ముంగిలి > జిడ్డు ప్రశ్నలు, పిచ్చాపాటి, శిరోభారం > ముడి చమురు, పెట్రోల్‌, డీజిల్ ధరలు – అసలు కథ ఏంటి?

ముడి చమురు, పెట్రోల్‌, డీజిల్ ధరలు – అసలు కథ ఏంటి?

చెన్నైలో, అంతర్జాతీయ విమానయాన సంస్థలు వైమానిక ఇంధనం ప్రతి వెయ్యి లీటర్లకు $939.78 (రమారమి నలభైఆరు వేల రూపాయలు) చెల్లిస్తే, దేశీయ మినానయాన సంస్థలు రూ.65,705.52 చెల్లిస్తాయి.  పంతొమ్మిది వెల పైచిలుకు ఎక్కువ. అంటే దేశియ విమానయాన రంగంనుంచి ప్రభుత్వం లీటరుకు రూ 19.71 అధికంగా వసూలు చేస్తుంది. మనదేశంలో అమ్ముడయ్యే వైమానిక ఇంధనం అంతర్జాతీయ ధరలతో పోలిస్తే 42% అధికం. ముఖ్య పట్టణాల ధరల వ్యత్యాసం మరీ విడ్డూరంగా ఉంది.

  వెయ్యిలీటర్లకు
నగరం అం.వి.యా.సం. దే.వి.యా.సం. ఎంత అధికం?
చెన్నై $939.8 రూ 65,706 రూ 19,712
ఢిల్లీ $941.5 రూ 61,115 రూ 15,038
ముంబై $937.3 రూ 61,984 రూ 16,112
కోల్‌కతా $982.9 రూ 69,157 రూ 21,053

సరే. ఇలా ఎందుకుందని తెలుసుకొనడానికి కేంద్ర ప్రభుత్వ పెట్రోలియమ్ మంత్రిత్వ శాఖ వారి వెబ్సైట్‌లో (http://petroleum.nic.in/) వెతికాను. ధరల నిర్ణయం, సంబంధిత పన్నులు, వితరణ మరియూ అమ్మకందారు కమీషన్‌లకు (Pricing/Taxation/Dealer distribution commission) సంబంధించిన లంకేను ప్రయత్నిస్తే HTTP 404 తగిలింది (http://ppac.org.in/oil_prices_taxes.htm). కావాలని తొలగించారో, లేక వారికికూడా అర్థంకాని విషయం కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఆ వివరాల్ని దాచారో? ఇక గత్యంతరంలేక నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను.

ముందుగా పీపా (Barrel) ముడి చమురు (Crude) నుండి నా ప్రయత్నం మొదలుపెట్టాను. ఒక పీపా అంటే 158.9 లీటర్ల ముడి చమురు. రిఫైనెరీ సామర్థ్యం, వాడిన ముడి చమురు రకం బట్టి, ఏ ఉత్పత్తి ఎంత ఉంటుందో కాస్తంత ఎక్కువ తక్కువ కావచ్చు కానీ, విశ్లేషణ కొరకు, క్రింది పట్టీని పరిగణించవచ్చును. ఆసక్తికర విషయమేమిటంటే, ముడిచమురు కన్నా (158.9 లీ), దాని ఉత్పాదనలన్ని కలిపిచూస్తే ఆరు శాతం అధికంగా ఉంటాయి (169.8 లీ). దీనిని ప్రాసెస్సింగ్ గైన్ (Processing Gain) అంటారు.

ఉత్పాదన శాతం పీపాకు
ఎన్ని లీటర్లు
పెట్రోల్ 44.00% 70.0 లీ
డీజిల్ 28.10% 44.7 లీ
వైమానిక ఇంధనం 9.60% 15.3 లీ
పెట్రోలియమ్ దినుసు బొగ్గు 5.40% 8.6 లీ
తారు 2.20% 3.5 లీ
కెరోసిన్ 0.10% 0.2 లీ
కొవ్వు 0.10% 0.2 లీ
ఇతరత్రా ఉత్పాదనలు 17.30% 27.5 లీ
169.8 లీ

ఇక ముడి చమురు ఖరీదెంత? కాస్తంత జటిలం. మన దేశం వివిధ దేశాలనుండి రకరకాలైన ముడి చమురును దిగుమతి చేస్తుంటుంది. ముఖ్యంగా చమురు ఎగుమతి కూటమి లోని (OPEC Cartel) పశ్చిమాసియా దేశాలనుండి పన్నెండు రకాల ముడి చమురు దిగుమతి అవుతుంటుంది. అల్జీరియా ‘సహారా’ రకం, అంగోలా ‘గైరస్సోల్‌’, ఇరాన్ ‘మందమైన’ రకం, ఇరాక్ ‘తేలికపాటి బస్రా’ రకం, కువైట్ రకం, నైజీరియా ‘తేలికపాటి బాన్నీ’ రకం, లిబ్యా ‘ఎస్ సైడార్‌’, కతార్ ‘సముద్ర గర్భ’ రకం, సౌదీ ‘తేలికపాటి అరబ్’ రకం, సంయుక్త ఎమిరేట్స్ ‘ముర్బాన్’ రకం, ఈక్వడోర్ ‘ఓరియన్టే’, మరియూ వెనిజుయేల ‘మెరే’ రకాలు.

