ముంగిలి > జిడ్డు ప్రశ్నలు, పిచ్చాపాటి > అమ్మ, నాన్న – మమ్మీ, డాడి

అమ్మ, నాన్న – మమ్మీ, డాడి

సున్నితమైన విషయం. నిజానికి ఓ ప్రశ్న. సాధారణంగా పిల్లలు, ఈ కాలం పెద్దలు కూడా, తమ తల్లి తండ్రుల్ని ‘మమ్మీ’, ‘డాడీ’ అని సంభోదిస్తుంటారు. సంబోధన ఏదైనా, అనుబంధం ముఖ్యం; కాదనను. నా ప్రశ్నల్లా తల్లి తండ్రులు ‘అమ్మా-నాన్న’ అనే పిలుపులకు బదులుగా, ‘మమ్మీ-డాడీ’ అనే సంబోధననే ఎందుకు ఇష్టపడుతుంటారు? చాలా అరుదుగా మాత్రమే, ‘అమ్మా-నాన్న’ అనే పిలుపు వినిపిస్తుంటుంది. వీటిలో ‘నాన్న’ అనే సంబోధన మరీ తక్కువ. ఎందుకలా?

ఈ ప్రశ్న సమాధానం భాషలతో ముడి పడి ఉందా? తెలుగు అంటే అయిష్టం అనే కన్నా ఆంగ్లభాషలో పట్టు సంపాదించాలనే తపన దీనికి కారణమా?

అతిసాధారణ విషయం కాబట్టి ఎవరూ పెద్దగా పట్టిచ్చుకోరుగానీ, నిజానికి అత్యధికశాతం పిల్లలు రెంటినీ తప్పుగా ఉచ్ఛరిస్తుంటారు. ఠక్కున చెప్పండి తల్లిని ‘మమ్మీ’ అని పిలిచే ఆంగ్ల పద స్పెల్లింగ్ ఏంటో? ఒక్కసారిగా అడిగితే ఎక్కువ శాతం “Mummy” అని చెప్పారు. ఉచ్ఛారణకూడా అలాగే ఉంటుంది. 

సరైన స్పెల్లింగ్  “Mommy”. మరి ఉచ్ఛారణో?

ఇక ‘డాడి’ విషయానికి వస్తే అది ‘డాడీ’ అంటున్నారో లేక ‘దాడీ’ అంటున్నారో లేక రెంటికి మధ్యలోలానా అన్నట్టు ఉంటుంది పిలుపు. కాదు?

అనుబంధాలు, ఆప్యాయతల విషయాలు స్పెల్లింగులు-భాషలతో పెద్దగా సంబంధం లేనివి. ఎలా పిలిచినా ఓ బిడ్డడి పిలుపు ఆ తల్లికే తెలుసు; తన కూతురి పిలుపులోని మాధుర్యం ఆ తండ్రే ఆస్వాదించగలడు.   కానీ, మన మాతృభాషని ఓ మాతృస్వరూపంగా భావిస్తే, పాపం తనకు కూడా తన శైలిలో తన పిల్లలు సంబోధిస్తే బాగుటుందనిపిస్తుందేమో? ఏఁవంటారు?

Transliterated with Kacchapi

ప్రకటనలు
 1. తాడిగడప శ్యామలరావు
  2:41 సా. వద్ద నవంబర్ 9, 2011

  ఏం చెప్పాలి పాపం తెలుగు తల్లి పరిస్థితి గురించి!

  ఈ రోజున ‘పాట’ అనే పదం మన తెలుగు ఛానెళ్ళ రకరకాల మంచి/పిచ్చి షోలలో వినిపిస్తోందా?
  అందరూ కేవలం ‘సాంగు’ అనే అంటున్నారు.

  ముందు ముందు తెలుగు పూర్తిగా చచ్చిపోతే దానికి తెలుగువాళ్ళం అని గర్వంగానో కొంచెం సిగ్గుతోనో చెప్పుకునే మనమే కారణం.

  పాపము శమించు గాక.

 2. ఒక సామాన్యుడు
  5:24 సా. వద్ద నవంబర్ 9, 2011

  నేను చాలా సార్లు ఆలోచించాను మనం ఆంగ్ల పదం లేకుండా మాట్లాడ గలమా అని, కాని అది చాలా కష్టం. మీరు ‘ట్రై’ చెయ్యండి..’సారీ’…..ప్రయత్నించండి…..క్షమించండి…., ఒక్క నిముషం సేపు ఏదైనా విషయాన్నిమాట్లాడండి ఆంగ్ల పదం ఉపయోగించ కుండ.
  Mommy మరియు Daddy విషయాని కోస్తే, అది status symbol గా మారింది. ఆ పిలుపు లో ఆప్యాయత కచ్చితంగా లోపిస్తుంది.
  నేను ఇంకొకటి గమనించాను..ప్రక్క రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ భాష కు ఎంత విలువ ఇస్తారో మన తెలుగు వాళ్ళు అంత ఇవ్వరని …తేటతెల్లమౌతుంది ….వాళ్ళు తమ భాష లో వాడే పదాలు మన భాష లో ఉన్నా కూడా మనం సులువుగా ఉంటుందనో…లేక…Status కోసమో తెలియదు కాని..మన తెలుగు వాళ్ళు ఆంగ్ల పదాలు ఉపయోగిస్తుంటారు.

