ముంగిలి > పిచ్చాపాటి > గెలుపు సంబరాలు

గెలుపు సంబరాలు

నిన్న పని వత్తిడి కాస్త ఎక్కువై, ఆఫీసునుండి కుసింత ఆలస్యంగా ఇంచుమించు మ్యాచ్ ముగిసిన పది నిముషాల తరువాత ఇంటికి బయలుదేరాను. మ్యాచ్ గెలిచిన సంబరాలు ఉంటాయి అని ఆశించాను కానీ నేను ఊహించిన దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా జనాలు పండగ చేసుకున్నారు. దారి పొడవునా ట్రాఫిక్ జామ్, పరిచయాలతో సంబందం లేకుండా ఒకరి నొకరు రోడ్ల మీద అభినందించుకోవడం, బాణాసంచా, బండ్ల మీద త్రివర్ణ పతాకాలనూపుకుంటూ హర్షధ్వానాలు…ఓహ్…ఒక్కటేంటి? అన్ని రకాలుగా సంబరాలు జరుపుకుంటూ దారి పొడవునా కనిపించారు.

ఆ సంబరాలవల్ల కలిగిన ట్రాఫిక్ జామ్ ఏ మాత్రం చిరాకు కలిగించలేదు. దారిలో అపరిచితులు చోదకులతో కరచాలనం చేయాలని వాహనాలను ఆపిన ప్రతి చోటా మనస్పూర్తిగా నేనూ నా సంతోషాన్ని వెలిబుచ్చాను. మిగతా దేశం సంగతి అటుంచి చీటికి మాటికి గొడవలతో సతమతమౌతున్న భాగ్యనగర వాసులకు ఈ సంబరాలు ఒక ఆటవిడుపు.

నిజంగా పండుగ వాతావరణం. కానీ ఈ అనుభూతి పొందుతున్నప్పుడు కొన్ని భావనలు.

కేవలం పదకొండుమంది మీద ఇంతటి బాధ్యతా? వాళ్ళకేలా ఉండి ఉంటుందో? గెలిచాము కాబట్టి ఫరవాలేదు. అందరికన్నా ఎక్కువ సంబరాలు జరుపుకునే హక్కు వారికి చేజిక్కింది. కానీ ఆట మొదలైనప్పటి నుండి వాళ్ళు ఎంతటి ఒత్తిడికి లోనై ఉండి ఉంటారో? మ్యాచ్ తిలకించడానికి రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగ హేమాహేమీలు అక్కడే స్టేడియంలో ఉన్నారు. రాజకీయ సభలకు లారీల్లో తరలించబడినట్టు కాకుండా స్వచ్ఛందంగా చుట్టూ చేరిన ఒక జన సముద్రం. దానికి కొన్ని లక్షల రెట్లు ఎక్కువైన దేశ జనాభా టీ.వీ. సెట్లలో వీక్షిస్తూ ఉండి ఉంటారు. ఇంతమంది ఆశ కేవలం పదకొండు మంది మీద. ఎంతటి భారం! ఎంతటి బాధ్యత!

గెలుపోటములు దైవాధీనాలు. కాస్త అటూ ఇటూ జరిగి మ్యాచ్ చేజారి పోయి ఉండి ఉంటే? ఆటగాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే హాడలేస్తోంది.

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. CHANDU
  10:41 ఉద. వద్ద మార్చి 31, 2011

  Meeru cheppindi chaalaa nijam andi. Maa veedhi lo kurraallu baana sanchaa kodaa kaalchaaru. Office nunchi bike lo vastunte shake hand ivvataaniki vaalla taapatryam chaalaa aanandaanni kaliginchindi. Nenu akkade bike park chesi kaasepu enjoy chesanu.

  Nijamgaa mana jattu meeda chaalaa vattidi undi untundi.

  CHandu

 2. sailaja
  12:06 సా. వద్ద మార్చి 31, 2011

  nizam ga nizam…. naaku kooda ninna alane anipinchindi.. eppudu cool ga unde sachin kooda ground lo unrest feel avuthunte… gollu korikesukuntunte…i felt how they are able to handle so much pressure ani.. pak vaallu kooda mana daayadule kaabatti wckts paduthunte tension handle cheyyaleka last varaku poraadi poraadi odaaru kaani ade ee match eh western countries tho no ayi unte manam match gelichi undevallam kaademo.. aina antha mandi hema hemila mundu aadi pressure thattukoni aadinanduku vaallaki JEJELU. gelichinanduku kooda ofcourse

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s