ముంగిలి > పిచ్చాపాటి, హాస్యం > నవ్వించే వార్త

నవ్వించే వార్త

2G, పుట్టపర్తి, శాంతి-శశి భూషణ్, మానభంగాలు, హత్యలు వగైరా వగైరా వార్తలలోని విషాన్ని రోజు ప్రొద్దున్నే సేవించడం అలవాటు పడ్డ నాకు నిన్న ఒక వార్త చదివినపుడు మాత్రం కాస్తంత నవ్వొచ్చింది. వార్త నిజానికి మామూలు వార్తే అయినప్పటికి, ఇతరత్రా వార్తలలోని కుళ్ళుతో పోల్చుకుంటే ఎందుకో ఈ సాధరణ వార్త ఏదో కాస్త వెరైటీ అనిపించింది.

ఇతివృత్తమేమిటంటే, సదరు ఆమాత్యులవారు తెనాలి పురపాలక సంస్థ వారికి ఒక క్లాస్ పీకారట. “పారిస్ ఆప్ ఆంధ్రా” లాంటి తెనాలిని ఒక మురికి కాలువ కింద మార్చేశారని అన్నారని ఆ వార్తను చదివితే తెలుస్తోంది. “పారిస్ ఆఫ్ ఆంధ్రా” కూడా కొంత నవ్వు పుట్టించినా, అసలు కామెడీ అది కాదు. తిరిగి కథలోకి వస్తే, అలా ఎక్కి తొక్క పడ్డం వల్ల ఆ పురపాలక సంస్థలోని ఉద్యోగులకు మండిందట. సరిగ్గా వారం తరువాత అక్రమ కట్టడాలను కూల్చడం ద్వారా వారి సత్తా ఏంటో చూపించారట. కూల్చబడ్డ అక్రమ కట్టడాలు అధికార పార్టీ సభ్యులకు చెందినవట. కొసమెరుపు ఏమిటంటే, తెనాలి పురపాలక సంస్థ కమీషనర్ గారు ఆ కట్టడాల కూల్చివేతల కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, పని పూర్తయ్యె వరకు ఉద్యోగులను తమ సెల్ ఫోన్లను ఆఫ్ చేసి పెట్టమని చెప్పారట.

వ్రాసిన విధానాన్నిబట్టి ఈ వార్తకు కొంత డిస్కౌంట్ ఇవ్వవచ్చనిపించింది. పూర్తిగా కాకపోయినా, ఈ వార్తలో ఎంతో కొంత నిజముండే ఉంటుంది. వార్త చదివిన వెంటనే ఒక పాత హిందీ సినిమా డైలాగ్ జ్ఞప్తికి వచ్చింది.

जानी…जिनके घर शीशेके बने होते हैं…वो दूसरों पर पत्तर फेंखा नही करते…”  – “జానీ…అద్దాల మేడలున్నవాళ్ళు, ఇతరులపై రాళ్ళు రువ్వరు…

ఈ లంకే ద్వారా ఆ వార్తను చదవొచ్చు. ‘Illegal constructions’ of Congress leaders bulldozed in Tenali

ప్రకటనలు
 1. Indian Minerva
  11:11 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2011

  😀

 2. ఓబుల్ రెడ్డి
  6:33 సా. వద్ద ఏప్రిల్ 21, 2011

  తెనాలికి Andhra Paris అనే పేరు కొత్తది కాదు. వందేళ్ళనుంచీ ఉంది. అది బ్రిటీషువాళ్ళు ఇచ్చిన బిరుదమే. ఆ రోజుల్లో ఆ ఊరు అంత అందంగా ఉండేదట.

 3. 12:26 సా. వద్ద ఏప్రిల్ 22, 2011

  ఈ మాట ప్యారిస్ విన్టె సిగ్గుతొటి చచ్చిపోతుంది

 4. pradeep
  10:50 సా. వద్ద ఏప్రిల్ 25, 2011

  తెనాలి ని ఆంధ్ర పారిస్ అని ఎందుకు అంటారు అంటె అంత అందము గా ఉంటుంది అని కాదు………….
  పారిస్ లొ మూడు నదులు పక్క పక్కన ప్రవహిస్టాయి…….తెనాలి లొ కూడ మూడు కాలువలు పక్క పక్కన ప్రవహిస్తాయి అందుకు అని తెనాలి ని ఆంధ్ర పారిస్ అని పిలుస్తారు…..

 5. 11:44 సా. వద్ద ఏప్రిల్ 25, 2011

  ప్రదీప్ గారు ఈ విషయం నేనెరగను. బాగుంది.

 6. 12:04 ఉద. వద్ద మే 16, 2011

  nice to read

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s