ముంగిలి > పిచ్చాపాటి, శిరోభారం, సరదాగా, హాస్యం > గొర్రెల మంద – కనబడుటలేదు; ఆచూకీ తెలుపగలరు

గొర్రెల మంద – కనబడుటలేదు; ఆచూకీ తెలుపగలరు

మామూలు గొర్రెల మంద కాదు. కొన్ని కారణాల వల్ల ఈ మందకు దేవుడు మనిషి రూపం ప్రసాదించడం జరిగింది. ఈ మందలోని గొర్రెలు ఎంతో విలక్షణమైనవి. వీటిని గుర్తించడానికి వీటి లక్షణాలను కొన్నిటిని క్రింద జత పరిచాను. ఈ గొర్రెలు ఆడా, మగా, కులం, మతం, వయసు, ప్రాంతాల వంటి ఏ ఒక్క కోవకు చెందినవి కావు. వివిధ రకాలు. ఈ గొర్రెలు కొన్ని కొన్ని సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తాయో చూడండి.

ATM వద్ద

ఇవి ATM నుండి డబ్బు తీసుకొనే పద్దతి కాస్త భిన్నంగా ఉంటుంది. వీటికి నమ్మకం తక్కువ. ATM యంత్రాలు ఈ గొర్రెలనే మోసం చేస్తాయని వీటికి అనుమానం. అందుకే డబ్బు తీసుకునే ముందు, డబ్బు తీసుకున్నాక బ్యాంక్ అక్కౌంట్ లో డబ్బు ఎంతుందో చూసుకుంటాయి. ATM బయట ఎంతమంది నిరీక్షిస్తున్నా ఏమాత్రం పట్టనట్టు ఎంతో తాపీగా తమను ATM మోసం చేయట్లేదన్న విషయాన్ని ౠఢీ చేసుకుంటాయి. ఇంతకీ తీసేది ఐదు వందలే! పొరపాటున కాస్తంత ఎక్కువ మొత్తం అయితే, అక్కడే ఆగి ఆ డబ్బుని లెక్క పెట్టుకుంటాయి. తక్కువయితే ఆ ATM తో గొడవ పెట్టుకోని తక్కువైన డబ్బు రాబట్టుకోవద్దు మరి?

రహదారుల మీద

ఈ గొర్రెలు రెండు చక్రాలు, మూడు చక్రాలు, నాలుగు చక్రాలు అన్ని వాహనాలను నడిపిస్తూ కనిపిస్తాయి. రహదారికి మధ్యలో తాపీగా అసలు చుట్టుపక్కల ఎవరూ లేరన్న భావనతో బండ్లు నడుపుతూ కనిపిస్తాయి. ముందర ఎంత ఖాళీ ఉన్నా వీటి పుణ్యమా అని వీటి వెనుక మాత్రం ట్రాఫిక్ జామ్ ఉండడం విశేషం. గీతాచార్యుడు చెప్పిన “స్థిత ప్రజ్ఞతకు” వక్రించిన సజీవ భాష్యాలు ఇవి. అదేంటో అలా బండి ఎక్కుతాయో లేదో, వీటి చెవులు పనిచేయడం మానేస్తాయి. వెనుకవాడు ఎంత గింజుకున్నా కొద్దిగా కూడా పక్కకు జరగవు. వీటిలాగే అందరూ చెవిటివాళ్ళేమోననుకొని చీటికి మాటికి హార్న్ మీట నొక్కుతూనే ఉంటాయి. దారి మధ్యలో ఏదన్నా దుర్ఘటన సంభవించినపుడు లేదా ఏదో ఒక విశేషం కనబడితే అంతే! ఎక్కడి వాహనాలు అక్కడ నిలిపి వెళ్ళీ కేవలం చోద్యం చూస్తాయి.

లిఫ్ట్ వద్ద

లిఫ్ట్ మీట నొక్కి అలా నిరీక్షిస్తూ లిఫ్ట్ తలుపు తెరుచుకోగానే లోపలి వాళ్ళను బయటకు రానీకుండా ఆడ్డగోలుగా “ఇక జీవితంలో నేనెప్పుడూ లిఫ్ట్ ఎక్కను” అని భావిస్తూ లోపలికి దూసుకెళతాయి. ఈ గొర్రెల బారిన పడితే, లోపలి వాళ్ళు బయటకు రావాలంటే చాలా కష్టం.

