ముంగిలి > పిచ్చాపాటి, శిరోభారం > తప్పు విద్యార్థులదా లేక తల్లిదండ్రులదా?

తప్పు విద్యార్థులదా లేక తల్లిదండ్రులదా?

మొన్న శనివారం, మాటల్లో ఓ సంఘటన ప్రస్తావనకు వచ్చింది. దాని గురించి విన్నప్పటినుంచి బుఱ్ఱనిండా ఏవో ఆలోచనలు. గత కొన్ని రోజులుగా చూసిన ఎన్నో సంఘటనలను కలిపి ఆలోచిస్తుంటే, ఈ ప్రశ్న వాటన్నిటి సారాంశమై ఎదురుగా నిలబడినట్టుంది.

తార్నాకాలోని ఓ జూనియర్ కళాశాలలో జరిగిన విషయం. ఇంటర్ మొదటి సంవత్సరం. ఆర్ట్స్ కి సంబందించిన తరగతి. ‘పిల్లలు’ కాదు-కాదు ‘విద్యార్థులు’ బొత్తిగా మాటవినకపోవడం, సరిగా చదువు మీద శ్రద్ధ చూపకపోవడం, అల్లరి చిల్లరగా ప్రవర్తించడం వంటి విషయాలకన్నా, కాస్త పెద్దది. ఓ సబ్జెక్టుకు సంబందించిన ఉపాధ్యాయులు కాస్తంత కటువుగా పిల్లలను చదువువైపు శ్రద్ధ చూపమని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడం. చివరకు విద్యార్థులందరూ కలిసి, బయటనుండి విద్యార్థి సంఘాల వాళ్ళను తోడేసుకొచ్చి కళాశాలలో వీరంగం సృష్టించారట. (అయినా కార్మిక సంఘంలాగా విద్యార్థి సంఘాలేమిటో?)

అలా వారి ఆగ్రహానికి లోనైన లెక్చరర్లలో, ఓ పెద్దాయన కూడా ఉన్నారట. కసి తీరా ఆయన్ని ఇరికిచ్చడానికి అన్నట్టు, సంగతిని కాస్తంత పక్కదారి పట్టించిందట – ఈ మొత్తం వీరంగానికి కేంద్రబిందువైన ఓ విద్యార్థిని. “నా చున్నీ పట్టుకు లాగాడని,” “నా చెవు దగ్గిరకి వచ్చి చెబుతాడని” వగైరా వగైరా. ఆయనకు ఇలాంటి చేదు అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు కాబట్టి, పాపం తట్టుకోలేక, ఆ అవమానం భరించలేక, ఓ వారం పాటు కళాశాలకే రాలేదట. నాకు ఈ సంగతులు చెప్పిన వ్యక్తిని నేను పూర్తిగా నమ్ముతాను. ఆ వ్యక్తి లెక్కలో ఆయన నిజంగానే పెద్దాయనట; అటువంటి పిచ్చ వేషాలు వెయ్యని రకమట.

ఇంతకీ విద్యార్థులకు వచ్చిన కష్టాలేంటంటే, లెక్చరర్లు తమను చదువుకోమని వేధిస్తున్నారట. అమ్మాయిలున్నారని పట్టించుకోకుండా అబ్బాయిలను, అబ్బాయిలున్నారని పట్టించుకోకుండా అమ్మాయిలను అలా అంటుంటే, వాళ్ళ పరువులు పోతున్నాయట. తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని, ఓ విద్యార్థిని సారధ్యంలో, ఈ తతంగం విద్యార్థులకనుగూణంగా విజయవంతంగా ముగిసిందట. కాస్తో కూస్తో తల్లిదండ్రుల అందడందలు కూడా ఉన్నాయట. అంటే ఒకరో ఇద్దరో!

తేలిగ్గా టీ.వీ.నో, సినిమాలనో ఇలాంటి ప్రవర్తనలకు కారణంగా చెప్పేసి వదిలించుకోవచ్చు. కానీ రోడ్డుమీద గుంతలు, బురదా ఉన్నా, మనం తప్పుకుంటూ వెళ్ళమా? తప్పుడు కుఱ్ఱకారు ఉన్నట్లే, ఆణిముత్యాల్లాంటి పిల్లలూ ఉన్నారుగా? వాళ్ళ మీద ఎందుకు ప్రభావం చూపలేవు, అవే టీ.వీ.లు, సినిమాలూ?

