ముంగిలి > పిచ్చాపాటి, శిరోభారం > కప్పు గెలిచింది మనమే అయినా గెలవడానికి కారణం ధోనీ మాత్రమే

కప్పు గెలిచింది మనమే అయినా గెలవడానికి కారణం ధోనీ మాత్రమే

ఓ సగటు భారతీయూడికిమల్లే క్రికేట్ అంటే ఆసక్తి ఉన్నా, గత కొన్నేళ్ళగా అది పూర్తిగా సన్నగిల్లింది. IPL పుణ్యమా అని క్రికెట్ మరీ ఎక్కువైపోయి మొహం మొత్తినట్టయ్యింది. ఇక మన భారత జట్టు సంగతా సరే సరి. “నేను, నేను మాత్రమే” అనే అభిప్రాయంతో ఆడే జట్టుగాళ్ళే ఎక్కువ. ఎవడికి వాడు తన కోసం మాత్రమే ఆడి జట్టు గురించి ఆడక, అప్పుడప్పుడు గెలిచి కీలక మ్యాచుల్లో చతికిలపడిపోతూ విరక్తి పుట్టించి ఉన్న కొంచేం ఆశను కూడా చంపేశారు.

అటువంటిది, నిన్నటి మ్యాచ్ మహదానందాన్ని కలిగించింది. ఎనిమిదేళ్ళ క్రితం మన పరాజయానికి ఒకానొక కారణమైన ఝహీర్ ఖాన్ దుందుడుకు ప్రవర్తన, ఇన్నేళ్ళ తరువాత పరిపక్వత చెంది మంచి అనుభవజ్ఞుడైన ఆటగాడిలా ఆడించి అద్భుతమైన బౌలింగ్ చేయించి మంచి పునాది ఏర్పరిచింది. నలభై ఓవర్లవరకు మనవాళ్ళ ఫీల్డింగ్ అబ్బుర పరచింది. మెల్లిగా శ్రీలంక పరుగులు కూడబెట్టుకుంటున్నా, బౌండరీలను కట్టడి చేసి ఎంతలేదన్నా ముప్పై నుండి యాభై పరుగులుదాకా మనవాళ్ళు నివారించగలిగారు.

ఎటొచ్చీ మన బ్యాటింగ్ మొదలయ్యాక పాత జ్ఞాపకాలను తిరగతోడారు మన కర్ణతుల్యులైన సెహ్వాగ్, టెండుల్కర్లు. దేశం మొత్తం చూస్తోందే అన్న ఇంగితం లేకుండా LBW నిర్ణయాన్ని రివ్యూకి ఎలా రిఫర్ చేశాడో మహానుభావుడు. పిల్లలు ఓడిపోయినప్పుడు ఒప్పుకోనట్టుగా తోచింది సెహ్వాగ్ ప్రవర్తన. ఇక టెండుల్కరు అలా ఒక ఆశ పుట్టిచ్చి, చటుక్కున గుండెలు దిగజార్చాడు. నిఖచ్చితంగా గొప్ప ఆటగాడే; కాదనలేము. కానీ ప్రపంచ కప్పులో ఆడలేకపోతే ఎందుకంట అన్నన్ని రికార్డులు?

గంభీర్, కోహ్లీలు దేశజనాభా గుండెల్ని పూర్తిగా నలిగిపోకుండా తమ హస్తాలతో ఆదుకున్నారు. వ్యవహారం కాస్త కుదుటబడటానికి ముఖ్య కారకులు. కోహ్లీ అవుటయినప్పుడు ధోనీ బరిలోకి దిగడం కీలక పాత్ర పోషించింది. అదే యువరాజ్ కానీ దిగి ఉంటే, గంభీర్ ఖచ్చితంగా రనౌట్ అయి ఉండేవాడు. దుందుడుకు ఆటతీరు తప్పేమీ కాదు. కానీ కొన్ని సంధర్భాలలో అది కొంపలు ముంచ గలదు. ఏమంటూ దిగాడో కానీ మహేంద్ర సింహ్ ధోనీ, “టెన్షన్ అంటే ఏంటి?” అన్నట్టుగా ప్రవర్తించాడు.  అలాంటి ప్రవర్తన ఆ సమయంలో మనకు కావలిసిన ఏకైక మందు. కొద్దిగా కుడా జంకు లేకుండా అలా తాపీగా గంభీర్ ని చక్కగా ఆడించాడు. కానీ తను అలా యువరాజ్ ని పక్కన పెట్టి బరిలోకి దిగడం బహుశః ఇతర జట్టుగాళ్ళకు నచ్చలేదనుకుంటాను; ముఖ్యంగా యువరాజ్, హర్భజన్ లకు. తరువాత వచ్చిన యువరాజ్ ప్రవర్తన యావత్ దేశం తిలకించింది. ముభావంగా ఆడడం; రెండు సార్లు ధోనీకి చుక్కలు చూపించడం. చూసే వాళ్ళు “ఎదవలు” అనుకుంటారో ఏంటో కొందరు. స్ట్రైక్ కోసం తాపత్రయ పడడం, అనవసరపు పరుగులకు ప్రయత్నించడం. ఇక్కడే మనకు, ఆస్ట్రేలియా వంటి జట్లకు తేడా.

