ఒక సంపన్నుడు అమ్మవారి ప్రాకారం మరియూ కొన్ని మరమత్తులు చేయించారట. పదహారవ శతాబ్ధంలో తిరుమలై సేతుపతి దక్ష్నిణాన ఉన్న రెండవ ప్రాకారాన్ని నిర్మించారు. ఇంచుమించు అప్పుడే ఉదయన్ సేతుపతి అనే భూస్వామి నంది మంటపాన్ని నిరించారు. ఇక్కడి నంది 22’x12’x17′ అడుగుల కొలతలతో ఎంతో పెద్దగా సున్నపురాయితో మలచబడ్డది.

రామేశ్వరం నంది - సౌజన్యం travelpod.com

రామేశ్వరం నంది - సౌజన్యం travelpod.com

పదిహేడవ శతాబ్దంలో దళవై సేతుపతి తూర్పున ఉన్న రాజగోపురాన్ని కొంతమేర నిర్మించారు. పద్దెనిమిదవ శతాబ్దంలో రవి విజయ రఘునాథ సేతుపతి అమ్మవారి ఆలయంలోని శయనాగృహం మరియూ అమ్మవారి ఆలయ ముఖమంటపాన్ని నిర్మించారు. ఆ సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామేశ్వర దేవాలయపు మూడవ ప్రాకార నిర్మాణాన్ని ముత్తురామలింగ సేతుపతి గావించారు.

రామేశ్వర దేవాలయపు మూడవ ప్రాకారం

రామేశ్వర దేవాలయపు మూడవ ప్రాకారం

 దేవాలయ ప్రవేశ ద్వారము వద్ద ఈ సేతుపతుల రాతి విగ్రహాలు స్థంభాలలో కైమోడ్చిన భంగిమలో జీవకళ ఉట్టిపడే విధంగా మలచబడి కనబడతాయి. చుట్టుప్రక్కల ఇతర దేవాలయాలలో కూడా వీరి విగ్రహాలను ఇదే పద్దతిలో చూడవచ్చు. వీరి విగ్రహాలను చూసినప్పుడి ఒక విషయం జ్ఞప్తికి వచ్చింది. ఈజిప్టు వంటి ఇతర పురాతన సంస్కృతులలో, రాజులే దేవుళ్ళగా చెలామణి అయ్యెవారు. అలాంటిది ఇక్కడ రాజులు దేవాలయాలలో కైమోడ్చిన భంగిమలో ద్వారపాలకులలాగా కనపడతారు. అందుకే ఈ సంస్కృతి ఇంకా నిలబడి ఉందేమో!

దేవాలయ దర్శన సమయాలు

ఉదయం ఐదింటికి పళ్ళియరై పూజ జరుపుతారు. పైన పేర్కొన్న అమ్మవారి గుడిలోని శయనాగృహంలో (పళ్ళియరై) రాత్రి ఇంచుమించు తొమ్మిదింటి సమయంలో స్వామివారిని ఊరెరిగింపుగా తీసుకొనిరావడంతో ఆలయం మూసివేయబడుతుంది. ఇంకా మధ్యాహ్నం ఒకటి నుండి మూడింటి వరకు ఆలయం మూసివేయబడుతుంది. ఉదయం ఆరింటి వరకు స్ఫటికలింగ దర్శనం చేసుకోవచ్చు. దీనికి టికెట్టుకొని వెళ్ళవలసిందే. ధర్మ దర్శనంలేదు. నేను వెళ్ళినప్పుడు టికెట్టు ధర ఒక్కింటికి యాబై రూపాయలు. పిల్లలకు ఉచితం. తప్పక స్ఫటిక లింగ దర్శనం చేసుకోవలసిందే.

దేవాలయ విశేషాలు

రామలింగము (రామనాథుడు) ఉన్న దేవాలయానికి కుడి ప్రక్క ఆనుకొని అమ్మవారు పర్వత వర్దినిగా వేలసి ఉన్నారు. ఇక్కడ శ్రీ యంత్రం ప్రతిష్ఠీంచబడి ఉన్నది. ఈ విషయాన్ని మేము అర్చక స్వాములను అడిగి ౠఢీ చేసుకున్నాము. కానీ కంచిలోలాగా ఇది భక్తుల సందర్శనకు దూరం. అమ్మవారి ఆలయం స్వామివారి ఆలయానికి ఆనుకొనున్న మరో ఆలయంగా భావించవచ్చును. 

పర్వతవర్ధిని, రామనాథ ఆలయాలు

పర్వతవర్ధిని, రామనాథ ఆలయాలు

స్వామివారి గర్భగుడికి ఆనుకొని ఉత్తరాన హనుమంతుడు తెచ్చిన విశ్వనాథలింగం చూడవచ్చును. శ్రీరాముడు వరమిచ్చినట్టుగా అన్ని సేవలు మొదట ఈ విశ్వనాథలింగానికు జరుపుతారట. పక్కనే విశాలాక్షి అమ్మవారు దర్శనమిస్తారు.

–సశేషం

ప్రకటనలు
 1. 10:10 సా. వద్ద మార్చి 21, 2011

  చక్కగా చెబుతున్నారు. తరువాత పార్టు కోసం ఎదురు చూస్తా.

 2. Ram
  3:40 సా. వద్ద మార్చి 22, 2011

  ikkada kShethra paalakudu evaru?

 3. bhaskar
  2:35 సా. వద్ద జూన్ 22, 2011

  is there any rules to visit rameswaram like varanasi?

 4. 10:22 సా. వద్ద మార్చి 31, 2013

  dhanyavaadhamulu

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s