నాకు ఈ సంఘటనలో ఎటువంటి పాత్రా లేదు. కేవలం ముచ్చటిస్తుంటే తెలిసిన విషయాలు. కానీ బాగా ప్రభావితం చేసింది. ఏంటిది? ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచిస్తుంటే, వేరే విషయాలు జోడయ్యాయి.

మా కాలనీలో ఓ కుటుంబం. పెద్దవారైన తల్లిదండ్రులు, కొడుకూ-కోడలు. వివాహానంతరం చాలా కాలం సంతానం కలుగలేదు. చివరికి ఓ రెండు-మూడేళ్ళ క్రితం ఓ కొడుకు పుట్టాడు. ఎంతైనా లేక లేక కలిగిన నలుసు. అందరూ ముద్దు చేస్తారు. సాధారణమే. కానీ ఎంత ముద్దు చేస్తారంటే, వాడిని పంపవద్దని నర్సరీ స్కూలువారు వేడుకునేంత! మాట వినకపోతే ఎవరినైన పట్టి కొరికేస్తాడు. ఇతర పిల్లల తల్లిదండ్రుల మొఱ వినకపోతే మొదటికే మోసం వస్తుందని, వాణ్ణి ఇక పంపవద్దని నర్సరీ స్కూలువారు వదిలించుకున్నారు. ఓ రెండు వారాల క్రితం సంగతి. వీడు ఆడుకుంటూ పక్క వీధిలో ఓ పాప వద్ద ఓ చిన్ని కుక్క బొమ్మ చూసి ముచ్చటపడి “నాకీ!” అని ఆ పాపనడిగితే, తను ఇవ్వలేదని, ఐదేళ్ళున్న ఆ పాప జుట్టు పట్టుకు కిందికి లాగి మెడమీద గాట్లు పడేలా కొరికాడట (కరిచాడట). ఆ పాపేమో తనమానాన తను ఆడుకునే రకం. చాలా సౌమ్యమైన మనస్తత్వం. కుయ్యో మొర్రో! తలుచుకుంటేనే జాలి కలుగుతుంది. సంపన్న కుటుంబీకులు కనుక రోడ్డు మీద బాహా-బాహీకి దిగలేదు. ఆ బుడతడి వాళ్ళ డ్రైవర్ వెంటనే వాణ్ణి ఇంటికి పట్టుకు పోయాడు. అంతే! “ఇదేంటి నాన్నా? అలా కొరుకుతారా? తప్పు కదూ?” అని చెప్పే వాళ్ళే లేరు. వీడు రేపు పెద్దయ్యాక ఓ ‘అబ్దుల్ కలాం’ అవుతాడా లేక రక్త చరిత్ర సినిమాలో ‘బుక్కా రెడ్డి’ అవుతాడా?

ఒకప్పటి (ఇలాంటి) బుడతళ్ళే ఆ కళాశాల విద్యార్థులు. కళాశాలకు చదువుకోడానికి వెళతారా లేక ఇతరులను “ఇంప్రెస్స్‌” చెయ్యడానికా? ఇంత “సూపర్ ఈగో” ఎందుకు? “నువ్వు చేస్తోంది తప్పు” అని తల్లిదండ్రులు సరిదిద్దలేకపోవడం వెనుకనున్న బలహీనతల కారణాలేంటి? హితవు చెప్పలేరా లేక హితవు చెప్పడం అనవసరమనుకుంటారా?

“నేను ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చాను. అలాంటి కష్టాలు నా పిల్లలు పడకూడదు” అని అప్పుడప్పుడు ఓ కుంటి సాకు. వీడో పెద్ద హరిశ్చంద్రుడు; సీతమ్మా, ద్రౌపదులే జాలిపడేంత కష్టాలు.

కొన్ని సార్లు “ఒక్కగానొక్క కొడుకు” లేదా “కూతురు” అని.

పిన్న వయసులోనే ఓ పెద్ద బైకు. ఆ బైకుని నడపడం తక్కువ – అమ్మాయిలను “ఇంప్రెస్స్‌” చెయ్యడం ఎక్కువ అన్నట్టు తోలడం. ఓ మోస్తరు పెద్దవాళ్ళ పక్క నుండిగనక వెళితే, ఓ క్షణం బండి పక్కన ఆపి “బాబోయ్‌” అనుకోవడం వీళ్ళ వంతు. అప్పుడప్పుడు అతివేగంలో కార్లకు స్క్రాచ్‌లు. ఎలాగూ పట్టలేరు కదా అన్న ధీమా. “ఎంజాయ్‌” చేశామా లేదా? అది ముఖ్యం.