గుళ్ళలో

గుళ్ళలో వీటి ప్రవర్తన ఇట్టే పసిగట్టేయవచ్చును. పట్టుమని పది రూపాయలుకూడా వ్యత్యించకుండా, ఒక ఎండిపోయిన కొబ్బరికాయ, రెండు బక్కచిక్కిన అరటిపళ్ళు, ఓ అరమూర ఎండిపోయిన పూమాల పుచ్చుకొని ఇక ఆ దేవుణ్ణి కోరికలు కోరతారు చూడండీ! నేను, మా ఆవిడ, మా అబ్బాయి, వాడి భార్య, వాడి పెద్ద కొడుకు, వాడి చిన్న కూతురు, మా అమ్మాయి, మా అల్లుడు, వాళ్ళ కోడుకు, వాళ్ళ కూతురు, నా చెల్లెలు, వారి కుటుంబం, మా తమ్ముడు, వాడి కుటుంబం, మా అత్తా మామలు, మా మేనమామ వాళ్ళ కుటుంబం..బాబాయి…పెదనాన్న…ఓ చాంతాడు మేళం. వీళ్ళందరికీ ఈ కొబ్బరికాయ, రెండు అగరు పుల్లలు, సగం ఆవిరైపోయిన రెండు కర్పూరపు బిళ్ళలు పుచ్చుకొని అన్ని కష్టాలు తీరాలి అన్ని సుఖాలు కలగాలి అని మళ్ళీ ఓ పెద్ద కోరికల చిట్టా. “సకుటుంబస్య” అనే పదానికి ఈ గొర్రెలకు అర్థం తెలీదో లేక ఆ దేవుడికే తెలియదేమోననే అనుమానమో! ఇక ఆ దేవుడితో వీళ్ళకుండే లావాదేవీలు మహామహులైన పారిశ్రామిక వేత్తలనే చిన్న బుచ్చుకునేలా చేస్తాయి. “స్వామీ ఈ సారి నా జీతం లక్ష రూపాయలు పెరిగితే నీ హుండిలో ఓ వంద సమర్పించుకుంటా!” ఓహో వీడిచ్చే ఓ వంద రూపాయలకు కక్కుర్తి పడి ఆ దేవుడు ఓ లక్ష రూపాయలు జీతం పెంచాలన్నమాట!

ఆసుపత్రులలో

బయట ఎంతమంది నిరీక్షిస్తున్నా, వైద్యుడు “ఇక చాల్రా బాబు” అని ముఖ కవళికలతో సందేశాలిస్తున్నా, అలాగే పట్టుక్కూర్చుంటారు. “డాట్టర్గారండీ…మరేఁ అదండీ….మరేఁ ఇదండీ” అని కట్టిన ఫీజుకు పదిరెట్ల విలువను పొందాలనే ప్రవర్తన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది చాలదన్నట్టు, ఓ అరగంటాగి మళ్ళీ రంగ ప్రవేశం. “ఏం లేదండీ! ఇందాకే కలిశా…ఓ చిన్న డౌట్ క్లారిఫై చేసుకోడానికే” అని చిర్రుబుర్రులాడుతున్న ఇతర రోగులకు సంజాయిషీ ఇస్తూ అలా తలుపుదగ్గిరే నించొని తెరుచుకోగానే మళ్ళీ లోపలికి జొరబడి మరొ అర గంట హాం ఫట్!

మొత్తానికి ఈ గొర్రెల మందేంటో వీటిని ఎలా గుర్తించాలో ఇక అర్థమయిందనుకుంటా. వీటి ఆచూకీ గట్రా తెలిస్తే, తప్పక తెలియజేయగలరు.

ప్రకటనలు
 1. ramesh
  7:11 సా. వద్ద మార్చి 29, 2011

  Good observation. This is the reason why foreigners (Sonia, etc) were able to rule India with single (iron) hand. They may be laughing at us.

 2. 12:34 సా. వద్ద మార్చి 30, 2011

  ఎటియంలో డబ్బులు తీసుకునే వాళ్ళలో కొంతమందికి వారి ఖాతాలో నగదు నిల్వ వివరాలు తెలియకపొవచ్చు…మొదటసారి వాడుతూ ఉండవచ్చు.. లేదా వాటి పనితనం గురించి తెలియకపొవచ్చు అందుకే వారు ఒకటికి రెండు సార్లు సరి చూసుకుంటూ వుండవచ్చు… లేకపోతె ఇంతకుముందు ఒకసారి దెబ్బతినివుండొచ్చు…ఒక ఐదారువేలు సంపాదించేవాళ్ళకి ఒక్క రూపాయి అయినా చాలా విలువైనది ఇనా ఎంత సంపాదించినా ఎవ్వరూ కూడా డబ్బుని విసిరేస్తారు అనుకోను (మీ మాటలు మీరేదో డబ్బుని తృణప్రాయంగా విసిరివేసేటట్టు ఉన్నాయి) మీరు వీటిని పట్టించుకోకుండా అలాంటి వారిని గొర్రెలు అని అనడం ఎంతవరకు సమంజసం? మీరు చెప్పిన గుడి, ఆసుపత్రి విషయాలు కూడా అలానే ఉన్నాయి…మనకు ఇబ్బంది కలిగినంత మాత్రాన ఇలాంటి పరుషమయన వ్యాఖ్యలు చెయ్యడం ఎంతవరకు సబబు అన్నది ఒక్కసారి ఆలొచించండి అన్నది నా మనవి

 3. 4:11 సా. వద్ద మార్చి 30, 2011

  చమళ్ళ ఉమా శంకర్ గారు,

  మీ వ్యాఖ్యకు మొదటిగా ధన్యవాదాలు. మీకు నా టపా బొత్తిగా నచ్చలేదని తెలుస్తోంది. క్లుప్తంగా మళ్ళీ ప్రయత్నిస్తాను.

