రామేశ్వరము / 5

రామేశ్వరంలోని మరికొన్ని దర్శనీయ స్థలాల గురించి ఇవాళ ప్రస్తావిస్తాను.

విల్లొండి తీర్థం

శ్రీరామచంద్రుడు సీతమ్మ దాహాన్ని తీర్చడానికి ఒక బాణాన్ని సముద్రంలో వదిలి ఈ తీర్థాన్ని సృష్టించారని ప్రతీతి. ఇదొక నమ్మసక్యంకాని అద్బుతం. ఒడ్డుకు నుండి సుమారు వంద అడుగులు దూరంలో సముద్రంలో ఒక బావి. నిజంగానే దానిలో నీళ్ళు సముద్రపునీటిలా ఉప్పగా ఉండవు. ఇప్పుడు ఈ తీర్థం, దానిని చేరుకునే చిన్ని వంతెన వాడకానికి పనికిరాకుండా సముద్రపు కెరటాలకు పాడయ్యాయి.

విల్లొండి తీర్థం

విల్లొండి తీర్థం

ఆ బావికి చాలా దూరంలో బండి ఆపి మా డ్రైవరు “ఇదీ విల్లొండి తీర్థం; ఇక పదండి” అనగానే కొంచెం చిరాకుపుట్టుకొచ్చింది. ఇంత దూరం వచ్చింది కేవలం ఎక్కడుందో చూడడానికా? మావాళ్ళు వారిస్తున్నా, మెల్లిగా ఆ సిధిలావస్థలో ఉన్న వంతెన మీద జాగ్రత్తగా నడుస్తూ, గెంతుతూ మొత్తానికి ఆ బావిని చేరుకోగలిగాను. కాలం కలిసొచ్చి నా తెగింపుకి ముచ్చటపడినట్టుగా ఎక్కడినుంచో ఒక కుర్రాడు చిన్న బొక్కెనతో అక్కడికి చేరి అందులోనుంచి నీళ్ళు చేది మాకు రుచి చూపించాడు. ఒహో! ఎదో సాధించేసినంత ఆనందం. వెళ్ళడమైతే వెళ్ళాను కానీ, తిరిగి వడ్డుకు వచ్చేడప్పుడు ఎక్కడలేని దడ పుట్టుకొచ్చింది. విపరీతమైన సముద్రపు గాలి. కాలు జారి కింద పడితే దెబ్బలు కాదు ఏకంగా ప్రాణానికే ముప్పు. రాళ్ళు, విరిగిపడ్డ కాంక్రీట్ ముక్కలు. ఎలాగోలా జాగ్రత్తగా వడ్డుచేరుకొని మావాళ్ళకు ఆ బావి ఫోటో చూపించి నేను చేసిన పనివెనకాల గల “లోక కళ్యాణ” రహస్యాన్ని చెప్పి అక్షింతలు తప్పిచ్చుకున్నా! లేకపోతే చెవులు వాచిపోయి ఉండేవి.

విల్లొండి తీర్థం బావి

విల్లొండి తీర్థం బావి

వివేకానంద స్మారక మందిరం

చాలా తక్కువమందికి తెలిసిన ఒక ప్రశాంతమైన ప్రదేశం రామేశ్వర ద్వీపంలోనే ఉన్న వివేకానంద స్మారక మందిరం. స్వామి వివేకానంద భారతదేశానికి షికాగోనుండి తిరుగుప్రయాణమై కొలంబోనుండి ఓడలో పంబన్ లో ఉన్న కుందుకల్ లో దిగడంతో భారతదేశంలో పునఃప్రవేశం చేశారు. 26 జనవరి 1897. ఆయనకు రామనాడ్ (రామనాథపురం) రాజైన భాస్కర సేతుపతి పాదాభివందనంచేస్తూ స్వాగతించారు. ఆ చారిత్రిక సంఘటనకు గుర్తుగా ఈ మందిర నిర్మాణం సుమారు నాలుగేళ్ళ క్రితం జరిగింది. ఆఁ! ఏదో స్మారక మందిరమే కదా అని వెళ్ళేటప్పుడు అనుకున్నా, అక్కడికి వెళ్ళాక మంత్రముగ్ధులమయ్యామంటే అతిశయోక్తి కాదు.

వివేకానంద స్మారక మందిరం

వివేకానంద స్మారక మందిరం

నిర్మానుష్యమైన ప్రదేశం. కేవలం ఒక గుమాస్తా, ఒక బంట్రోతు. ప్రశాంతమైన వాతావరణం. వెనుకనున్న సముద్ర ఘోష తప్ప ఎటువంటి శబ్దంలేదు. ఈ ఆలయంలో ఒక ధ్యాన మందిరం ఉంది. లోపలికి వెళ్ళగానే ఆ ప్రశాంతత ఇట్టే ఆకట్టుకుంటుంది. తప్పక చూడవలసిన స్మారకమే.