నవంబరు మొదటి వారంలో ఒక పీపా సగటు ధర $110. మనలాగా “ఏరోజుకారోజు” అన్నట్టు ప్రభుత్వాలు కొనవు కాబట్టి, బహుళ జాతి సంస్థలనుండి, ఇలాంటి కూటములనుండి ఒప్పందాలు కుదుర్చుకొని పెద్ద మొత్తంలో ఒక్క సారిగా ఎన్నో లక్షల పీపాలు కొంటారు. అంచేత నవంబరు విశ్లేషణకొరకు మనము సెప్టెంబరు ధరను పరిగణలో తీసుకుందాం. సగటు ధర పీపాకి $107. కేవుకూలి పీపాకి $1.49. సముద్ర రవాణా, దిగుమతి నష్టాలు $1.2. దిగుమతి శుల్కం $2.76. వెరసి ఒక పీపా భారతదేశం చేరాలంటే $112 ఖర్చవుతుంది. శుమారుగా ఐదున్నరవేల రూపాయలన్నమాట.

కాసేపు ముడి చమురును పక్కన పెట్టి, మన పెట్రోల్ బంకులనుండి చూద్దాం. భాగ్యనగరాన్ని ఇందుకు పరిగణలో తీసుకుంటే లీటర్ పెట్రోల్ 76 రూపాయల 40 పైసలు. ఇందులో అమ్మకందారు లీటర్ పెట్రోల్ కమీషన్ రూపయిన్నర. పెట్రోల్‌మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించే అమ్మకం పన్ను 33 శాతం! ఇరవై నాలుగు రూపాయలు. వాల్యూ ఆడెడ్ టాక్స్ శుమారు ఎనిమిది రూపాయలు. పన్నుల ముందు మన రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర నలభై-చిల్లర రూపాయలు. కేంద్ర ప్రభుత్వ పన్ను ఓ రెండు రూపాయలు. రవాణా ఖర్చులు రమారమీ ఏడు రూపాయలు. వెరసి ముడి పెట్రోల్ లీటరుకు ముప్పై రెండు రూపాయలు.

తిరిగి ముడి చమురు సంగతికెళితే, ఒక పీపా ముడి చమురు నుండి డెబ్భై లీటర్ల పెట్రోల్ వస్తుంది. పీపా ధరలో నలభైనాలుగుశాతం అంటే రూ. 2,304. వీటినుండి లీటరు ధర ఇంచుమించు రూ. 32. రెండు వైపులనుండి అంకెలు సరిపోయాయి.

కానీ, పై లెక్కల్లో కొన్ని తప్పులున్నాయి. ఉదాహరణకు దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఖనిజ చమురు ధర ఎన్నో రెట్లు తక్కువుంటుంది. క్రితం సంవత్సరం ముప్పై శాతం ముడి చమురు మన దేశం లోనే వెలికితీయబడింది. దాన్ని పైన లెక్కల్లో పరిగణించలేదు. అలాగే మరికొన్ని చిన్ని చిన్ని తప్పులున్నాయి. ఆ తప్పులన్నిటి ప్రభావం మహా అంటే లీటర్‌కు ఓ అర్థ రూపాయుంటుందేమో!

ఓ చిన్న గమనించదగ్గ విషయం. మీరు పెట్రోల్‌బంకులో కొనుగోలు చేసిన ఇంధనానికి రసీదు తీసుకున్నప్పుడు, సేల్స్ టాక్స, వ్యాట్ వంటివి ఎప్పుడన్నా చూశారా? ఇలా నాలా ఎవేవో గాల్లో లెక్కలు వేసే వాళ్ళే తప్ప, ప్రభుత్వం వారు ఎందుకు ఈ విషయాలను పారదర్శకంగా చూపించరు?

ప్రకటనలు
  1. 9:39 సా. వద్ద నవంబర్ 13, 2011

    మీరు రాసంది నిజమే.ప్రభుత్వం విధించే అధిక పన్నులవలననే పెట్రోల్ అంత ఖరీదు. కాని వాళ్ళు ఆదాయం పోతుందని పన్నులు తగ్గించరు.

  2. kamudha
    2:29 సా. వద్ద నవంబర్ 24, 2011

    ప్రతి Berrel కి సొనియా కమిషన్ ఉంటుంది. మీరు అది మర్చిపోయారు. దాని వల్లనే పక్కనున్న పాకిస్తాన్ శ్రిలంక ల కన్న ఎక్కువ చెల్లిస్తున్నాం.

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s