ముంగిలి > శిరోభారం > మనం నిజంగా మారగలమా?

మనం నిజంగా మారగలమా?

రాత్రి 10:04 గంటలకు నాకో SMS వచ్చింది. ఎవరో తెలియని వ్యక్తి పంపించారు. నేను “జన్ లోక్పాల్ బిల్లు”ని కనుక సమర్థించినట్లయితే ఒక నంబరుకు missed call ఇవ్వమని దాని సందేశం. Internet లో వెతికినప్పుడు దాని గురించి ఒక వార్త దొరికింది. ఇప్పటి వరకు రెండున్నర లక్షల missed calls వచ్చాయని దానిలో ప్రచురించబడింది. T.V. పెడితిని కదా, వార్తా ఛానళ్ళ సందడే సందడి.

ఇప్పటి పరిణామం, అన్నా హజారేను ప్రభుత్వం తీహార్ నుండి విడుదల చేసిందని, కానీ ఆయన తనకు J.P. పార్కులో నిరాహార దిక్ష జరుపుకోడానికి ప్రభుత్వం బేషరతుగా ఒప్పుకుంటే తప్ప తాను జైలు నుండి బయటకు రానని చెప్పారని తన ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఇక T.Vలో ఒకటే ఊకదంపుడు. ఇది రెండో స్వాతంత్ర్య సమర యుద్ధమని ఒకరంటే, భారతీయ జనతా పార్టీ వారు, ఇదో పనికిమాలిన ప్రభుత్వం అని దొరికిందే అదునుగా ఎంత air time దండుకోవచ్చో అంత దండుకుంటున్నారు. వీరికి-వారికి మధ్యన తగాదాలు పెట్టడంలో సిద్ధహస్తం ఉన్న మీడియా సంగతి చెప్పాలా?

ఈ బాగోతం చూస్తుంటే, ఒక ప్రశ్న బుర్రలో తెగ తిరుగుతోంది. అసలు corruption అంటే ఏమిటి? అవినీతి, లంచగొండితనం, అధికార దుర్విన్యోగం వగైరా వగైరా తర్జుమాలు కాదు. అసలు దేని కోసం జనాలు ఆవేదన పడుతున్నట్టు కనిపిస్తున్నారో, ఆ భావం వెనుక అర్థమేమిటి?

ఒక వ్యక్తి తన పదవి వల్లో లేక తనకున్న అధికారాల పుణ్యానో లేక మరే ఇతరత్రా ప్రత్యేక పరిస్థితుల కారణంగానో తన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించడానికి అభ్యర్ధిస్తున్న వ్యక్తి లేదా సంస్థ నుండి అనుచితంగా ఫలాపేక్షను ఆశించడం ఒక అర్థం. అలాగే, తన కర్తవ్యాన్ని ఏదో ఒక లాభం చేకూర్చిన వ్యక్తికో లేక సంస్థకో అనుకూలంగా నిర్వర్తించడం లేక ఆ లాభాన్ని చేకూర్చిన వ్యక్తి ఇష్టంమేర మరొకరికి ప్రతికూలంగా పనిచేయడం మరో నిర్వచనం. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ దీని సారాంశం ఏదో ఒక లాభం కారణంగా తన పనిని ఆ లాభం చేకూర్చిన వ్యక్తికి తగ్గట్టుగా చేయడం. దీనిలో బహుశః అన్నీ ఇమడుతాయి. ఈ సమీకరణానికి లాభాపేక్ష ఎడమవైపుంటే, దాన్ని వాడుకునేవాడు ఇవతలవైపున్నట్టు. సమీకరణ స్థిరత్వానికి రెండు పాత్రలు కీలకమే!

నేరం నాదికాదు ఆకలిది అనే చిత్రంలో ఒక పాట…”మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా…మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి…ఏ దోషం లేని వాడు యెవడో చూపండి…

బ్రేక్ తరువాత మళ్ళీ నా ఊకదంపుడుకొద్దాం.

మరో స్వాతంత్ర్య సమర యుద్ధం. O.K…అలాగే! నేను రాస్తున్నది మరో మహాభారతం అంటే మీకేమన్నా అభ్యంతరమా! వాక్స్వాతంత్ర్యమమ్మా!

కానీ మహాత్ముడు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని అసలు తన సర్వస్వాన్ని ఫణంగా పెట్టి పోరాడింది ఈ దేశాన్ని కొల్లగొట్టి తమ దేశానికి చేరవేస్తున్న విదేశీయుల మిద. మరి ఇప్పుడో? ఎవరో పరదేశియులు లేరే?

మన పోలీసులు పాకిస్తాన్ నుంచి వచ్చారా లేక మన రాజకీయ నాయకులు అమెరికానుండి ఊడిపడ్డారా?

కొల్లగొడుతున్నారు కాదనను, కాని దేనికి? తిరిగి పదవి వస్తుందో రాదో తెలియదు కానీ ప్రయత్నించాలి. అలా ప్రయత్నించాలంటే మొట్ట మొదట ప్రజల్నే తృప్తి పరచాలి. ఎక్కడి నుండి వస్తుందా “తృప్తి పరిచే” సామర్థ్యం? ఒకడి గుణగణాలను లెక్కిస్తామా లేక వాడి ప్రజాసేవ తత్పరతో మనకేమన్నా పనుందా? వాడు నా కులం వాడా, మతం వాడా? వీడెంతిస్తానన్నాడు, వాడెంతిస్తానన్నాడు? బిర్యానీ పొట్లమేనా లేక దానితో పాటు మందు కూడా దొరుకుతుందా? ఏదో “లోక్ సత్తా” అనే పార్టీ పేరు ఎప్పుడో విన్నట్టుంది. ఎంత మంది అభ్యర్ధులు గెలిచారు?

