ముంగిలి > ఆధ్యాత్మికం, తెలుగు వెలుగులు > శ్రీరామ శతకం – జీవన తత్వాలు / Śrīrāma Śatakaṃ – Jīvana Tatvālu

శ్రీరామ శతకం – జీవన తత్వాలు / Śrīrāma Śatakaṃ – Jīvana Tatvālu

శ్రీరామ శతకం - జీవన తత్వాలు / Śrīrāma Śatakaṃ - Jīvana Tatvālu

శ్రీరామ శతకం - జీవన తత్వాలు / Śrīrāma Śatakaṃ - Jīvana Tatvālu

నాకు పరిచయస్తులలో ఒకరి తండ్రిగారైన శ్రీ పంపాన ధవళేశ్వర్ గారు, పదవీ విరమణ చేసిన తదుపరి, గత కొంత కాలముగా రచించిన పద్యాలను శ్రీరామ శతకం (జీవన తత్వాలు) అనే పుస్తకరూపంలో ప్రచురించారు. నాకు ఒక ప్రతిని అందించారు. కౢప్తంగా ఆ పుస్తక విశేషాలు కొన్ని ఈ టపాలో పొందు పరుస్తున్నాను. ఆసక్తి గలవారు క్రింద జతపరచిన ఫోనునెంబరును సంప్రదించి ప్రతులను పొందగలరని ఆసిస్తు…

రచయిత గారి మాటలలో…

నేను పదవీ విరమణ చేసిన తదుపరి, తెలుగు భాషా సరస్వతిని సేవించుకునే ప్రక్రియలో, ఏదో వ్రాయాలన్న తపనతో, ప్రతి నిత్యం ఆలోచనలతో ఉండేవాడిని. అలా కాలం సాగుతున్న తరుణంలో ఒకనాడు నిద్రలో ఉండగా (సుమారు ఉదయం 3 నుండి 4) తెల్లవారుఝాములో…

ఏరామనామంబు మహిమచే కర్కశుండైన వాల్మీకి, మహర్షియై రామాయణ గ్రంథ రచనజేసె… అనే పదములు నా సృతి పథంలో మొదలై అలా నాలికపై పదములు మెదులుతూ ఆనాడు తెల్లవారిన సరికి, కలం తీసుకుని ఆ పదములను పుస్తకంలో వ్రాయుట జరిగినది. అదియే నా తొట్టతొలి పద్యము. అందులో శ్రీ రాముని యొక్క “రామనామము”, “రామపాదము”ల విశిష్టత తెలుపడమైనది.

అలా మొదలైన ఆప్రక్రియలో ప్రతి నిత్యం తెలతెల్లవారుఝామున ఏదో ఒక పదపద్యములయొక్క భావన నా మదిలో మెదలుట, అది నేను వెంటనే నిద్రలేచి పుస్తకములో వ్రాసి ఉంచుట, తరువాత తెల్లవారి పూజ ముగిసిన తదుపరి, ఆ పద్యములను క్రోడీకరించి, వినసొంపైన రీతిలో పద్యములను, తాత్పర్య సహితముగా వ్రాయుట జరిగినది. ఈ విధంగా దేవుని దయవలన ఈ నాటికి ౧౧౬ తాత్పర్య సహిత పద్యములుగా ” శ్రీరామశతకం”ను వ్రాయడం జరిగింది.

ఆ శతకమునుండి ఒకటి రెండు పద్యాలు…

7. ఆలు, బిడ్డలు, ఆస్తి, ఉన్నదంతయునాస్తి
ఆస్తి, ఆస్తి, అటంచు నీవు చేశావు జాస్తి, జాస్తి
ఆస్తి జాస్తి యైన – నీ శాంతి నాస్తి, నాస్తని
తెలుసుకోర జీవ – చేసుకో శ్రీరామ సేవ!
 
22. భూమినాది యన్న – భూదేవి నవ్వెను
నాది నాది యన్న – నారాయణూడునవ్వె
సిరి సంపదలు నావన్న – శ్రీదేవి నవ్వెను
నవనిధులు నావన్న – కుబేరుండు నవ్వె
ఉత్తచేతులవచ్చి – ఉత్తిగా పోయేవు
తెలుసుకోర జీవ – చేసుకో శ్రీరామ సేవ!
 
