రామేశ్వరము / 4

ఈ టపాలో రామేశ్వరంలోని ఇతర ముఖ్యమైన ప్రదేశాలు, తీర్థాల గురించి ప్రస్తావిస్తాను.

గంధమాదన పర్వతం

ఇతరత్రా పుస్తకాలలో కూడా దీనిని పర్వతముగానే అభివర్ణించారు. కానీ నాకు ఇదొక కొండగా, ఇసుక దిబ్బగా అనిపించింది. రామేశ్వరంలోని ఎత్తైన ప్రదేశం. ఇక్కడి వాస్తవ్యులు దీనిని “రామ్ ఝరోకా” అని “రామర్ పాదం” అని గుర్తిస్తారు. నిజానికి “రాంజీ రుకా” (रामजी रुका) కాస్తా “రామ్ ఝరోకా” గా (राम झरोका) మారి పోయింది. ఇక్కడ ఈ పర్వతం మీద ఒక చిన్న మందిరం ఉన్నది. దేవాలయం అనలేము. ఆ మందిరంలో రాములవారి పాద చిహ్నం కలదు. అక్కడ నుంచి శ్రీరామ చంద్రుడు లంకకేసి ప్రణాళికా నిర్మాణం కొరకు చూశారు అని చెప్పారు.

రాంజీ రుకా

రాంజీ రుకా

కొందరు ఇక్కడి నుంచి ఆంజనేయస్వామి లంకు సీతాన్వేషణకొరకై లంఘించారని అంటారు. కానీ ఆయన లంఘించింది మహేంద్రగిరి నుండి. అంచేత ఆంజనేయస్వామి లంఘించారన్నది సరికాదు. కాకపోతే, నేను పుస్తకాలలో రామేశ్వరంలో మహేంద్రగిరి ఉన్నదని చదివి ఎక్కడుందో కనుక్కునే ప్రయత్నం చేశాను. కానీ ఫలప్రదం కాలేదు. ఇక్కడి వాస్తవ్యులు తమకు మహేంద్రగిరి గురించి తెలియదనే చెప్పారు.

దూరదర్శన్ ట్రాన్స్మిటర్

దూరదర్శన్ ట్రాన్స్మిటర్

దగ్గిరలో పదిహేను వందల ఆడుగుల ఎత్తున్న దూరదర్శన్ ట్రాన్స్మిటర్ గంభీరంగా కనిపిస్తుంది. ఈ పర్వతం మీద నుండి రామేశ్వర దేవాలయంతో సహా చుట్టుప్రక్కలు చాలా బాగా కనపడతాయి. ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం.

పర్వతంనుండి ఆలయ వీక్షణ

పర్వతంనుండి ఆలయ వీక్షణ

రామ, లక్ష్మణ, సీతా తీర్థాలు

పర్వతానికిదగ్గిరలో రామ, లక్ష్మణ, సీతా తీర్థాలు ఉన్నాయి. నేను వెళ్ళినపుడు సీతా తీర్థంలోనికి దిగడం కష్టంగా ఉన్నది. రామ మరియూ లక్ష్మణ తీర్థాలలో స్నానం చేయడం తేలికే. వీటిలో జలాలు స్వచ్చంగా ఉన్నాయి.

రామ తీర్థం

రామ తీర్థం

లక్ష్మణ తీర్థం

లక్ష్మణ తీర్థం

సీతా తీర్థం

సీతా తీర్థం

శ్రీకోదండరామస్వామి దేవాలయం

రామేశ్వరాలయం నుండి సుమారు ఐదు మైళ్ళ దూరంలో ఈ దేవాలయం ఉంది. విభీషణుడు రాముని శరణుజొచ్చినది ఇక్కడే. రామాజ్ఞమేర యుద్ధానికి ముందే విభీషణుడికి లక్ష్మణస్వామి తాత్కాలిక లంకా పట్టాభిషేకము చేసింది ఇక్కడే. రావణవధాంతరము రామచంద్రుడు విభీషణుడికి శాశ్వత పట్టాభిషేకముకూడా ఇక్కడే చేశారు. రామేశ్వరంలోని రామలింగ ప్రతిష్ఠాపన ఉత్సవము రోజున ఉత్సవమూర్తులను ఇచ్చటికి ఊరెరిగింపుగా తెస్తారట.