  గొర్రెకు మనిషికి మౌలికంగా ఒకటే తేడా. గొర్రెకు బుఱ్ఱ ఉన్నా లేనట్టే. దాని దృష్టిలో ప్రపంచం బహుశః రెండుగా విభజింపబడి ఉండోచ్చు. “నేను”, “నేను కానిది”.

  కానీ మనిషి అలా కాదు. కళలు, నవరసాలు, ప్రేమ, క్రోధం, వాత్సల్యం, అసూయ….ఓ పెద్ద లిష్టే. దేవుడిచ్చిన అంతటి బుఱ్ర పెట్టుకొని దాన్ని వాడడం రాకనో, ఇష్ట పడకనో పక్కవాడికి ఎప్పుడూ తలనొప్పి కలిగించే వాడిని “గొర్రె” అని సంభోదిస్తే బహుశః గొర్రేకు కూడా కోపం రావచ్చు (దానికి అర్థమయితే).

  ATM విషయమే తీసుకుందాం. తన ఖాతాలో ఎంతుందో తెలియకపోతే దాన్నేమనాలి? ATM పనితనం తెలుసుకోవడం ఒక బ్రహ్మ విద్యా? ఒకసారి దెబ్బతినడం అంటే? సరే ఏదో జరిగిందనుకుందాం. అక్కడే నుంచొని ఏదన్నా తప్పు జరిగితే, ATMతో గొడవ పడగలడా లేక అక్కడున్న కాపలాదారును సంజాయిషీ అడగగలడా? కాస్త ఆలోచించండి మీరే. ఏదన్నా అటూ ఇటూ జరిగితే, మొదట బ్యాంక్ వారిని సంప్రదించి జరిగింది చెప్పగలిగే చిరు మేధస్సుంటే చాలేమో? పక్కవాడికి ATM కార్డు, దాని పిన్ నెంబర్ చెప్పి సాయం అడిగి ఉంటే, ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ఇక గూడి విషయానికొస్తే, దైవంతోటే బేరసారాలు జరపొచ్చులే అనుకునేవాడికి అసలు దైవం గురించి అవగాహన ఉన్నట్టా లేనట్టా? దైవమా లేక వీధిచివరి కిళ్ళీకొట్టువాడా గుళ్ళోని మూలవిరాట్టు? వీడికి కొవ్వెక్కి ఏ నీరసమో అజీర్తో చేసిన పాపానికి వైద్యుడిని కలవడానికి వచ్చిన ఇతరులనెందుకు అంతగా నిరీక్షింపజేయడం? వెళ్ళేది క్లినిక్ కీను, తంతేమో పెద్దాసుపత్రంత!

  చివరిగా నాకు డబ్బుగురించి ఉన్న అవగాహనమీద మీరు ఓ వ్యాఖ్య చేశారు. బోధ పడలా! మీకెందుకనిపించింది నాకు డబ్బంటే విలువ లేదని.

 4. 12:03 సా. వద్ద ఏప్రిల్ 5, 2011

  మీ టపా నచ్చకపోవడం అనడం కన్నా అందులో వాడిన పదజాలం నచ్చలేదు అనడం అర్ధవంతమేమో.. ఎందుకంటే మనకు నచ్చలేదు అనే ఒక్క కారణంతో మన తొటివారిని గొర్రె అని సంభొదించడం సబబు కాదు అనేది నా భావన….మనకి వచ్చినంత లేకా తెలిసినంత మాత్రాన అవతలవాళ్ళకి అది తెలియాలి అనుకోవడం తప్పు అనేది నా భావన….రహదారులు మరియు లిఫ్ట్ విషయంలో మీతొ నేను కూడా ఏకీభవిస్తాను ( కానీ అంతమాత్రాన వారిని గొర్రెలు అని సంభొదించడం కఛ్ఛితంగా తప్పు అని నా భావన …)

  *చివరిగా నాకు డబ్బుగురించి ఉన్న అవగాహనమీద మీరు ఓ వ్యాఖ్య చేశారు. బోధ పడలా! మీకెందుకనిపించింది నాకు డబ్బంటే విలువ లేదని
  “ఇంతకీ తీసేది ఐదు వందలే” అన్న మీ వ్యాఖ్యని గుర్తు చేస్తూ అన్నాను లెండి…ఒక మనిషి ఆర్ధిక పరిస్థితినిబట్టి ఉంటుంది రూపాయికి తను ఇచ్చే విలువ…మీకు ఐదు వందలు పెద్ద విషయం కాకపొవచ్చు కానీ అందరకీ కాదు కదా

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s