ముంగిలి > జిడ్డు ప్రశ్నలు, పిచ్చాపాటి > ఇలా ఎందుకు జరుగుతుంది? – ప్రేమ, ప్రేమికులు – హత్యలు, ఆత్మహత్యలు

ఇలా ఎందుకు జరుగుతుంది? – ప్రేమ, ప్రేమికులు – హత్యలు, ఆత్మహత్యలు

నిన్నటి వార్తా పత్రికలో ఒక వార్త చదివి కాస్తంత ఉలిక్కిపడ్డాను! క్లుప్తంగా వార్త ఏంటంటే, ఒక పోలీస్ స్టేషన్ లో ఒక మగ కాన్స్టెబుల్ ఒక ఆడ కాన్స్టెబుల్ ని తుపాకితో కాల్చి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడట. మొదట చనువుగా ఉండి తరువాత వేరొకరితో నిశ్చితార్ధం జరగడంతో కోపంలో ఒకే స్టేషన్ లో ఒకే షిఫ్టులో పనిచేస్తున్నప్పుడు అతను ఈ విపరీత చర్యకు పాల్పడ్డాడట. ఇది వార్తా పత్రికలో వచ్చింది కాబట్టి పూర్తిగా నమ్మలేమనుకోండి; కాకపోతే కాస్తో కూస్తో నిజం ఉండే ఉంటుంది.

చదవగానే “ఆహా! ఈ రోజుకు ఎంతటి దిక్కుమాలిన శుభారంభం!” అని వద్దనుకుంటూ పొద్దున్నే వార్తా పత్రికలు చదివే అలావాటుని ఎప్పటిలాగే కాసేపు తిట్టుకొని నా దినచర్యలకు ఉపక్రమించాను. కొన్ని కొన్ని దుర్వ్యసనాలు (అదే పొద్దున్నే వార్తా పత్రికలు చదువడం వంటివి) హానికరమైనా, అలవాటుపట్టం వల్ల, వదిలించుకోలేకపోతుంటాము.

ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నా, “పోలీసు సిబ్బంది” అదీ ఒక “పోలీస్ స్టేషన్ లో” అనే విషయం చాలా వింతగా తోచింది. పోలీసులు కూడా మనుషులే కదా అంటారేమో. ఇలాంటివి, వీటి కన్నా స్వల్పమైనవి, ఇలాంటి సంఘటనలను తలతన్నేవి ఎన్నో పోలీసులు తరచూ దగ్గిరగా పరిశీలిస్తుంటారు. కాబట్టి ఇటువంటి సంఘఠనల మీద పోలీసులకు మామూలు ప్రజానికానికన్నా అవగాహన ఎక్కువని నా ఉద్దేశ్యం.

ఇలా తనని కాదన్నందుకు హత్య చేయడం, ఆసిడ్ పోయడం వంటి సంఘఠనలకు తరచూ ఫలించని ప్రేమ కారణమని రాస్తుంటారు. నిజానికి మూల కారణం “ప్రేమ” అయి ఉంటుందా?

సర్వసాధారణంగా భగ్న ప్రేమికుడైన మగాడే ఇటువంటి విపరీత చర్యలకు పాల్పడుతుండడం మరో విశేషం. ఓ ఆడది ప్రేమలో విఫలమైనందుకు తన (సో కాల్డ్) ప్రియుడి మీద ఆసిడ్ పోయడం లేక చంపడం వంటి వార్తలు చాలా చాలా అరుదనుకుంటాను.

“నేను నిన్ను ఇష్ట పడట్లేదు” అన్నా లేక మొదట్లో ఇష్ట పడ్డా ఎవో కారణాలకు మనసు మార్చుకొని “నువ్వు నాకు వద్దు” అన్న ప్రేయసి లేక ప్రియుడి వెంటబడ్డం ఏమి ఖర్మమో. అరటిపండు తొక్కంత తేలిక కాకపోయినా, వద్దు అంటుంటే వెంట బడి వేధించడం  ఓ పట్టాన అర్థమై చావదు.  వద్దన్న మనిషితో జీవితం ఎలా పంచుకోగలమనుకుంటారో? తెమలకపోతే హత్య – ఆత్మ హత్య.

