ముంగిలి > సరదాగా > తామర పువ్వు

తామర పువ్వు

గత కొన్ని నెలలుగా, విపరీతమైన పని వత్తిడి, ప్రయాణాల కారణంగా టపాలు వ్రాయడం కుదరలేదు.

తామరపువ్వు అనగానే ఏదో ఒక భావుకతతో నిండిన టపా అనుకునేరు! నేను చేసిన ఒక చిన్ని ప్రయత్నం ఫలించి ఎంతో కాలం తరువాత “సరదాగా ఎదో సాధించాను” అనే భావన కలిగించిన విషయాన్ని గూర్చి ఓ రెండు ముక్కలు పంచుకునే ప్రయత్నం.

గత ఏడాది వినాయక చవితి; దానికి ముందు కూడా ఎన్నో పర్వదినాల సందర్భంగా దైవతార్చన కొరకు పద్మాలను, తామరపూలను కొని తెచ్చేవాడిని. కానీ అవి కొన్న తరువాత నిండుగా విరబూయడం ఎప్పుడూ చూడలేదు. గత్యంతరం లేక అలాగే మొగ్గగానో, లేక బలవంతంగా రెక్కలను తెరిచో దేవుడికి సమర్పించేవాడిని. ఈ రెండు పద్దత్తులు పెద్దగా నచ్చేవి కావు. అలాంటి సందర్భాలలో ఇంట్లోనే ఒక తామర కొలను ఉంటే ఎంత బాగుండేదో అనిపించేది. ఓ గులాబీ మొక్కో లేక మల్లేతీవో అంటే పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు కానీ తామర కొలను అంటే కాస్తో కూస్తో కష్టపడాలి. మొత్తానికి ఏదో ఒకటి చేసి సాధించానండోయ్. కింద జత పరచిన చిత్రం అలా పుష్పీంచిన మొదటి తామరది. ఎంత బాగుంది కదా? మహదానందం కలిగిందంటే నమ్మండి! చక్కగా శ్రావణ మాసంలో మొదటి దర్శనం. పక్కనే ఇంకో మొగ్గ కూడా పైకి రావడానికి సిద్దంగా ఉంది.

తామర పువ్వు

తామర పువ్వు

సరే దీన్ని ఎలా పెంచానా అనుకుంటున్నారా? వివరాలలోకెళీతే, ఓ రెండు నెల్ల క్రితం ఏదో సందర్భంగా కేరళకు వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు తెలిసిన వాళ్ళింట్లో ఈ పూలను చూసి నా కోరిక గుర్తోచ్చింది. కానీ వారిదో వ్యవసాయ సంబందం ఉన్న కుటుంబం; పై పెచ్చు అదో గ్రామం కాబట్టి వారికి కావలసినంత స్థలం. మరి నా పరిస్థితో? భాగ్యనగరం. ఫ్లాట్ కాకపోయినా, వారికున్నంత స్థంలం ఎక్కడుంటుంది? కానీ ధైర్యం చేశా!

వారి వద్ద నుండి ఓ మూడు బీజాలను ఓ నీళ్ళ బాటిల్ లో పెట్టి హైదరాబాదుకు పట్టుకొచ్చాను. వెంటనే, ఓ చిన్ని (మహా అంటే రెండు లీటర్ల నీరు పట్టేంత) గాజు పాత్రలో వాటికి చిన్ని చిన్ని రాళ్ళను కట్టి అంగుళం మేర మట్టి వేసి, దానిపై ఉంచి నీళ్ళు పోసి నిరీక్షించడం మొదలు పెట్టా. రాళ్ళు కట్టకపోతే అవి నీటిపై తేలుతాయి. చివరికి ఆ మూడిట్లో రెండు కుళ్ళి పోయాయి. కానీ ఒకటి మాత్రం మెల్లిగా పెరగడం మొదలు పెట్టింది. అలా ఓక మాసం గడిచాక, ఓ మోస్తరు అక్వేరియం కొనుకొచ్చాను. దానిలో ఓ పది సెంటీమీటర్ల మేర మట్టి పోసి, జాగ్రత్తగా ఆ పెరిగిన మొక్కను ఆ మట్టిలో నాటి, ఇంకా జాగ్రత్తగా నీటిని పోశాను. అలా మొక్క పెరుగుతున్నా కొద్ది, నీటి స్థాయిని పెంచుకుంటూ పొయాను. ఇప్పుడో అడుగున్నర మేర నీటి స్థాయి ఉండవచ్చు. ఇక ఆ మొక్క విజ్రుంభించిందనుకోండి! వారానికో రెండు కొత్త ఆకుల చోప్పున ఇప్పుడో ఇరవై ఆకులదాక వచ్చాయి. ఉన్నట్టుండి ఓ వారం క్రితం ఓ మొగ్గ కనిపించింది. తరువాత ఓ మూడు రోజుల్లో అది పుష్పించింది.

తామర కొలను

తామర కొలను

మొత్తం వ్యవహారనికి ఓ రెండున్నర నెలలు పట్టింది. కాకపోతే కొన్ని తంటాలు కూడా ఉన్నాయి. మొదటిది దోమల బెడద. రెండవది నిల్వ ఉండడం వల్ల నీరు పాచి వాసన రావడం. ఈ రెంటికీ సమాధానం చేపలు. ఓ జత చేపల్ని కొని తెచ్చి విడిచాను. కానీ ఓ రెండు వారాల తరువాత అవి చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మొక్క పెద్దదవడం వల్ల, ఆ రెండు తలనొప్పులు అంతగా లేవనుకోండి.

ప్రకటనలు
వర్గాలుసరదాగా ట్యాగులు:
 1. Srikalyan
  4:06 సా. వద్ద ఆగస్ట్ 10, 2011

  The close-up picture of the Lotus is very beautiful and mesmirizing. It is actually very de-stressing.

 2. tgnanaprasuna
  6:21 సా. వద్ద ఆగస్ట్ 10, 2011

  neela kamalam chaalaa andamgaa vundi. meekrushi phalinchindi. kotta prayogam chesaaru opikagaa ika andaru prayatnicha vachchu.
  gnana prasuna

 3. 9:57 సా. వద్ద ఆగస్ట్ 10, 2011

  చాలా బాగుంది మీ కృషికి తగ్గ ఫలితం దక్కిందనమాట మొత్తానికి!!! చేయాలన్న ఆలోచన, తపన ఉంటే ఏదయినా సాధించచ్చు అని మరో సారి నిరూపించారు.

 4. gayathri
  9:32 సా. వద్ద ఆగస్ట్ 20, 2011

  chaala bagundi me tamara kolanu…

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s