ముంగిలి > పిచ్చాపాటి, శిరోభారం > అందం అనే అర్హత కేవలం ఆడవారికేనా?

అందం అనే అర్హత కేవలం ఆడవారికేనా?

సెప్టెంబర్ 4, 2011 వ్యాఖ్యానించండి Go to comments

అందమనండి లేదా చూడచక్కనితనం అనండి. సినీ పరిశ్రమలో ఈ కోలమానం కథానాయికలకే ఎందుకు వర్తిస్తుంది? ఏఁ? కథానాయకుడు చూడటానికి కనీసం అందంగా లేకపోయినా అంద వికారంగా ఉండకూడదనే నియమం కూడా లేదేఁ? నిన్నటి కథానాయకుడి కొడుకో లేక ఏదో ఒక వెంట్రుక అయినంత మాత్రాన జనాల మీద బలవంతంగా రుద్దడమే?

“అంత భరించలేకపోతే సినిమాలు చూడ్డం మానేయొచ్చుగా?” అంటారేమో! ఎంత మంచి రివ్యూ వచ్చినా నా కనీస కోలమానాలకు తగ్గట్టుగా ఉండని కథానాయకులు ఉన్న చిత్రాలు టీ.వీ.లో వచ్చినా చూడను. మరి నా గింజుకోవడం దేనికంటారా? అలా రోడ్డెక్కుతామో లేదో; ఎటు చూస్తే అటు దిక్కుమాలిన పోస్టర్లే కదా! అరిగిపోయిన పెన్సిల్ తో పిచ్చ బరుకుడు బరికినట్టున్న మొహాలతో.

తొందర పడి “అందం” గురించి నాకున్న అభిప్రాయంగురించి మీరే అభిప్రాయానికి రాకండి. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యమే గొప్పది అని నేను మనఃపూర్తిగా విశ్వసిస్తాను. కానీ వెండితెర విషయం ఈ కోవలోకి రాదు. చరిత్రను సృష్టించకపోయినా చరిత్రను చిత్రీకరించి సాధారణ ప్రజలలో ఆ చిత్రించిన పాత్రలకు ఒక అర్థాన్ని ఏర్పరుస్తారు. ఇప్పుడు లేక రాబోయే కాలంలో ఏ సామాన్యుణ్ణడిగినా, అన్నమయ అంటే మీసాలతో ఉన్నట్టుగానే భావిస్తాడు. అది సినిమాకున్న పవర్! భీముడంటే మీసాలు లేని వాడిగా ఊహిస్తారు. ఇది మాస్ మీడియాకున్న శక్తి. మీసం లేని భీముడు, మీసమున్న వాగ్గేయకారుడు. వాహ్!

ఒకప్పుడు ఇప్పుడున్నంత సినీ అవగాహన లేకపోయినా, ఏ మాటకామాటే చెప్పుకోవాలి; మొదటి తరం కథానాయకులయిన ఎన్టీఓరు, ఏఎన్నారు, కృష్ణ, శోభన్ బాబు లాంటి వారు నిఖచ్ఛితంగా అందగాళ్ళు. పాత్ర కోసం వారి ఇమేజ్ ని ఏ మాత్రం పట్టిచ్చుకునే వారు కాదు. ఏ వేషం వేసినా వారి అందానికే డోకా ఉండేది కాదు. వారి తరువాతి తరం అంత కాకపోయినా ఏదో సర్దుకోవచ్చు. కానీ మెట్టు దించారు. పాత్రకనుగూణంగా వేష ధారణని మారిస్తే, తమ అందవికారం ఎక్కడ బయటపడుతుందోనని పాత్రలను తమ ఇమేజ్ కి అనుగూణంగా మార్చడం మొదలయింది. ఇక ముందు ముందు పాత్రలనే తలక్రిందులుగా చిత్రీకరిస్తారేమో. “సిక్స్ ప్యాక్ తో నూనే పూసుకొని, బట్టలను ఎంతో పొదుపుగా వాడే సుందరి బొడ్డులో మురళిని అసహ్యంగా గుచ్చుతున్న – మీసాలు చీపిరి గెడ్డంతో అందవికారుడైన” కృష్ణుడి దర్శనం చేయించినా ఆశ్చర్యం లేదు. 

రాజకీయ “పరిశ్రమ” లాగా ఈ సినీ పరిశ్రమలో కూడా కుటుంబాలదే హవా అనుకుంటా! కూతురు పుడితే కనీసం వాళ్ళ మొహాలెలా ఉంటాయో కూడా తెలీనీకుండా ప్రజా దృష్టికి దూరంగా ఎంతో భద్రంగా పెంచి జాగ్రత్త పడతారు. దూదేకుల ముఖ కవళికలతో పుట్టినా, మగపిల్లల్ని మాత్రం మన్నెత్తిన రుద్దడం.

తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్టు గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులు ఏదో భరిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు తెరకెక్కుతున్న రెండు-మూడో తరాలు మరీ ఒక మాదిరిగా లేరు? ప్లాస్టిక్ సర్జేరీలకు కూడా అందనంత ఎత్తున!

ఇక్కడి తెలుగమ్మాయిలు సరిపోనట్టు వేరే రాష్ట్రాల నుంచి మాత్రం అందమైన భామలు కావాలి. కాకి ముక్కుకు దొండపండులాగా. ఇది మరీ హైట్స్. ఏమో…బహుశః ఇక్కడి తెలుగమ్మాయిలు “ఛీ…నీ మొహఁవీడ్చ” అంటే దిక్కులేక పొరుగు రాష్ట్రాకెళుతున్నారో ఎమో!

సరే జరింగిందే జరిగిపోయింది. చరిత్రను తిరిగి వ్రాయలేము కదా! సర్దుకుపోవడమే మన అలవాటు కాబట్టి, ఇక ముందు ఇలాంటి దిక్కుమాలిన పరిణామాలు తలెత్తకుండా జాగ్రత్త పడదాం. మనమందరమూ ఇకనుండి ఎవరన్నా సినీ పరిశ్రమతో సంబందం ఉన్న పలుకుబడున్న వ్యక్తి చేసుకోబోయే పెళ్ళికూతురు కనక అందంగా లేకపోతే, ఏక కంఠంతో ఖండిద్దాం. నిరసన తెలియజేద్దాం. ఎందుకంటే, కనీసం వాళ్లకు పుట్టబోయే పిల్లలు అందంగా ఉంటే, రాబోయే తరాలన్నా కాస్త ఊపిరి పీల్చుకుంటాయి కదా.

మళ్ళీ తండ్రి పోలికలే వస్తే? తూర్పు తిరిగి దండం పెడదాం. ఇంకేం చేస్తాం?

ప్రకటనలు
 1. 6:41 ఉద. వద్ద సెప్టెంబర్ 5, 2011

  😀

 2. lakshmi
  4:18 ఉద. వద్ద నవంబర్ 11, 2011

  antha bagundi kaani..madyalo dudekula mukhalentandi? daaniki edaina ardham unda…

  • 8:44 ఉద. వద్ద నవంబర్ 11, 2011

   భలేవారే! పేర్లు ఎత్తడం ఇష్టంలేదులేదు కానీ ఒకరిద్దరి ఉదాహరణ ఇస్తే, ఇంకా దారుణంగా కామేంట్లు వస్తాయి…

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s