వివేకానంద స్మారక మందిరం లోపలి దృశ్యం

వివేకానంద స్మారక మందిరం లోపలి దృశ్యం

వివేకానంద స్మారక మందిరం వెనుకనుండి

వివేకానంద స్మారక మందిరం వెనుకనుండి

మరొక రమణీయ ప్రదేశం ఈ మందిరం వెనుకనున్నది. అందమైన సముద్రతీరము. సంద్యా సమయాల్లో ఇక్కడికి చేరుకొని ఒంటరిగా ధ్యానం చేస్తే ఏకాగ్రత ఇట్టే కుదరగలదు. రామేశ్వరమంతా అద్భుతమైన సముద్రతీరాలతో (Beaches) నిండి ఉన్నది. ఇంకా చెరచబడని ప్రాకృతిక సౌంద్రర్యాలను ఆస్వాదించాలంటే రామేశ్వరంలోని వివిధ రహస్య ప్రదేశాలను చూడాల్సిందే!

రామేశ్వర సముద్రతీర అందాలు - 1

రామేశ్వర సముద్రతీర అందాలు - 1

రామేశ్వర సముద్రతీర అందాలు - 2

రామేశ్వర సముద్రతీర అందాలు - 2

 

రామేశ్వర సముద్రతీర అందాలు - 3

రామేశ్వర సముద్రతీర అందాలు - 3

రామేశ్వర సముద్రతీర అందాలు - 4

రామేశ్వర సముద్రతీర అందాలు - 4

తిరుపుళ్ళాని

రామేశ్వరం చుట్టూప్రక్కల లెక్కలేనన్ని పుణ్యక్షేత్రాలున్నాయి. నేను అన్నింటినీ దర్శించుకోగలిగాని బుకాయించలేను; ఈ శీర్షిక మరొక టపాతో ముంగించాలన్న కారణం చేత దర్శించినవన్నీ టపాలలో పంచుకోనూలేను.  అందుకని ఈటపాలో మరో రెండు పౌరాణిక స్థలాల గురించి ప్రస్తావించి, వచ్చే టపాలో స్కాందపురాణంలోనున్న రామేశ్వర పుణ్యక్షేత్ర ప్రామాణాల గురించి ప్రస్తావించి ఈ “రామేశ్వరం” శీర్షిక ముగించాలనుకుంటున్నాను.

రామేశ్వరద్వీపం వెలుపల తిరుపుళ్ళాని అనే వైష్ణవ క్షేత్రం కలదు. దీనిని తప్పక దర్శించుకోవాలి. ఇదికూడా దేవాలయ సమూహంగానే పరిగణించవచ్చును. శ్రీరామచంద్రుడు సముద్రుడిని ప్రసన్నం చేసుకొనడనికి ఇక్కడే ధర్భలమీద మూడు రోజులు గడిపింది. ఇక్కడ గల చక్రతీర్థానికి ఎంతో పౌరాణిక ప్రాముఖ్యత గలదు. ఈ శీర్షిక చివరి టపా అయిన తరువాయి దానిలో ఈ తీర్థ ప్రాముఖ్యతగురించి ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తాను.

తిరుపుళ్ళాని

తిరుపుళ్ళాని

చక్త్ర తీర్థము

చక్త్ర తీర్థము

దేవీపట్టణం (దేవీపత్తినం) – నవపాషాణం

దేవీపట్టణం రెండు రకాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్నది. మహిషాసురమర్ధిని ఐన దుర్గావతారంతో ఒక సంబంధం అయితే, రాముడు చేత ప్రతిష్ఠించబడిన నవపాషాణాలతో రెండవది. ఇక్కడ రాముడుచే ప్రతిష్ఠించబడిన తొమ్మిది రాళ్ళు సముద్రంలో కనిపిస్తాయి. వీటిని నవగ్రహాల స్వరూపంగా భక్తులు భావించి పూజలు సమర్పించుకుంటుంటారు. దీని విషయం కూడా తరువాయి టాపాలో స్కాందపురాణాంతర్గతాలయిన ఆసక్తికర విషయాలతో ప్రస్తావిస్తాను.

నవపాషాణం

నవపాషాణం

నవపాషాణం

నవపాషాణం

–సశేషం

ప్రకటనలు
  1. chandu
    5:24 ఉద. వద్ద అక్టోబర్ 25, 2011

    naku rameswarm chchina evani naku teleyadu. viti aniti koraku teliya jesina miku thanks. midi evvuru.miperu emiti?. naku mi kosam telisikovalni unadi, dayachesi telupaglaru ani asisunanu. na peru surya chandra rao. E.G.DT. rajahmundry, kadiyam MDL.dulla

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s