ముంగిలి > పిచ్చాపాటి > రాశి మారనున్న శని గ్రహము

రాశి మారనున్న శని గ్రహము

శనిగ్రహ చలనం, మిగతా గ్రహాలన్నిటికంటే నెమ్మది. అందుకే ‘శని’వారాన్ని పూజాసంకల్పాలలో స్థిరవారం అని, శనిగ్రహాన్ని మంద అని కూడా పిలుస్తారు. ముప్పై డిగ్రీలు దాటడనికి శుమారు రెండున్నరేళ్ళు పడుతుంది. గ్రహచార ఫలాలు నిర్ణయించడంలో, ఈ గ్రహం ఏరాశిలో ఉన్నదో – కీలకమైన విషయం. శని తరువాత, ఛాయా గ్రహాలైన రాహు-కేతువులు వాటి తరువాత గురు గ్రహం, గతి రిత్యా నెమ్మది.

ఈ నవంబరు మాస మధ్యంలో, శని కన్యారాశి నుండి తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఏ నక్షత్రంవారికి శని ఏ స్థానం లోకి ప్రవేశిస్తున్నాడో, క్రింది పట్టికలో చూడవచ్చును.

నక్షత్రం పాదము రాశి శని గ్రహ స్థానం
అశ్విని 1,2,3,4 మేషము 7
భరణి 1,2,3,4
కృత్తిక 1
కృత్తిక 2,3,4 వృషభము 6
రోహిణి 1,2,3,4
మృగశిర 1,2
మృగశిర 3,4 మిథునము 5
ఆర్ద్ర 1,2,3,4
పునర్వసు 1,2,3
పునర్వసు 4 కర్కాటకము 4
పుష్యమి 1,2,3,4
ఆశ్లేష 1,2,3,4
మఖ 1,2,3,4 సింహరాశి 3
పూర్వఫల్గుణి 1,2,3,4
ఉత్తరఫల్గుణి 1
ఉత్తరఫల్గుణి 3,4,5 కన్య 2
హస్త 1,2,3,4
చిత్త 1,2
చిత్త 3,4 తుల 1
స్వాతి 1,2,3,4
విశాఖ 1,2,3
విశాఖ 4 వృశ్చికం 12
అనూరాధ 1,2,3,4
జ్యేష్ట 1,2,3,4
మూల 1,2,3,4 ధనస్సు 11
పూర్వాషాఢ 1,2,3,4
ఉత్తరాషాఢ 1
ఉత్తరాషాఢ 2,3,4 మకరం 10
శ్రవణము 1,2,3,4
ధనిష్ఠ 1,2
ధనిష్ఠ 3,4 కుంభం 9
శతభిష 1,2,3,4
పూర్వాభద్ర 1,2,3
పూర్వాభద్ర 4 మీనం 8
ఉత్తరాభద్ర 1,2,3,4
రేవతి 1,2,3,4

ప్రతి రెండున్నరేళ్ళకొకసారి ఈ గ్రహం రాశులు మారినపుడు కొన్ని సంఘటనలు జరుగుతుండడం గమనించవచ్చును. అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన వ్యక్తి, ఉన్నట్టుండి దెబ్బ తినడం; అప్పటి దాకా అనుకూలించని పరిస్థితులలో ఉన్నవారు కాస్త సేద తీరడం వంటివి. అంటే, ఇది అందరికీ వర్తించదు సుమా! వారి జాతక చక్రం, శని ఏ స్థానం నుండి ఎక్కడికి వెళుతున్నాడు, వారికి నడుస్తున్న గ్రహ దశ ఇత్యాదులన్నిటిని పరిగణనలో తీసుకోవలసి ఉంటుంది.

3, 6 మరియూ 11 స్థానాలలో శని మేలు చేస్తాడంటారు. అదీ ఇతరత్రా విషయాలతో ముడిబడి ఉంటుండి.

పై పట్టిక మీ (పాశ్చాత్య) సౌరమాన రాశులకు వర్తించదు. ఉదాహరణకు మార్చి 21 నుండి ఏప్రిల్ 19 వరకు పుట్టిన వారిది సౌరమాన పద్ధతిలో మేషరాశి. పై పట్టిక చాంద్రమాన (అంటే పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దాని బట్టి రాశిని నిర్ణయించడం) పద్దతికి వర్తిస్తుంది.