తరచుగా మరో చిత్రమైన పదమొకటి వినిపిస్తుంటుంది. “లవర్స్” అని. విన్నప్పుడల్లా నాలో నేనే నవ్వుకుంటుంటాను. “డ్రైవర్స్”, “ఆక్టర్స్”, “లాయర్స్” లాగా “లవర్స్” వాడుతుండడం ఎందుకో కొంచేం చిత్రంగా అనిపిస్తుంటుంది. దీని అర్థం “లవ్” చేసుకుంటుండడం అన్నమాట. మరో ఛమక్కేంటంటే “లవర్స్” కితాబు ఇరుపక్షాల అవగాహనతో పనిలేకుండా వాడుకోవచ్చు. “ఓరి నాయనో నన్ను వేధించకురా మొర్రో” అంటున్నా “నా లవర్” అంటూ వెంట బడవచ్చు. బై డెఫినిషన్ తప్పేం లేదన్నమాట.

ఈ జాడ్యాలన్నీ “ప్రేమ”, “లవ్”, “లవర్స్” అయితే, ఓ భార్యకు భర్త మీద, ఓక భర్తకు భార్య మీద, తల్లి తండ్రులకు సంతానం మీద, సంతానానికి తల్లిదండ్రులమీద, ముదుసలివాళ్ళకు మనవళ్ళమీద, క్షమా గుణమున్న ప్రియుడికి ప్రేయసి మీద, అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళ మద్యనున్న భావనలను ఏమని పిలవాలి?

ప్రకటనలు
 1. kittu
  5:50 సా. వద్ద మే 12, 2011

  [ Moderated: Transliteration errors adjusted ]
  ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏమిటంటే లవ్ చేయడానికి ఎవరూ అడ్డు రారు, ఎంజాయ్ చేయడానికి ఎవరూ అడ్డురారు (తల్లి తండ్రులకు తెలిస్తే తప్ప). కానీ పెళ్ళి చేసుకోవాలంటే అందరూ అడ్డుగానే ఉంటారు. దానికి రకరకాల కారణాలు. ఒక్కోసారి అబ్బాయి సీరియస్ గా లవ్ చేస్తాడు; అమ్మాయి ఈజీగా తీసుకుంటుంది. లేకపోతే అమ్మాయి సీరియస్ గా లవ్ చేస్తుంది అబ్బాయి ఈజీగా తీసుకుంటాడు. వాళ్ళు ఇద్దరూ ఎంజాయ్మెంట్ కోసమే లవ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం లేదు. లేకపోతే వాళ్ళు ఇద్దరూ సింసియర్ గా లవ్ చేసుకున్నా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉండదు (అఫ్ కోర్స్ మిగిలిన ప్రాబ్లంస్ ఉంటే ఉండవచ్చు). అబ్బాయి సిన్సియర్. అతడు తన డబ్బు, టైమ్, కరీర్ అమ్మాయి కోసం ఇన్వెష్ట్ చేస్తాడు. వదులుకుంటున్న అమ్మాయి సింపుల్ గా టాటా చెప్పి వెళ్ళిపోతుంది. లేదా అమ్మాయి సిన్సియర్ గా లవ్ చేసి ??? లేకుండా ??? చేసి వచ్చిన సంబందాలు వొదులుకుంటుంది. అబ్బాయి టాటా చెప్పి వెళ్ళిపోతాడు.

  సొల్యూషన్ ఏమిటంటే వాళ్ళు ఆనందం కోసం లవ్ చేసుకుంటూన్నారా లేకపోతే జీవితాంతం కలిసి ఉండటానికి లవ్ చేసుకుంటున్నారా అనేది స్పష్టంగా నిర్ణయించుకోవాలి. అప్పుడే ఇలాంటివి ఆగుతాయి.