వచ్చే ఎన్నికల్లో కేద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పదవిలోకి రావటం కష్టమే. ఇది నేను కాదు పీ.చిదంబరం గారినడిగినా అలాగే చెబుతారు. అటువంటిది వారు అన్నా హజారే శిబిరం కోరిన విధంగా జన్ లోక్పాల్ బిల్లుని ఎందుకు ఆమోదించడంలేదు?

మంకు పట్టు పట్టి, ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితులను కల్పించడం చాలా తేలిక. కులానికో, మతానికో, బిర్యానీ పొట్లానికో ఆశ పడి ఏదోలాగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము. పార్లమెంట్ అనే వ్యవస్థను రాజ్యాంగబద్ధంగా నిలబెట్టాము. లేదు ఇవేవీ కుదరవు మేముకోరుకున్నట్లు “జన్ లోక్పాల్” కు ఎదురు లేని అధికారం కట్టబెట్టి అందరూ దాని చెప్పుచేతల్లో నడవాలి అనడం అసలు సాధ్యమేనా? ఆ “జన్ లోక్పాల్”నే అవినీతి ఆవహిస్తే? అప్పుడు మరో స్వాతంత్ర్య సమరయుద్ధం చేద్దామా? సైన్యం, న్యాయ వ్యవస్థ, చివరికి అవినీతి నిరోధక శాఖలు కూడా కరప్షన్ ఉచ్చులో చిక్కుకున్న వార్తలు లేవా? మౌలికంగా మనలో ఇంచుమించుగా ప్రతి వ్యక్తి పక్కవాడిని తొక్కైనా పైకిరావాలని ప్రయత్నించే మనస్తత్వం గలవాడే. దొరికిన ప్రతి అవకాశాన్ని ఎదోరకంగా వాడుకోవాలనుకునేవాడే.  

గత రెండేళ్ళలో మసిపూసి మారేడుకాయ చేసి దేశానికి ఎంతో అపకీర్తిని ఆపాదించి పెట్టుకున్నాం. విదేశీయులు ముఖంమీదే “కరప్ట్ ఇండియా” అన్నప్పుడు చెప్పుకోలేని బాధను పొందుతున్నాం. తెమలడానికి వీలుకాని పరిస్థితులను సృష్టించి గోరుచుట్టుపై రోకటిపోటు మోదుకుంటున్నాం. ఎవరి కుటుంబ సమస్యలను వారు గోప్యంగా పరిష్కరించుకోవాలి. ఇలా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలానా?

మీ అంతరాత్మను అడగండి…మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి…ఏ దోషం లేని వాడు యెవడో చూపండి

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
 1. 1:39 ఉద. వద్ద ఆగస్ట్ 17, 2011

  మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి…ఏ దోషం లేని వాడు యెవడో చూపండి…
  —————

  Well Said ..

 2. అబ్రకదబ్ర
  2:03 ఉద. వద్ద ఆగస్ట్ 17, 2011

  మొన్నామధ్యదాకా చిరిగిన జీన్స్ తొడుక్కుని చెదిరిన క్రాఫుతో తిరగటం యువత ఫ్యాషన్. అన్నా హజారే ముఖం ముద్రించిన టీ షర్టులేసుకుని చేతిలో కొవ్వొత్తితో ర్యాలీలు చెయ్యటం ప్రస్తుతం ఫ్యాషన్. ఇలాంటి సీజనల్ ఉద్యమాలతో ఒరిగేదేమీ లేదు.

  అన్నా పని అన్నాని చేయనిచ్చి మన పని మనం కూడా చెయ్యాలి. ఆయనకి జేజేలు కొడితే అవినీతి అంతర్ధానమైపోతుందనుకుంటే వెర్రితనమే అవుతుంది. అవినీతిని అట్నుండే కాదు, ఇట్నుండి కూడా నరుక్కు రావాలి. మనలాంటి మామూలు జనాల్లో మార్పు రానంత కాలమూ పైస్థాయిలో మార్పు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా.

 3. 8:16 సా. వద్ద ఆగస్ట్ 17, 2011

  adi nijame kaani ilage udileste sarvanasaname kada maarpu anedi rendu vaipulanunchi jaragali anna poradutunnaru evarikosam manakosam manam kooda poradali evarikosam manakosam

  inka ideal world anedi eppatiki sadyam kaadu kaani unnantalo avineeti rahita samajam kaavalante appudappudu ilanti poratalu kaavalsinde

 4. 5:13 సా. వద్ద ఆగస్ట్ 22, 2011

  నిజానికి లంచ గొంది తనము అంత వేగిరమే పోఎది కాదు. ముందు ప్రజలలో మార్పు రావాలి. ఒక ౧౦ రోజులలో చట్టం చేసయాలి అంటే జరిగేది కాదు.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s