30. తనకు తెలిసినదియే – సర్వస్వమనుచు
నమ్మబలుకువారి -దరిచేరవలదు
ఎంత తెలిసినగాని – అది కొంచమేననుచూ
ఒదిగి ఉండుట మేలు – ఎంత ఎదిగిన గాని
సర్వమును తెలిసేది – ఒక్క సర్వేశ్వరునకేను
తెలుసుకోర జీవ – చేసుకో శ్రీరామ సేవ!
ప్రచురణ సంవత్సరం: 2011
వెల: అమూల్యం
ప్రతులకు: శ్రీ పంపాన ధవళేశ్వర్
ఫోన్: 98858.65283

 

 

 

 


Nāku paricayastulalō ókari taṃḍrigāraina Śrī Paṃpāna Dhavaḷēśvar Gāru, padavī viramaṇa cēsina tadupari, gata kóṃta kālamugā raciṃcina padyālanu Śrīrāma Śatakaṃ (Jīvana Tatvālu) anē pustakarūpaṃlō pracuriṃcāru. Nāku óka pratini aṃdiṃcāru. Kluptaṃgā ā pustaka viśēṣālu kónni ī ṭapālō póṃdu parustunnānu. Āsakti galavāru kriṃda jataparacina phōnuneṃbarunu saṃpradiṃci pratulanu póṃdagalarani āsistu…

Racayita  gāri māṭalalō…

Nēnu padavī viramaṇa cēsina tadupari, Telugu Bhāṣā Sarasvatini sēviṃcukunē prakriyalō, ēdō vrāyālanna tapanatō, prati nityaṃ ālōcanalatō uṃḍēvāḍini. Alā kālaṃ sāgutunna taruṇaṃlō ókanāḍu nidralō uṃḍagā (sumāru udayaṃ 3 nuṃḍi 4) tellavārujhāmulō…

Ērāmanāmaṃbu mahimacē karkaśuṃḍaina Vālmīki, Maharṣiyai Rāmāyaṇa graṃtha racanajēse… anē padamulu nā sruti pathaṃlō módalai alā nālikapai padamulu medulutū ānāḍu tellavārina sariki, kalaṃ tīsukuni ā padamulanu pustakaṃlō vrāyuṭa jariginadi. Adiyē nā tóṭṭatóli padyamu. Aṃdulō Śrī Rāmuni yókka “Rāmanāmamu”, “Rāmapādamu”la viśiṣṭata telupaḍamainadi.

Alā módalaina āprakriyalō prati nityaṃ telatellavārujhāmuna ēdō óka padapadyamulayókka bhāvana nā madilō medaluṭa, adi nēnu veṃṭanē nidralēci pustakamulō vrāsi uṃcuṭa, taruvāta tellavāri pūja mugisina tadupari, ā padyamulanu krōḍīkariṃci, vinasóṃpaina rītilō padyamulanu, tātparya sahitamugā vrāyuṭa jariginadi. Ī vidhaṃgā dēvuni dayavalana ī nāṭiki 116 tātparya sahita padyamulugā ” Śrīrāmaśatakaṃ”nu vrāyaḍaṃ jarigiṃdi.

Ā śatakamunuṃḍi ókaṭi reṃḍu padyālu…

7. Ālu, biḍḍalu, āsti, unnadaṃtayunāsti
āsti, āsti, aṭaṃcu nīvu cēśāvu jāsti, jāsti
āsti jāsti yaina – nī śāṃti nāsti, nāstani
telusukōra jīva – cēsukō Śrīrāma sēva!
 
22. Bhūminādi yanna – Bhūdēvi navvenu
nādi nādi yanna – Nārāyaṇūḍunavve
siri saṃpadalu nāvanna – Śrīdēvi navvenu
navanidhulu nāvanna – Kubēruṃḍu navve
uttacētulavacci – uttigā pōyēvu
telusukōra jīva – cēsukō Śrīrāma sēva!
 
30. Tanaku telisinadiyē – sarvasvamanucu
nammabalukuvāri -daricēravaladu
eṃta telisinagāni – adi kóṃcamēnanucū
ódigi uṃḍuṭa mēlu – eṃta edigina gāni
sarvamunu telisēdi – ókka sarvēśvarunakēnu
telusukōra jīva – cēsukō Śrīrāma sēva!
Pracuraṇa Saṃvatsaraṃ: 2011
Vela: Amūlyaṃ
Pratulaku: Śrī Paṃpāna Dhavaḷēśvar,
Phōne 98858.65283
ప్రకటనలు
  1. Dhavaleswar
    7:41 సా. వద్ద అక్టోబర్ 1, 2011

    Naa Ramasataka krutini chadivi, andali vishistatalanu sahrudayamuto aakalimpu chesukoni paataka lokaniki eevidamuga teliyajesinandulaku naa krutagnyatalu.

    Dhavaleswar.
    (Ramasataka rachayetha)

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s