ముంగిలి > శిరోభారం, సరదాగా > చింపాంజీ, మనిషి ఇంకా గొర్రె

చింపాంజీ, మనిషి ఇంకా గొర్రె

మొన్నీమధ్య ఒక విశేషం ఎన్నో మాధ్యమాల ద్వారా బహు ప్రచారం పొందింది. మనిషి మరియూ చింపాంజీ డీ.ఎన.ఏ. సీక్వెన్స్ 98.5 శాతానికన్నా అధికంగా పోలిఉన్నా, వాటికన్నా మనము అధికులమెందుకయ్యామన్న రహస్యాన్ని విశ్లేషిస్తూ కొందరు శాస్త్రవేత్తలు బహుశః జంక్ డీ.ఎన.ఏ. దీనికి కారణమై ఉంటుందని అభిప్రాయ పడ్డారుట! Junk DNA Separates Humans From Chimpanzees

అలాగే ఇంకో విశేషం. టీ.టీ.డీ. చైర్మన్ గారికి  – ఉద్యోగులకు చిన్న అభిప్రాయ బేధం వచ్చిందట. ఎందుకంటారా? ఎక్కడ పడితే అక్కడ ఉమ్మితే, ఇక ఊరుకోబోమని ఆయన అన్నందుకు.

చివరిగా, మొన్న శనివారం ఏదో పనికని బయలుదేరితే ఒక ప్రభుద్ధుడి చేష్ఠితం ఒకటి నాకు మహా చిరాకు తెప్పించ్చింది.

ఈ మూడిటికి, నా టపా టైటిల్‌కి లింకేంటంటారా? లంకె ఉంది. ముందు నా అనుభవం గురించి మొదలెడతా…

శనివారం అలా బాంకు లో ఎదో పనికని నా వాహనంలో వెళుతూ ఒక కూడలి సిగ్నల్‌వద్ద ఆగినపుడు, పక్కనే ఓ ద్విచక్ర వాహనం మీద కూర్చున్న వ్యక్తి అదే పనిగా ఊస్తున్నాడు. నా ఖర్మకొద్దీ, నా వాహనమున్న వైపే తిరుగుతూ, తన పని తాను కానిస్తున్నాడు. లెక్క పెట్టలేదుకానీ, అలా ఆగిన మూడు నిమిషాల్లో ఓ పది సార్లు ఉమ్మి ఉంటాడు. అతనికి నేను కనపడనేమో కానీ అతణ్ణి సర్వాంగ సుందరంగా దర్శించే సౌలభ్యం ఉన్న ఎత్తులో తలతిప్పుకున్నా తప్పించ్చుకోలేని విధంగా నా పొజీషను. ఉండబట్టలేక దిగి ఓ నాలుగు చీవాట్లు పేడదామంటే అది అంత గొప్ప తప్పిదమేమీ కాదు. నలుగురూ నన్నే తప్పుబడతారు. ఎప్పుడు సిగ్నల్‌పడుతుందా అని నిరీక్షించిన ఆ కొన్ని క్షణాలు యుగాలుగా గోచరించాయంటే నమ్మండి! సిగ్నల్ పడి హమ్మయ్య అనుకొని మెల్లిగా బాంకుకు చేరుకున్నాన్ను. పాత కట్టడాణ్ణి బాగుచేస్తున్నందున, నా పనికై, పై అంతస్తుకెళ్ళమన్నారు. అలా మెట్లెక్కుతుంటే మరో విశేషం. హిందూ, ఇస్లామ్ ఇంకా క్రిష్టియన్ మతాల మధ్య సామరస్యతను పెంచడానికన్నట్టో, లేక ముగ్గురిని సమంగా కించపరచడానికన్నట్టో ప్రతి మెట్లసందులో ఆ మతాలకు సంబందించిన దైవస్వరూపాలున్న టైల్స్‌. ఇప్పుడే కదరా ఆ వెధవని తప్పించుకున్నానంటే, వెంటనే దానికి సంబందించిన విషయమే మళ్ళీ ప్రత్యక్షం! ఎంత వేడుకున్నా వినిచావరని, కనీసం దైవస్వరూపాల కారణంగానన్నా ఊయకుండా ఉంటారని ఇటువంటి ఏర్పాట్లు! కేవలం ఒక మతానివే పేడితే, ఇతర మతస్తులు పట్టించుకోరని, సర్వమత సామరస్యమన్నమాట.