శ్రీకోదండరామస్వామి దేవాలయం

శ్రీకోదండరామస్వామి దేవాలయం

ధనుష్కోటి (ధనుష్కోడి)

రావణవధానంతరం విభీషణుని విన్నపంమేర శ్రీరామచంద్రుడు తన ధనుస్సుతో వానరులు నిర్మించిన సేతును కూలగొట్టారు. అందుకే దీనిని ధనుష్కోటి (తమిళ ఉచ్ఛారణలో ధనుష్కోడి) అని వ్యవహరిస్తారు. ధనుష్కోటి వెనక 1964లో సంభవించిన తుఫాను తాలుకు విషాదగాధ ఒకటుంది. రామేశ్వరం ద్వీపం చిట్టచివరి అంచులో ధనుష్కోటి ఉంది. 1964 ముందు రామేశ్వర దేవాలయ పరిసరాలకు మించిన జనావాసం ఇక్కడ ఉండేది. ధనుష్కోటినుండి ఆంగ్లేయులు శ్రీలంకలోని తేయాకు తోటలలో పని చేయటానికి భారతదేశంనుండి పనివాళ్ళను సముద్ర మార్గంలో తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడికి శ్రీలంక కేవలం 33 మైళ్ళ దూరం. మొదట రైలు మార్గం ఇక్కడికే ఉండేది. కానీ, 1964లో సంభవించిన భయంకర తుఫానులో సర్వం కొట్టుకుపోయి ఇప్పుడు ఇది ఒక నిర్మానుష్యమైన చేదు గుర్తుగా మిగిలి ఉన్నది. నిజానికి ఇక్కడికి వెళ్ళాళంటే చాలా కష్టమనే చెప్పాలి. జీవితంలో మొదటిసారి నేను ట్రక్కులో ప్రయాణం చేసింది ఇక్కడే!

ట్రక్కు

ట్రక్కు

రోడ్డు వ్యవస్థ లేదు. ఎనిమిది కిలోమీటర్ల దూరం. మామూలు కార్లు ఆ ఇసుకదారిలో వెళ్ళలేవు. అంచేత చిన్న చిన్న ట్రక్కులే శరణ్యం. ఈ ప్రయాణం శారీరికంగా ఎంతో శ్రమ కలిగిస్తుంది. మేము వెళ్ళినప్పుడు మా ట్రక్కుకు ఒక దుర్ఘటన సంభవించింది. టైర్లకుండే ఐదు నట్టుల్లో మూడు విరిగిపోయాయి.

నట్టులువిరిగిన ట్రక్కు చక్రం

నట్టులువిరిగిన ట్రక్కు చక్రం

నిర్మానుష్య ప్రదేశం. ఫోన్లు గట్రా పనిచేయవు. గుక్కెడు మంచినీళ్ళుకూడా దొరకవు. అంచేత వెళ్ళాలి అనుకుంటే, విపరీత పరిణామాలకు సిద్ధపడి వెళ్ళాల్సిందే! జాగ్రత్త సుమా!

కానీ ఆ చిట్ట చివరి అంచుకు చేరుకున్నాక శ్రమను మొత్తం మరిచిపోయేట్టు చేయగల ప్రాకృతిక సౌందర్యం. చుట్టు సముద్రం. సముద్రపు హోరు తప్ప ఏమీ వినపడదు. రెండు సముద్రాలు కలుస్తున్నాయా అనిపించేట్టు ఉంటుంది. ఇక్కడి వాస్తవ్యులు నిజంగానే ఇది మహాదధి (Bay of Bengal) రత్నాకరి (Indian Ocean) ల సంగమ స్థానంగా భావిస్తారు.

మహాదధి-రత్నాకరుల సంగమం

మహాదధి-రత్నాకరుల సంగమం

మా బండి చెడి గంటన్నర పాటు మరో బండికోసం నిరీక్షిస్తున్నప్పుడు ఒక రకంగా వరంగా తోచింది. ఆ ఇసుకలో చెప్పులు విప్పేసి అలా నడుచుకుంటూ వెళుతూ “ఒహో ఇక్కడే కదా వానర సైన్యం ముందుకు నడిచింది” అని సంబర పడిపోయాను.

ధనుష్కోటి
ధనుష్కోటి

–సశేషం

ప్రకటనలు
 1. madhavaraopabbaraju
  4:23 సా. వద్ద మార్చి 25, 2011

  ఆర్యా, నమస్కారములు.

  ఈ వ్యాసం చాలా సవిస్తారంగా వున్నది. దానికితోడు చిత్రాలనుకూడా జతచేశారు. మీరు ఈ ప్రదేశాలను చూడటంలో ఎంత శ్రమించారో మీ వ్యాసం ద్వారా తెలుసున్నది.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

 2. p.mallikarjunara@
  1:25 సా. వద్ద డిసెంబర్ 28, 2011

  this artcle about rameswaram is very interesting.it would be better if much more is given about ramasethu

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s