ముంగిలి > పిచ్చాపాటి > అతి ప్రేమలు

అతి ప్రేమలు

మా పక్కింటివారిది ఓ చూడముచ్చటైన కుటుంబం. ఎనభై ఏళ్ళున్నా చురుగ్గా ఉండే పెద్దావిడ, ఆవిడ కొడుకూ-కోడలు, ఇప్పుడే ఉద్యోగాలలో చేరిన మనుమరాలు-మనవడు. మంచి సాంప్రదాయ కుటుంబం. అమ్మాయి పెళ్ళి ఇటీవలే కుదిరింది. కొన్ని కారణాలవల్ల పెళ్ళి భాగ్యనగరంలో కాక వరుడివాళ్ళ ఊళ్ళో వచ్చే నెలలో. పెళ్ళి సందడితో హడావుడిగా అందరూ తలమునకలై ఉన్నారు. ఆడపిల్ల పెళ్ళంటే మాటలా?

నేనూ ఆ పెద్దావిడ కుదిరినప్పుడల్లా చిన్ని చిన్ని వాదనలకు దిగుతుంటాము; హాస్యానికేలెండి. ఆవిడ ఏ రకంగా నాలో ఏదో ఒక తప్పు ఎంచాలా అని; నేనేమో ఆ వాదనను ఎలా తిప్పి కొట్టాలో అని. అంతా అయ్యాక సరదాగా ఇద్దరం నవ్వుకుంటాం. పిల్లలతో ఇంకా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమరు ఉన్న పెద్దవాళ్ళతో వాదనకు దిగితే అందులో మజాయే వేరు లెండి.

పెళ్ళికి పట్టుమని నెలరోజులు కూడా లేవు. ఇంటికి రంగులు వేయిస్తున్నారు. అంతా సందడీ-గందరగోళం. ఇంతలోనే ఆ కుటుంబం తలపై పీడుగు పడ్డట్టు ఆ పెద్దావిడ ఒక రోజు స్పృహ కోల్పోయారు. ఖంగారుగా ఆసుపత్రికి తీసుకెళితే, పెద్దాసుపత్రిలో చేర్చమని సలహా ఇచ్చారు. ఓ పెద్దాసుపత్రిలో చేర్చారు. రెండు రోజులు ఐ.సీ.యూ.లో అటు పిమ్మట ఏ.ఎమ్.సీ.లో గత రెండు రోజులుగా. చేతికొచ్చిన మనుమడు మరో ఊళ్ళో ఇటీవలే ఉద్యోగంలో చేరడంవల్ల ఇక్కడలేడు. పాపం వారి కష్టాలు వర్ణనాతీతం. ముఖాలలో ప్రస్పుటంగా ఏం జరుగుతుందోనని ఆందోళన కనిపిస్తోంది. ఆసుపత్రిలో వంతులవారీగా కాపలా. ఇంట్లోనేమో పెళ్ళి పనులు. “ఇల్లు కట్టీ చూడు, పెళ్ళి చేసి చూడు” అన్నారుగానీ, “ఇల్లు కట్టి చూడు-ఆసుపత్రిలో పెద్దావిడను చేర్చి పెళ్ళి చేసి చూడు” అనలేదుగా?

కళ్ళళ్ళో నీళ్ళు పెట్టుకొని మరీ ఏదోలా నెట్టుకొస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఆ పెద్దావిడ స్ట్రేస్ (stress) ఇంకా టెన్షన్ (tension) వల్ల ఆరోగ్యం చెడిందీ అని డాక్టర్లు చెబుతున్నారట. ముందునుంచీ వయసు పైబడడంవల్ల గుండె కోంచెం బలహీనం; దానిపై టెన్షన్. మనుమలంటే మహా ప్రేమ ఆవిడకి. ఆ ప్రేమలు, వారిపై మమకారమే ఓ రకంగా ఆ కుటుంబానికి ఈ కష్టాన్ని తెచ్చిపెట్టాయా అనిపిస్తోంది.

బహుశః పెళ్ళి పూర్తయి అందరూ తీరిగ్గా కూర్చోని పెళ్ళి కబుర్లు నెమరువేసుకుంటున్నప్పుడు వారి ఆనందాన్ని ద్విగుణీకృతం చేయడానికే భగవంతుడు వారికి ఈ తాత్కాలిక కష్టాన్ని కలిగించాడేమో?

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s