సరే. మొత్తానికి గెలిచాము. కానీ ప్రెసెంటేషన్ సెరెమొనీలో ఈ తేడాలు, అంతర్మధనాలు అన్నీ బట్టబయలయ్యాయి. “ఈ కప్పు టెండుల్కర్ కోసం గెలిచాం“, “నా యీ సాఫల్యానికి వెనుక మా గురూజీలు కారణం“…ఏంటీ సంత గోల? కోచ్ ని భుజాన వేసుకొని ఊరేగడం సమంజసమే. కానీ టెండుల్కర్? దేనికి అంతటి బ్రహ్మ రథం? ఇది చాలదన్నట్టు, తన కోడుకూ కూతుళ్ళాతో ఊరెరిగింపు. చూస్తుంటే డోకొచ్చింది. అంతటి అనుభవమున్న ఆటగాడే; కేప్టెన్ గురించి పట్టింపు లేకుండా అలా ప్రవర్తించడమేంటి?

జట్టులో ఒక్క పురుగైనా ధోనీ గురించి మాట్లాడిందా? అదే మనంకానీ ఓడి ఉంటే? ఒక్కణ్ణి చేసి చితకబాదేసి ఉండే వాళ్ళు అందరూ కలిసి. మిగతా జట్టుగాళ్ళకు బుద్ది లేకపోయినా, రవి శాస్త్రి, గవాస్కర్, నవ్ జ్యోత్ సింహ్ సిద్ధూ, హర్షా భోగ్లేలు మాత్రం అర్థం చేసుకో గలిగారు. అందరినీ దుమ్మెత్తిపోసే గవాస్కర్ కూడా పొగిడాడు ధోనీని. నిజానికి బహుశః ధోనీ చేసిన ఒకే ఒక్క తప్పు శ్రీశాంత్ ను ఎన్నుకోవడం. మనిషి అన్నాక ఒకటో రెండో తప్పులు జరుగుతాయి. రవి శాస్త్రి ప్రెసెంటేషన్ సెరెమొనీలో భలే బాగా చెప్పాడూ ధోనీని సంబోదిస్తూ. “…you said many many questions to answer. Plenty of questions on the number of runs you got in this tournament. Nice way to ask everyone to shut-up. Let your bat do the talking…”

మొత్తానికి ఏదో ఒకటి చేసి ధోనీ ఇలాంటి జట్టుగాళ్ళను ఒకే తాటిపై నడిపించి దేశానికి ఒక మరిచిపోలేని మధుర స్మృతిని మిగిల్చాడు. ధోనీ…కపిల్ దేవ్ లా నువ్వు మా జ్ఞాపకాలలో ఓ పెద్ద పీఠను అలకరించావోయ్.

ప్రకటనలు
 1. 5:44 సా. వద్ద ఏప్రిల్ 3, 2011

  ధొనీ గురించి మీరు చెప్పినదాన్ని పూర్తిగా ఏకీభవిస్తాను.
  “..కపిల్ దేవ్ లా నువ్వు మా జ్ఞాపకాలలో ఓ పెద్ద పీఠను అలకరించావోయ్.” – ఔను, నిజం.

 2. lak
  8:40 సా. వద్ద ఏప్రిల్ 3, 2011

  one of the worst analysis on this match! Dhoni played only one match in this world cup. Without sachin and other team member it is not possible to reach the final. Especially sachin and yuvaraj really played well at crucial matches like australia and pakistan. Gambir & shewag & Kohli contribution also there for crucial matches. This victory is entire team effort. This victory will not belongs to one person.

  Sachin build the inspiration in entire team by playing well at 38 years age. He also given very good openning stand.

  Looks like you don’t like sachin. Because of that you wrote this post. You are trying to encash by simplying pointing fingures on idiotic things.

  He did not asked team members to lift up. Even he did not mentioned that he played well in this world cup. Every indian and entire indain cricket team want to give great cup to sachin. Finally they achieved and expressed their wishes by lifting up.

  Honestly nothing wrong. Sachin deserved that.

 3. 9:49 సా. వద్ద ఏప్రిల్ 3, 2011

  చదువరిగారు: ఏకీభవించినందుకు ధన్యవాదాలు.

  lak: Don’t jump to conclusions. What do you know of my opinion on Sachin? Sachin is a pinnacle of sportsmanship. In his entire career he never got entangled in embarrassments like Tigerwoods or our own Azharuddin. I respect him and it is unquestionable. But the topic in discussion is not Sachin but contribution towards winning the cup. World cup has been eluding India for a generation.

  What good is the history or achievements of a person of his stature if cannot withstand tension of playing such a crucial match? Fumble so miserably in front of a nation that worships him?

  It counts a damn how all the previous matches were played or who contributed in those matches. Sri Lanka came to finals having won so many matches! What matters is “ultimately who prevailed and withstood the demands of a World cup final.” The problem with Indians is “Hero Worship” to the extent of becoming blind to other’s achievements.

