ముంగిలి > తెలుగు వెలుగులు > అందాన్ని అందంగా అభివర్ణించడం

అందాన్ని అందంగా అభివర్ణించడం

నిన్న రాత్రి టి.వీ.లో మహాభారతంపై మహా సహస్రావధాని Dr. గరికపాటి నరసింహారావు గారి సామాజిక వ్యాఖ్య చూసే అవకాశం దొరికింది. విరాటపర్వము ప్రథమాశ్వాసము. సంధర్భమొచ్చి “అర్జునుఁడు పేడిరూపమున విరటుఁ గొల్వవచ్చుట.” అందులో విరాట మహారాజు కబురంపించగా ఉత్తర వస్తున్న సన్నివేశం. ఆ అమ్మాయి రంగ ప్రవేశాన్ని అభివర్ణిస్తున్న నన్నయభట్టారకుని పద్యాన్ని గరికపాటిగారు అరటిపండు వొలిచిపెట్టినట్టు వివరించారు.

సీ. అల్లఁదనంబున యనువు మైకొనఁ జూచు | నడపు కాంతికి వింతతోడవు గాఁగ;
వెడవెడ నూఁగారి వింతయై యేర్పడు | దేరని పళులలో నారు నిగుడ;
నిట్టలు ద్రోచుచు నెలవుల కల మేర | లెల్లను బిగి యెక్కి యేర్పడంగఁ;
దెలుపును గప్పును వెలయంగ మెఱుఁ గెక్కు | తారకంబులఁ గల్కితనము దొడరఁ
ఆ. జరణములును నడుముఁ జన్నులుఁ గన్నులు | జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు
చునికిఁ దెలుపుచుండ నుత్తర చనుదెంచె | నలరువిలుతు పువ్వుటమ్ము వోలె

గుండెమీద చెయ్యేసి చెప్పండి. పై పద్యాన్ని పూర్తిగా చదివారని! చదివి ఉంటే తడుముకోకుండా చదవగలిగారని! తడుముకోకుండా చదివి ఉండి ఉంటే దాని అర్థం అవగతం అయ్యిందని. ఒకవేళ అర్థం కూడా బోధ పడిందంటే, ఆ పద్యంలోని సౌందర్యం పూర్తిగా ఆస్వాదించగలిగారని. ఒకావేళ మీరు పై పద్యాన్ని పూర్తిగా, తడుముకోకుండా చదవి దాని అర్థాన్ని గ్రహించి అందులోని భావ సౌందర్యాన్ని అస్వాదించగలిగి ఉంటే, ఖచ్ఛితంగా మీరు ధన్య జీవులే! నా విషయానికొస్తే పై పద్యాన్ని పూర్తిగా తడుముకుంటూ చదవ గలిగాను. అంతే!

ఉత్తర పేరుగాంచిన లోకోత్తర సుందరేంకాదు. ఈ సంధర్భంలో పద్నాలుగేళ్ళే కాబట్టి యౌవ్వనం పూర్తిగా వికసించలేదు. పైపెచ్చు కేవలం తండ్రిగారు పిలిచారు కాబట్టి తను అక్కడికి వచ్చింది. అటువంటి సంధర్భాన్ని కూడా ఇంతగా అభివర్ణించగలిగారంటే నన్నయగారి భావ సౌందర్యం అబ్బుర పరుస్తోంది.

ఒక చుక్క తేనెను ఆస్వాదించినందుకే నాకు ఇంతటి ఆహ్లాదం కలిగిందంటే తేనెతట్టలైన ఆ మహా కవులు ఎంతటి ధన్యులో కదా? వారి భావాలను పూర్తిగా ఆస్వాదిస్తున్న నేటి తేలుగు పండితులు ఇంకెంతటి ధన్యజీవులో కదా?

ఈ రోజుల్లో, స్త్రీ సౌందర్యం కేవలం ఒక కామప్రేరణ సాధనం మాత్రమే! రవి చూడని అందాలను కూడా ఒక సోఫాసెట్ అమ్ముకోవడానికో, ఒక చలనచిత్రానికి ప్రజలను ఆకర్షించడానికో అడ్డగోలుగా వాడేసుకుంటుంన్నారు.

సరే. ఇంతకీ ఎంటా పద్యంలోని విశేషమనుకుంటున్నారా? మన భాషలో దాని అర్థం కూడా రాస్తాను. సోంత కవిత్వం కాదు లెండి. నేను ఈ పద్యానికి అర్థం చెప్పడం, MS Paintలో రవివర్మ చిత్రాలను బరికే ప్రయత్నంలాంటిది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన “కవిత్రయ విరచిత శ్రీమదాంద్ర మహాభారతం” లోనిది.

ఉత్తర తన నడక కుండే సహజమైన మాంద్యమునందలి ఒప్పు వింత అలంకార మయ్యేటట్లుగా (పాదాలతో నడిచి వచ్చింది), ఏర్పడీ ఏర్పడని వళులమీద మొలచీ మొలవని రోమావళి నిండుదనం కలిగించగా (నడుము సొగసుతో నడిచి వచ్చింది), ఉరము మీద ఉన్న చోటును త్రోసికొంటూ పెల్లుబుకుతూ అక్కడ ఉన్న తావులన్నీ బిగువుగా ఆవరించిన (యౌవనోదయ సమయంలో పొటమరించిన) వక్షోజాలు ప్రకటమౌతూ ఉండగా (చనువు సోంపుతో వచ్చింది). తెలుపు నలుపులు వింతకాంతుల కంటి పాపలకు మనోజ్ఞత్వాన్ని కలిగిస్తూ ఉండగా (కన్నుల విలాసంతో కదలి వచ్చింది). ఈ విధంగా పాదాలకు, నడుముకు, చన్నులకు కన్నులకూ వయసు వయ్యారం కలిగిస్తున్నట్లు తేటపడగా మన్మథుడి పూవుటమ్ము వలె (కొలువులోకి) వచ్చింది.

“తండ్రిగారు పిలిస్తే వచ్చింది” అంటే సరిపోయే విషయాన్ని ఇంత నిశితంగా వివరించగలగడం…ఓహ్!!!!

ప్రకటనలు
  1. a sasikumar
    10:21 సా. వద్ద సెప్టెంబర్ 18, 2012

    padyam vrasinadi tikkana nannaya kadu nannayya adi sabha & aranya paryam1/2vrasadu

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s