దైవస్వరూపాలున్న టైల్స

దైవస్వరూపాలున్న టైల్స

ఇక శాస్త్రవేత్తల సంగతికొద్దాం. మనకు ఏది తెలీదో, అది జంక్‌! కదా? కాబట్టి వాళ్ళ విశ్లేషణ సరైనదే. కానీ వాళ్ళకు తెలియనిది, నేను విశ్లేషించి కనుకున్న ఓ పెద్ద రహస్యాన్ని ఇవాళ బహిర్గతం చేయబోతున్నాను. నా టపాలు రెగులర్గా చదివేవారికి తెలుసు; నేను గొర్రెలమీద రీసెర్చ్ చేస్తుంటానని. శాస్త్రవేత్తలు జంక్ కింద పరిగణించిన డీ.ఎన.ఏ. సీక్వేన్స్ నిజానికి గొర్రెలది. మనిషిని ఇంకా సృష్టించనప్పడి మాట. దేవుడు అప్పడిదాక చేసిన సృష్టిలో, చింపాంజియే అన్నిటికన్నా తెలివైనది. కానీ ఒక చోట స్థిమితంగా ఉండలేక పోవడం చూసి దీని తిక్కకి మందేంటబ్బా అనుకుంటుండగా గొర్రె కనిపించింది. ఓహో చింపాంజీ అత్యుత్సాహానికి గొర్రె తెలివితక్కువతనాన్ని జోడిస్తే ఎలా ఉంటుందో అని కుసింత గొర్రె డీ.ఎన.ఏ. ను తీసి చింపాంజీ డీ.ఎన.ఏ. తో జోడించారు. అదండి అలా పుట్టాడు మొదటి మనిషి.

అప్పుడప్పుడు గొర్రె డీ.ఎన.ఏ. ప్రబలంగా ఉన్నవారికి ఇలా ఎక్కడ పడితే అక్కడ నిష్కారణంగా ఉమ్మడం ఓ అలవాటు. ముఖ్యంగా ఓ మూడు, అంతకన్నా ఎక్కువ గొర్రెలు కలిస్తే, మరీ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. మీరందరూ చూస్తూనే ఉంటారు; కానీ నాలాగా రీసెర్చి చేయరు కాబట్టి పెద్దగా పట్టించ్చుకోనుండరు. ఓ చిన్ని గొర్రెల గుంపు చేరితే, ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఊస్తుంటారు. మధ్య-మధ్యలో వారి జననేంద్రియాలను సిగ్గు అనే పదానికి లజ్జ పుట్టుకొచ్చేలా గోకుతూ పక్కనుంచి ఓ ఆడ జాతి జీవి (ఏదైనా కావొచ్చు) వెళితే, కళ్ళతో కొరా కొరా తినేస్తూ వికటాట్టహాసం చేస్తూ రహదారిమీద వాహనాలకు అడ్డంగా నించున్నామనే ఇంగితం కూడా లేకుండా ప్రస్ఫుటంగా వారిలోని గొర్రె డీ.ఎన.ఏ. ప్రభావాని ప్రదర్శిస్తుంటారు. పట్టేశారు కదా?

అలాంటిది తమ గొర్రెతనాన్ని కాదనడానికి టీ.టీ.డీ. చైర్మన్ అయితే ఏంటి ప్రధాన మంత్రి అయితే ఎవడికి? తమ సహజసిద్ధమైన ప్రవర్తనను మానుకోమంటే ఎలా కుదురుతుంది?

అలా ఊయాలనిపించే గొర్రెలు ఏమి తింటుంటాయో? అంతటి అసహ్యకరమైన పధార్థం ఏమిటో?!?

ప్రకటనలు
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s