  If Dhoni were not there or composure of Gambir and Kohli was absent, we all would have been licking our wounds instead of celebrating the achievement. Grow up people…

  जो जीता वही सिकंदर…

 4. 12:26 ఉద. వద్ద ఏప్రిల్ 4, 2011

  @లక్
  గంగులు కెప్టెన్ గ ఉన్నపుడు ఎన్నో ఫైనల్స్ కి వెళ్ళాము. మీరన్న పుదిన్గులందరూ ఎన్ని ఫైనల్స్ గెలిపించారు. అప్పట్లో 13-14 టోర్నమెంటు లు ఫైనల్స్ లో ఓడిపోయము. సచిన్ మరి ఇతర పుదింగులు అపుడు ఎందుకు గెలిపించలేదు?

  ఒత్తిడిని తట్టుకుని నిలిచి గెలిచినవాడే పులి. అందుకే ధోని పులి. 😉

  ఇంకా సచిన్ వలెనే ఇంత దూరం ఫైనల్ దాక వచ్చాము నిజమే. యుద్దంలో జండా పట్టిన వాడి దగ్గరనుంచి గుర్రాలు, రధాలు, ఏనుగులు.. అందరి వలెనే చివర దాక వెళతాము. చివరికి రాజు గెలిచాడు అని అంటాము. అలా అని వాళ్ళను తక్కువ చేయలేము. కాని కెప్టెన్ కన్నా వాళ్ళ కాంత్రిబుషన్ తక్కువే.

 5. Shanthi
  3:46 సా. వద్ద ఏప్రిల్ 5, 2011

  కప్పు గెలవడానికి కేవలం ధోనీ ఏ కారణం అని అనడం సమంజసం కాదని నా అభిప్రాయం.మునుపటి ఆటల్లో మిగతా వాళ్ళందరూ కూడా సరిగ్గా ఆడడం మూలంగానే కదా అసలు మనం ఫైనల్స్ వరకూ వచ్చింది.అలా అని ధోనీ గొప్పతనం లేదని కూడా నేను అనట్లేదు.కేప్టన్ గా ప్రస్థుతం ఉన్న టీం లో ధొనీ కి సాటి ఎవరూ లేరు.సచిన్ తన మాటల్లొ చెప్పాడు కూడ “Dhoni is the best captain I have played under” అని.ఒక కేప్టన్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ,మిగతా పదిమందినీ విజయం వైపు తీస్కెళ్ళడం లో ధొనీ పాత్ర ఏభై శాతం ఉంటే,మిగిలిన ఏభై శాతం ఘనత టీం లో ఉన్న మిగతా అందరికీ చెందుతుందని నా అభిప్రాయం.

 6. 3:57 సా. వద్ద ఏప్రిల్ 5, 2011

  జంకు లేకుండా నేను మీతో ఏకీభవిస్తాను. మీరన్నట్టే, మిగతా టీం అంతా ఒక ఎత్తు, ధోనీ ఒక్కడు ఒక ఎత్తు.

  P.S. నేను ధోనీ లేదా ఏ ఒక్క క్రికెటర్ కు అభిమానిని కాదు సుమా!

 7. venhu
  6:01 సా. వద్ద ఏప్రిల్ 6, 2011

  చాలా బాగా వ్రాశారండి. ధోని పొగడ్తలకి అన్ని విధాల అర్హుడు. పాకిస్తాన్ చేజింగ్ చూడండి. అఫ్రిదీ ఒక్క స్థానమైనా ముందొచ్చాడా? తను ఫాంలో లేడు, పైగా ఫాం లో ఉన్న యువరాజ్ ని ఆపి మరీ ధోనీ వచ్చాడంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉపయోగ పడుతుందనే కదా. ఒక వేళ ఈ మేచ్ లో తను విఫలమైతే తను ఎన్ని విమర్శలు ఎదుర్కొవస్తుందో తనకి తెలియదా? అయినా జట్టు కోసమే కదా ముందోచ్చాడు!
  ఇక ధోనీ పరుగులు చెయ్యలేదని విమర్సిస్తున్నారే, వాళ్ళలో ఎంత మంది గంభీర్ అవుటవుతున్న విధానాన్ని సమర్ధిస్తారు? సేనియర్ మోస్ట్ హర్భజన్ సింగ్ వికెట్ల సంగతేమిటి?

 8. Kameswara Rao
  8:55 సా. వద్ద ఏప్రిల్ 9, 2011

  గంభీర్, కోహ్లీలు దేశజనాభా గుండెల్ని పూర్తిగా నలిగిపోకుండా తమ హస్తాలతో ఆదుకున్నారు. వ్యవహారం కాస్త కుదుటబడటానికి ముఖ్య కారకులు.All player can not play equally. But Gambhir has given stand, if he too failed means we would have lost the match. This is certain.In my view he deserve the MAN OF THE MATCH award.

 9. ashwin
  9:13 సా. వద్ద ఏప్రిల్ 30, 2011

  u r completely wrong on sachin tendulkar because when sachin makes a century and also we lost the match means its not sachin’s fault. u also remeber that he is top scorer & yuvraj showed an excellent all round perfomance. dhoni captency is good but u dont under estimate others especially the great sachin.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s