మరో ముఖ్య విషయం. కొన్ని మాసముల తరువాత, శని వక్రించి తిరిగి మునుపటి రాశిలోకి ప్రవేసిస్తాడు. మరలా వక్రాన్ని త్యజించి ముందరి రాశిలోకి ప్రవేశించి తిరిగి ఓ ఇరవైఏడున్నర ఏళ్ళ తరువాత ఇప్పుడున్న రాశిచేరుకుంటాడు. ఉదాహరణకు ఇప్పుడు శని కన్య నుండి తులారాశిలో ప్రవేశించి, వక్ర గతిలో మళ్ళీ కన్యకు చేరి, వక్రాన్ని త్యజించి తులలోకి ప్రవేశించాక ఇరవైఏడున్నర ఏళ్ళ తరువాత మళ్ళీ కన్యలోకి వస్తాడు. అర్థంకాకపోతే వదిలెయ్యండి.

Transliterated with Kacchapi

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. kin
  9:31 సా. వద్ద నవంబర్ 15, 2011

  గ్రహం రాశిలోకి ప్రవేశించడం అంటే ఏమిటి..? 3డీ లో చూస్తే అన్నీ విశ్వంలో జళ్ళెడకి రంధ్రాల వలె కనిపిస్తాయి. అలాంటపుడు భూమి మీద నుండి చూసినపుడు ఆ గ్రహం వెనకాల ఉన్న నక్షత్రాన్ని(రాశి) బట్టి ఆ గ్రహం ఆ రాశి లో ఉంది అని అనుకోవాలా ?.. నిజానికి గ్రహానికి ఆ రాశికి దూరం లెక్కకు మించి ఉంటుంది.. సులభంగా ఉండటానికి అలా చెప్తారా ?

 2. వేణు
  5:50 సా. వద్ద నవంబర్ 16, 2011

  మీరు ఎన్నో విషయాలు మీ పుటల ద్వార మాకు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు!
  నా నక్షత్రం,పాదం మరియు రాశి ప్రకారం శని గ్రహ స్థానం 6 అని తెలుస్తుంది. 3, 6 మరియూ 11 స్థానాలలో శని మేలు చేస్తుందని వ్రాస్తూ ఇతరత్రా విషయాలతో ముడిపడి వుంటుంది అని వ్రాసారు. దయచేసి అవి ఏంటో విఫులంగా తెలియజేస్తే సంతోషిస్తాను.

 3. 6:42 సా. వద్ద నవంబర్ 16, 2011

  Those who want to know the effects and remedies of the SHANI transit may go through the web site:- http://www.astroapollo.net/shani_transit_2011_sani_peyarchi_2011.html#Makara

 4. 6:52 సా. వద్ద నవంబర్ 16, 2011

  కిన్‌: మీరు సరిగా అర్థం చేసుకున్నారు. భూమిని కేంద్రబిందువుగా మన చుట్టూ ఉన్న ఆకాశాన్ని 2డీలో పరిగణిస్తే, 360 డిగ్రీలను పన్నెండు విభాగాలు చేసినపుడు ఒక్కో రాశి 30 డిగ్రీలుంటుంది. ఆ ముప్పై డిగ్రీలలో తేజోవంతంగా కనిపిచ్చే నక్షత్రాలను గుర్తుకు వాడుకుంటరు.

  వేణు: మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. వార్తా పత్రికలలో, టీ.వీ.లో ఇలాంటి వార్త వస్తుందో రాదో అని, అసక్తి ఉన్న వారికోసం ఈ టపా పెట్టేను. ఈ విషయంలో మరికొంత లోతుకెళితే, వివిధమైన ప్రశ్నలు తలెత్తి వేరే దారిలో విషయం వెళుతుందని కావాలని కేవలం “information” అన్నట్టుగా పెట్టి “analysis” వదిలివేశాను. మిగతా విషయాలంటే, ఛాయా గ్రహాలైన రాహు కేతువులు, గురు గ్రహం, మీకు నడుస్తున్న గ్రహ దశ, భుక్తి – అంతర్దశలు వగైరా వంటివి కూడా పరిగణనలో తీసుకుంటే తప్ప ఎంత మంచి అని చెప్పలేము. “thumb rule” ఆరులో శని ఖచ్చితంగా మంచి చేస్తాడు.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s