ముంగిలి > జిడ్డు ప్రశ్నలు > ఆంగ్ల భాషలో పుణ్యాన్ని ఏమంటారు?

ఆంగ్ల భాషలో పుణ్యాన్ని ఏమంటారు?

పాపము = Sin
పుణ్యము = ???

నా ప్రశ్నలోని “పుణ్యము” నామ వాచకము (noun). విశేషణమో (adjective), క్రియా విశేషణమో (adverb) కాదు. నా ప్రశ్నను మరికొంత స్పష్టంగా అడగాలంటే, ఈ క్రింది తెలుగు వాక్యానికి ఆంగ్ల భాషలో అనువాదం కావాలి.

దానముల వలన ‘పుణ్యము’ సంప్రాప్తించును.

కానీ “పుణ్యము” అనే తెలుగు పదానికి, ఆంగ్ల భాషానువాదంలో కూడా ఒకటే పదం పడాలి సుమా!!!

 

ప్రకటనలు
 1. 10:24 ఉద. వద్ద నవంబర్ 23, 2011

  ఆంగ్లములో పుణ్యం లేదు. అందరూ పాపులే. కాబట్టి మీ వాక్యమును తర్జుమా చెయ్యడం కుదరదు.

 2. 11:54 ఉద. వద్ద నవంబర్ 23, 2011

  మీ ప్రశ్న సంగతి ఏమో గానీ జిలేబి గారు కత్తి లాంటి జవాబు ఇచ్చారు :):)

 3. 12:13 సా. వద్ద నవంబర్ 23, 2011

  good karma అందురు 😀

  @Zilebi 😀

 4. 12:14 సా. వద్ద నవంబర్ 23, 2011

  penace

 5. 12:32 సా. వద్ద నవంబర్ 23, 2011

  పుణ్యానికి దగ్గరి ఆంగ్ల పదం VIRTUE.మీరడిగిన తెలుగు వాక్యాన్ని ఈ కింది విధంగా ఇంగ్లీషు లో రాయవచ్చును.charity bestows virtue on you.

 6. వేణు
  1:54 సా. వద్ద నవంబర్ 23, 2011

  పుణ్యము = “A Good Deed”.

  ఆంగ్లములో ఈ పదానికి సరిపడు పదము లేదు. మన తెలుగు లో ఉన్నన్ని పదాలు ఆంగ్ల భాష లో లేవు.

  “రాజీవ్ గాంధీ మన దేశానికి ఎన్నవ ప్రధాని? ” ఈ వాక్యాన్ని ఆంగ్లములో అనువాదం చేసి చూడండి……గబుక్కున రాదు కదూ…..! 🙂

  గూగుల్ వారి సౌజన్యంతో –
  In Judaism, you can “perform a mitzvah,” which might be considered the opposite of committing a sin. Mitzvah is usually translated as “good deed,” but actually it means “commandment.” (We are commanded to perform good deeds – they’re not considered optional!) Visiting the sick, honoring your parents, giving to charity, etc. are all examples of mitzvot, (or mitvahs, if you want to Anglicize the plural).

 7. 3:02 సా. వద్ద నవంబర్ 23, 2011

  శుభ‘ గారు, ‘సూర్య‘ గారు: అవును. నా ప్రశ్న కన్నా, జిలేబీ సమాధానం హైలైట్‌. నేను తన వ్యాఖ్యకి ఏ సమాధానం చెప్పను. చెబితే ఇంకో వ్యాఖ్య వస్తుందేమో ‘కసక్‌’ మని…

  Indian Minerva’: Dude “good karma” though both are valid English words, I do not think they fit the bill! I asked for single word. Moreover it translates to “సత్కర్మ” which is the way to పుణ్యం. Also, I am looking for a noun!

  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్’ గారు: “penance” అంటే ప్రాయశ్చిత్తార్థం తపించడం. లేదా తపస్సు అనైనా చెప్పవచ్చును. కనుక penance కాదేమో?!?

  రమణారావు’ గారు: మీరన్నట్టు అది దగ్గిర పదమే కానీ పర్యాయ పదము కాదేమో? ఉదాహరణకు “Patience is a virtue” అని అంటుంటారు కదా!

  వేణు’ గారు: మీ వ్యాఖ్య బాగుంది. కానీ “Good Deed” అంటే “మంచి కార్యం” లేదా సత్కర్మ. కానీ అది నామ వాచకం కాదు కదా! “mitzvah” కూడా “virtue” లాగా అతి దగ్గిర పదం. కానీ సరైన అనువాదం కాదనుకుంటాను. నాకు తెలిసినంతమటుకు బహుశః చైనా, జపాన్ సంస్కృతులలో దొరకవచ్చునేమో! కానీ నేను వెతుకుతున్నది ఆంగ్లా భాషలో.

 8. 9:23 సా. వద్ద నవంబర్ 23, 2011

  ఈ “ఎందుకో? ఏమో!” భావం కూడా ఒకమారు చూడగలరు

  “పరోప కార్య పుణ్యాయ” & “పాపాయ పరపీడనం” అని అంటారు.
  bible ప్రామాణికంగా పాపాన్ని sin అనిన పక్షాన
  పాపం (sin) definition గమనించి నట్లైతే దేవుని వాక్యానికి విరుద్ధం గా నడిస్తే అదే పాపం
  example : ఒక దేవుని వాక్యం “నీ వలె నీ పొరుగు వానిని ప్రేమించుము”
  పర పీడనమే పాపం 1. తన వలె చూడకపోవటం 2. తనకు అన్యంగా భావించటం 3. ప్రేమించక పీడించటం.