  [ Original comment follows ]
  ఇక్కడ వచ్చిన ప్రొబ్లెం ఎమితంతె లొవె చెయ్యదనికి ఎవరు అద్దురరు ఎంజొయ్ చెయ్యదనికి ఎవరు అద్దురరు (తల్లి తంద్రులకు తెలిస్తె తప్ప) కాని పెళ్ళి చెసుకొవలంతె అందరు అద్దుగనె ఉంతరు దనికి రకరకల కరనలు ఉంతై.ఇక్కద ఒక్కొసరి అబ్బాయి సెరిఔస్ గ లొవె చెస్తదు అమ్మయి ఈజీ గ తిసుకుంతుంది లెకపొతె అమ్మయి సెరిఔస్ గ లొవె చెస్తుంది అబ్బాయి ఈజీ గ తిసుకుంతదు.వల్లు ఇద్దరు ఎంజొయ్మెంత్ కొసమె లొవె చెసుకుంతె ఈ ప్రబ్లెం లెదు లెకపొథె వల్లు ఇద్దరు సించెరె గ లొవె చెసుకున్న ఈ త్య్పె ఒఫ్ ప్రొబ్లెం ఉందదు (ఒఫ్చౌర్సె మిగిలిన ప్రొబ్లెంస్ ఉంతె ఉందవచు).అబ్బయి సించెరె అతదు తన దబ్బు తిమె చరీర్ అమ్మయి కొసం ఇన్వెస్త్ చెస్తదు వదులుకుంతదు అమ్మయి సింప్లె గ టట చెప్పి వెల్లిపొతుంది లెద అమ్మయి సించెరె గ లొవె చెసి చందొం లెకుంద సెక్ష్ చెసి వచిన సంబందలు వదులుకుంతుంది అబ్బయి టట చెప్పి వెల్లిపొతదు.
  సొల్యూషన్ ఎమిటంటే వల్లు అనదం కొసం లొవె చెసుకుంతున్నర లెకపొతె జీవితంతం కలిసి ఉందతనికి లొవె చెసుకుంతున్నర అనెది స్పస్తంగ నిర్నయించుకొవలి అప్పుదె ఎలంతివి అగుతై.

 2. prabandh
  1:58 సా. వద్ద మే 13, 2011

  మీరు రాసింది చదివాకా..ఇంతకు మునుపు ఎక్కడో చదివింది గుర్తోచ్చిన్దండి..A అనే పర్సన్ B అనే పర్సన్ ని ప్రేమిస్తే..B అనే పర్సన్ A కి లవ్ అవుద్ది…B అనే పర్సన్ కి A లవర్ అవుతాడు…మీరు రాసిన దానికి ఇది అసంధర్బ వ్యాక్య ఏమో కానీ..మీరు రాసిన ”ఓరి నాయనో నన్ను వేధించకురా మొర్రో” అంటున్నా “నా లవర్” అంటూ వెంట బడవచ్చు.” వాక్యం చదివాక గుర్తొచ్చింది…అంటే అప్పుడు నా లవర్ అని కాకుండా నా లవ్ అని అనాలి అని.

 3. Rajasekhar Dasari
  1:11 సా. వద్ద ఆగస్ట్ 23, 2011

  ప్రభందు గారు ప్రేమకు grammar ఉండదు glamour
  మాత్రమే ఉంటుంది

 4. visali
  6:31 సా. వద్ద డిసెంబర్ 26, 2011

  ఏవడో పుట్టినరోజుని ప్రేమికులరోజుగా గుర్తించేసీ, ఏవరో తెలియని అమ్మాయికి ఒక గులాబి పువ్వు పట్టుకొని ప్రేమ చెప్పడం అదీ నాలుగు ముక్కల్లో… ఇంక అమ్మాయి తిరస్కరిస్తే అప్పుడు వెనకపడి విసిగించడం, రెండు గంటల సినిమాలలో అయితే ఇలాంటివి బాగుంటాయి.. కానీ నిజ జీవితానికి వస్తే ఇలాంటివి పరవాన్నంలో రాయిలా తగులుతాయి. పెద్ద వాళ్ళకు పిల్లల్ని కాలేజికి పంపాలంటే ఎంత భయంగా ఉంటుందో…

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s