  ఇది నా మొదటి వ్యాఖ్య… నేను తెలుగులో వ్రాసి చాల సంవత్సరాలైంది… …..మళ్ళీ ఈ web site ద్వార అవకాశం దొంరికింది…
  మీరందరినీ నేను ఆదర్శంగా తీసుకుంటూ..నా తెలుగు ని కాస్త improve చేసుకోవాలని నా ఆశ…….

 3. తాడిగడప శ్యామలరావు
  7:43 సా. వద్ద నవంబర్ 9, 2011

  ఒక ఉపాయం చెప్తానండీ.
  మీరు ఒక చిన్న పుస్తకం పెట్టుకోండి.
  ఏదైనా ఇతరులతో మాట్లాడిన తరువాత, ఆంగ్లపదాలు వాడిన వాక్యాలు గుర్తుపెట్టుకుని, వీలు చూసుకొని ఆ వాక్యాలని పుస్తకంలో యెక్కించండి. మొదట యిలా చేయటం కష్టంగానే ఉంటుంది. నాకేం సులువుగానే చెప్పాను. వారాని కొకసారి మీ పుస్తకంలోని వాక్యాలని పునర్విమర్శ చేసుకొని యే ఆంగ్లపదాలున్న వాక్యాలను యెలా అవిలేకుండా తెలుగు మాటలతోనే చెప్పవచ్చునో విచారించి పుస్తకంలో వ్రాసుకోండి.
  తరువాత క్రమంగా అవి లేకుండా మాట్లాడటం అభ్యాసం అవుతుంది.
  ఇలా కొన్నాళ్ళు పట్టుదలగా ప్రయత్నిస్తే అందంగా తెలుగులోనే మాట్లాడటం సాధ్యపడుతుంది.
  సూచన: సాంకేతిక పదాలను ఆంధ్రీకరించాలని ప్రయత్నించకండి. అది నిష్ప్రయోజనం.
  అన్నం అనటానికి బదులు రైస్ అనీ, మంచినీళ్ళు అనకుండా వాటర్ అనీ అనవసర ఆంగ్ల తగ్గిస్తే చాలు మనం.

 4. 9:08 సా. వద్ద నవంబర్ 9, 2011

  తండ్రిని అయ్యా అన్నా, ఫాదరొ అన్నా,నాన్నా అన్నా, డాడి అన్నా, పేరెట్టి పిలిచినా, తల్లి ని అమ్మా అన్నా,అమ్మి అన్నా, పేరెట్టి పిలిచినా, పిలుపులొ వున్న ప్రేమ ముఖ్యమనుకుంటానండి.

  • 10:50 సా. వద్ద నవంబర్ 9, 2011

   పూర్తిగా చదవకుండా ఓ రాయి విసిరి వెళ్ళడమంటే ఇదేనేమో! సరే ఎలాగో ఎత్తారు కాబట్టి నా సమాధానం ఓ చిన్ని కల్పిత సన్నివేశంతో ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

   ఓ సగటు పట్టణవాసి ఏదో పనికై ఓ కుగ్రామానికి వెళ్ళాడు. అనుకోకుండా విపరీతమైన కడుపునొప్పి వచ్చి చాలా బాధ పడుతుంటే అతణ్ణి దగ్గిరే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళారు. బాధలో ప్రశ్నవేయకుండా, అక్కడి వైద్యుడు ఇచ్చిన ఓ మందు బిళ్ళ వేసుకున్నాడు. అరగంటలో కడుపునొప్పి మాయం. హమ్మయ్య అనుకొని ఆ వైద్యుడి గురించి కృతజ్ఞతాపూర్వకంగా పక్కవారితో మాట్లాడుతూ ఇలాంటి కుగ్రామంలో ఇలాంటి గొప్ప హస్తవాసి ఉన్న డాక్టర్‌గారు ఎలా ఉన్నారని అడిగాడు. తాపీగా వారి సమాధానం “అబ్బే! ఆయన డాక్టర్ కాదు; ఆర్‌.ఎమ్‌.పీ.” అని. వెంటనే అతని ప్రతిస్పందన “ఓ! ఆర్‌.ఎమ్‌.పీ.ఏనా” అని.

   ఆ వైద్యుణ్ణీ డాక్టర్ అంటే ఏంటి? ఆర్‌.ఎమ్‌.పీ. అంటే ఏంటి? కడుపునొప్పి వచ్చింది, సరైన వైద్యం చేశాడు. చాలదా? వెంటనే ఆ వ్యక్తి భావనలో తేడా ఎందుకు వచ్చింది?

 5. 9:41 సా. వద్ద నవంబర్ 9, 2011

  నా మటుకు నాకు అమ్మ అన్న పిలుపు చాలా కమ్మగా ఉంటుది. అలాగే నాన్న కూడా.

 6. 11:32 సా. వద్ద నవంబర్ 9, 2011

  అమెరికాలో (స్వయంగా చూశా), ఇతర ఆంగ్లదేశాల్లోనూ (చూసిన సినిమాలను బట్టి) , మామ్‌-డాడ్/పాప్ తప్పితే మామీ/డాడీ నాకు అంతగా తగల్లేదు.

 7. 3:21 ఉద. వద్ద నవంబర్ 10, 2011

  హత్తుకునే, ఆలోచింపచేసే టపా ఇది. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కాని మనభాషలోనే నువ్వు సంభాషించు!

 8. 3:42 సా. వద్ద నవంబర్ 10, 2011

  మీ భావాలతో సంపూర్తిగా ఏకీభవిస్తానండీ..ఎందుకంటే నేను అలానే పిలుస్తాను కాబట్టి.. మంచి టపా పెట్టినందుకు ధన్యవాదాలు.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s