ఇక అమ్మాయిల విషయానికి వస్తే, దిమ్మ తిరిగే డ్రెస్సింగులు. బిగుతుగా ఎంతో “స్ట్రాటెజిక్‌” గా చూపించీ-చూపించనట్లుండే దుస్తులు. అలా ఉంటే ఎన్నో పనులు తేలికగా జరిగిపోతుంటాయి కదా? పై పెచ్చు యవ్వనంలో అందరూ తననే చూస్తే, ఆ థ్రిల్లే వేరాయే. పిన్న వయసులోనే శరీర రూపలావణ్యాలను ఎలా ఎరగా వాడుకోవాలో నేర్చుకోవడం. ఇట్టే పనులు జరిగిపోతుంటే, ఇక కష్టపడటం దేనికి?

వీరివంటివారిని చూసి, ఆ “ఎంజాయ్‌మెంట్‌” మోజులో, వనరులున్నా లేకపోయినా, మరికొందరు పడటం.

ఎవరన్నా రెండు మంచి మాటలు చెప్పాలని ప్రయత్నిస్తే, సిద్ధంగా ఉన్న సమాధానాలు. “నీ పని నువ్వు చూసుకోవోయ్‌”, “లైప్ ఎంజాయ్ చెయ్యడానికే!”

తల్లిదండ్రులు అతి గారాబం చేస్తున్నారో, లేక ఏది అడిగితే అది ఇచ్చి, బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారో అర్థమవ్వదు! ఎవరి పిల్లలు వారికి ముద్దు; కాదనను. కానీ ఇటువంటి ప్రవర్తన వారి కుటుంబానికే పరిమితమై ఉండదు. పాఠశాలల్లో శైతం ప్రతి తరగతిలో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు, ఇలాంటి చీడపురుగుల్లా పెంచబడిన పిల్లలు. బూతులు మాట్లాడటం, తప్పుడు పనులు చేయటం వంటివి మరో నలుగురికి అంటగడతారు. ఈ పెంపకం వేరే కుటుంబాలను కూడా ప్రబావితం చేస్తుంది. “మా బుడతడు బీరు తాగాడు” అని సగర్వంగా చెప్పుకున్న తల్లిదండ్రులున్నారంటే నమ్మగలరా? ఉన్నారు! ఇలాంటి బాధ్యతారాహిత్యం సంపన్న వర్గంలోనే కాదు, మధ్య తరగతి, పేదా కుటుంబాలలోనూ ఉంటుంది. అక్కడ వేరే కారణాలు, వేరే ప్రేరేపణలు.

“సమాజంలోనో, దేశంలోనో ఓ మంచి పేరు సంపాదించాలి.” “సమాజానికి ఓ ఆదర్శవంతమైన పౌరుణ్ణి అందించాలి.” వంటి పెద్ద పెద్ద మాటలవసరం లేదు. “మా సంతానం, వారి స్వార్థం వారు చూస్కున్నా ఫరవాలేదు; కానీ ఇతరులను అనవసరంగా బాధ పెట్టడం వంటివి చేయకుండా ఉంటే చాలు” అని అనుకుంటే సరిపోతుందేమో.

సరే అలా ధర్నా చేసిన కొందరు విద్యార్థులమీద ప్రభావమేమీ ఉండకపోవచ్చు – వారిని అంతే గారాబంగా పెంచి పోషించే తల్లిదండ్రులున్నారు. కానీ ఇక ముందు నుండి ఆ లెక్చరర్లు మామూలుగా ఎప్పటిలాగే ప్రవర్తించగలరా? వారిలో విద్యార్థులంటే శాశ్వతమైన ఏహ్యభావం ఏర్పడి ఉండదూ? విద్యా బోధనలో జాగ్రత్తగా ఆచి తూచి ప్రవర్తించడం అనేది ఓ అడ్డు గోడై నిలబడదా? ఆ మాట పడ్డ పెద్దాయన పరిస్థితో?

నిజానికి తప్పిదం ఆ విద్యార్థులదని నేననుకోను.

Transliterated with Kacchapi

ప్రకటనలు
 1. Raju
  7:13 సా. వద్ద నవంబర్ 21, 2011

  Very good message. That kind of a behaviour of a student/person, not only spoils the society; also kills their future. We have seen many such incidents in TV, news paper. To an extreme cases, I personally saw some children put behind bars for 10+ years and some children last their lives too. Most of the cases, its because of parents were irresponsible towards grooming their children.

  The most valuable gift you can give for your children is ‘Ethics’. It helps them to be a good citizen and build great society. Do you contribution as a responsible parent to build a great society.