  Bible ప్రకారం దేవుని వాక్యం వెలుగు, వెలుగు అంటే జ్ఞానం
  దేవుని వాక్యాన్ని అనుసరించని వాళ్ళు పాపులు, అంటే అజ్ఞానులు
  సో
  finally అజ్ఞానమే పాపమూ!!
  జ్ఞానమే పుణ్యం (కొంతవరకు)

  పైన కొందరు వ్యాఖ్యాతలు సత్కర్మ & good karma అని భేషుగ్గా చెప్పారు
  అయితే చిన్న సవరణ “సత్కర్మ ఫలం పుణ్యం ”
  దుష్కర్మ ఫలితం పాపం & అజ్ఞానం

  final గా
  నా ఉద్దేశ్యం ప్రకారం
  పాపం కి కూడా english లో సరైన meaning “sin” కాదు
  “sin ” అంటే అజ్ఞానం

  ఈ conclusion less comment ఏంటా? అనుకోకండి ఇప్పటికి ఇంతవరకే నా విచారణ సాగింది
  మళ్ళీ ఆలోచిస్తాను Sairam

  ?!

 9. 2:03 సా. వద్ద నవంబర్ 24, 2011

  చాలా బాగుంది మీ వ్యాఖ్య. English లో sin అంటే అజ్ఞానం అన్న ప్రతిపాదన ఆలోచింపజేసేదిగా ఉంది. కానీ ఒక నిషాదుడైన కన్నప్ప అజ్ఞానంతో చేసిన శివ పూజ బహుశః ఎవ్వరూ చేసిఉండరు. శివ లింగం నుండి చెప్పుతో పూర్వ మాలిన్యాన్ని తోయడం, నోటిలోని జలాలతో శివుడికి అభిషేకం చేయడం, ఎంగిలి మాంసపు ముద్దలు నైవేద్యం పెట్టడం వంటివి. కానీ అతని అజ్ఞానాన్ని పట్టించుకోకుండా కేవలం భక్తినే పరిగణనలో తీసుకొని తన కన్నా పైన కొండ మీద చోటివ్వలేదా? ఒక నాయానార్ స్థానం కల్పించలేదా? అంచేత మీ ప్రతిపాదనతో నేను ఏకీభవించలేక పోతున్నా. కానీ మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మరింకేమన్నా తోచితే, తప్పక తెలియజేయగలరు.

 10. 9:50 సా. వద్ద నవంబర్ 24, 2011

  actually ఇక్కడ అజ్ఞానం అంటే ఆత్మ పరమైన జ్ఞానం లేక పోవటం అని తీసుకోవాలి,
  దేహము తాననే భావము అజ్ఞానము పాపము అని హిందూ మతం చెప్తున్నది.
  కన్నప్ప విషయం లో నాది no comment sorry
  మళ్ళీ ఎమన్నా మనసుకు తట్టితే వస్తాను
  ధన్యవాదములు
  ?!

 11. 1:31 సా. వద్ద నవంబర్ 25, 2011

  wah jilebi , u r superb!

 12. 9:03 ఉద. వద్ద నవంబర్ 27, 2011

  punyaM aMTe “PURE “ani lEdaa “bliss” ani kaani ” anuvadiMchavachchu
  mee vaakyaniki “Donate others to help so that your soul becomes Pure” anuvaadam kaavochchu
  inko vaakhyam “To be blessed help others with selfless donation”

 13. 11:43 ఉద. వద్ద నవంబర్ 27, 2011

  ఇలానే ఆంగ్లం లో ప్రసాదం అనే పదమునకు సైతం సరైన అర్థం లేదని స్వామి సుందర చైతన్య అంటారు
  “ప్రసాదే సర్వ దుఖానం హానిహి అస్య ఉపజాయతే అనే శ్లోక వ్యాఖ్యానం లో …..

 14. 2:53 సా. వద్ద డిసెంబర్ 2, 2011

  బ్రౌను దొరగారు ఇచ్చిన అర్థాలు ఇవి
  పుణ్యము (p. 0772) [ puṇyamu ] puṇyamu. [Skt.] n. Virtue, holiness, merit
  ఎంతో కష్టపడి నిఘంటువు నిర్మించిన దొరగారికి దొరికినవే ఇవైతే మామూలు వ్యవహర్త భాషాపటిమ ఏపాటిది

 15. 8:31 సా. వద్ద డిసెంబర్ 4, 2011

  ‘మూర్తి’ గారు: Bliss ఇంకా Pure పూర్తిగా సరిపోవటంలేదండీ! ఉదాహరణకు ‘Blissful’, ‘Purity’ లు వేరే అర్థానికి దారి తీస్తున్నాయికదా?

  ‘పూర్ణప్రజ్ఞాభారతి’ గారు: నిజానికి ఆంగ్లభాషలో పర్యాయ పదం లేదు. పాపానికి ఉంది కానీ, పుణ్యానికి లేదు.

 16. 9:42 సా. వద్ద డిసెంబర్ 4, 2011

  ఓర్నాయనో, జిలేబి మొదట్లోనే తేల్చేసింది ఇది కుదరదు అని అనుకున్నానే ! ఇంకా కొత్త కొత్త అనువాదాలు వస్తోంది, తెలుగు భావాలు గారు అది సరి కాదండి అంటున్నారు అగైన్ అండ్ అగైన్. ఇది ఎప్పటికి తేలునో ! మొత్తం మీద పుణ్యానికి పాపం అంగ్రేజీ గొడ్డు పోయినట్టుంది !

  చీర్స్
  జిలేబి.

 17. అనామకం
  6:30 సా. వద్ద జూలై 10, 2014

  punyam means VIRTUE

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s