 2. Krishna
  11:33 సా. వద్ద నవంబర్ 21, 2011

  Very well written and thought provoking. Every parent must read this and introspect.

 3. Kalyan
  2:43 ఉద. వద్ద నవంబర్ 22, 2011

  “Sudi Gundalu” ani oka patha telugu cinema gurthuku vacchindhi. The path of our society seems to be more towards being literates than educateds (sic). There is ample scope for people from pre-school to tenth class to learn about samskaram if people had really bothered to understand. Asalu gunthalu, burdhalu etc. only have become essence of life…..evigaaka chaala manchivi unnayi ani thelisthe kada….thelusukovalane thapana unte kada….ultimatega enti anipisthundhi ante..live with it…this is a liberal democracy allowing freedom of speech ani…stop being a moral police ani…stop being a big brother ani…what is good for you can be bad for others ani…eelanti statments chaala vinpisthayi…impress chese vishayamgurinchi antara…man(woman) are still like any animal, insect, or bird trying to impress the other sex for obvious reasons. In my understanding he has not evolved here at all. Health\fitness products or clubs ante sare self-explanatory, but ee beauty care products ento, fashions ento, designer wear ento, designer perfumes ento….deni kosamo…abbo ela vrasukunte pothe…….to me in India population and money with population have become uncontrollable……presently, goppa chaduvulu chaduvukunnavaadu and chaduvuraanivaadu iddaru okkate.

 4. 4:31 ఉద. వద్ద నవంబర్ 22, 2011

  పొరపాటుగా మనమేదేనా చెబితే పిచ్చివాళ్ళని చూసినట్లు చూస్తున్నారు.

 5. gpvprasad
  7:49 ఉద. వద్ద నవంబర్ 22, 2011

  మీరన్నది నూటికి నూరుపాళ్ళు సత్యం.
  కానీ గమనించ వలసిన విషయం ఒకటి ఉంది Exam ముందు రోజు గత సంవత్సరం పరీక్షల Guide చదివితే 1st class లో pass అవుతాము అనే నమ్మకం వచ్చే సరికి ఇలా చేస్తున్నారు పిల్లలు.

 6. 1:47 సా. వద్ద నవంబర్ 22, 2011

  రాజు‘గారు, ‘కృష్ణ‘గారు, ‘కళ్యాణ్‘ గారు: మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  కష్టేఫలే శర్మ‘ గారు: నిజమే!

  జీ.వీ.పీ.ప్రసాద్‌‘ గారు: అవును. ఇదీ ఒక కారణమే.

 7. వేణు
  10:31 ఉద. వద్ద నవంబర్ 24, 2011

  మీరు వ్రాసింది అక్షరాల నిజం. నేను మీతో ఏకిభవిస్తున్నాను. నేను పదవ తరగతి పరీక్ష లో వ్రాసిన “దురభ్యాసాలు….” అనే వ్యాసం గుర్తుకొచ్చింది. ఈ తరం విద్యార్థులను TV మరియు చలన చిత్రాలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. తల్లి తండ్రులు తమ పిల్లలను పదవ తరగతి వరకు ఈ TV మరియు చలన చిత్రాలను మితంగా, ఏది అవసరమో, ఏది చూస్తే వారిఫై సద్ప్రభావం కలుగుతుందో వాటినే చూపిస్తే కొంత వరకు వారిని మంచి దారి లో పెట్ట గలమని అనుకుంటాను.
  ఈ తరం పిల్లలు మాట్లాడే మాటల్లో Cinema Hero చెప్పిన dialogue లు వింటుంటాం (ఉదాహరణకు …కంటి చూపుతో చంపేస్తా….., నరికేస్త, …..etc ,. )….హీరో చేసిన విచిత్రమైన చేష్టలు…..మన పిల్లలు అనుసరిస్తుంటారు ……..మన పెద్దవాళ్ళకు అది చూసి ముచ్చటేస్తుంది, నవ్వుకుంటాం……..కాని అది తప్పుఅని చెప్పాలని కూడా అనిపించదు… … ఇలా మొదలవుతుంది పిల్లలపై దుష్ప్రభావం …..
  ఇక టీవీ విషయానికొస్తే …ఏ news channel చూసినా కనిపించే Crime, भंध లు …Realty షో ల పేరుతో వారు చూపించే జుగుప్స కలిగించే విషయాలు ….పిల్లలపై దుష్ప్రభావం ..కలిగించవా?.
  ఇది నా అభిప్రాయం మాత్రమె………

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s