ముంగిలి > హాస్యం > అతి పెద్ద ‘తిట్టు’

అతి పెద్ద ‘తిట్టు’

తిట్లలోకెల్లా అతి పెద్ద తిట్టేది? మన సభ్యతబట్టి ఉంటుంది కదా?

కొన్నేళ్ళ క్రితం, మంచి వాక్చతురతా-సమయస్ఫూర్తులు ఉన్న వ్యక్తితో కాలక్షేపానికి, ఓ విషయం మీద వితండవాదానికి దిగాను. సాధారణంగా ఇలాంటి విషయాల్లో నెగ్గడం అంటే, ఆ వ్యక్తికే చెల్లుతుంది. కానీ కాలికేస్తే మెడకేసి, మెడకేస్తే కాలికేసినట్లు పట్టు వదలకుండా, నా జీవితానికి సంబందించిన అతి కీలకమైన పరిక్షను ఎదురుకుంటుంన్నంత శ్రద్ధతో వాదిస్తున్నాను. నాదే పైచేయి. చదరంగంలో ‘checkmate’ స్థాయికి చేరుకుందా వాదన. ఇక ఎటూ దారిలేక ఆ వ్యక్తి  బ్రహ్మాస్త్రం లాంటి వాక్యాన్ని ప్రయోగించేసరికి ‘mind block’ అయిపోయింది.

“నువ్వున్నావే! ఓ డాష్‌ (dash).”

మంచి కాకమీదున్నానేమో, వితండవాదానికి తగినట్టు బుఱ్ఱ పాదరసంలా పనిచేస్తుండటంతో వెంటనే “fill up the blanks” mode లోకి వెళ్ళిపోయి, నా బుఱ్ఱా-మనసులు ఏకమై ఆ _____ ను పూరించడం మొదలుపెట్టాయి. ఒక్క క్షణమాగి అనిపించింది. ఇదేంటి? నన్ను గురించి నేనే తిట్లను వెతుక్కుంటున్నానని. అప్పుడర్థమయింది – అవతల వ్యక్తి ప్రయోగం.

అవతలవారి తిట్ల పరిజ్ఞానం ఎంత లోతుగా ఉంటే అంత ఘాటుగా పనిచేస్తుందీ ప్రయోగం. అల్లాటప్పాగా వాడితే పెద్దగా ఫలించదు.

ప్రకటనలు
వర్గాలుహాస్యం ట్యాగులు:
 1. 9:20 ఉద. వద్ద నవంబర్ 24, 2011

  హ హ హ:):):) మాష్టారూ ఇంతకీ ఆ డాష్ లో ఏం పెట్టుకున్నారో చెప్పనే లేదు.సరైన పదం దొరికిందా అని.

  • 1:48 సా. వద్ద నవంబర్ 24, 2011

   అరెరె! తెలుసుకోవలనుకుంటారని ఊహించలేదు. దానికేఁ? భేషుగ్గా చెబుతాను. ఒకవేళ మీ బ్రౌజర్‌లో సరిగా కనిపించక పోతే “తిట్ల ఫాంట్‌ version 3” ఇన్స్‌టాల్ చేసుకోండి.

   నువ్వున్నావే! ఓ 񺕫񺕬񺕭񺕫񺕬񺕭񺕫񺕬񺕭 񺕫񺕬񺕭񺕫񺕬񺕭 񺕫񺕬񺕭.

 2. kamudha
  2:31 సా. వద్ద నవంబర్ 24, 2011

  nice post

 3. 7:45 సా. వద్ద నవంబర్ 24, 2011

  మంచి ఐడియా ఇచ్చారు ఇవాళే ఎవరిమీదైనా ప్రయోగించాలి.

 4. 10:02 సా. వద్ద నవంబర్ 24, 2011

  మధ్యాహ్నం కూడా బాగా చలిగా ఉన్నdaని వేడి నీళ్ళతో స్నానం చేయబోతే వేడి పరిమాణం కాస్త ఎక్కువయ్యేప్పటికి కాస్త ఆగాల్సి వచ్చింది అవి చల్లారే దాక
  నాకు ఆ తరుణం లో మీ ఈ post గుర్తుకి వచ్చి
  already ఎక్కడో విన్నన్ను అది కాస్త మార్పు చేస్తే

  “మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం మండు టెండలో మసిలే నీళ్ళతో ముఖం కడుక్కునే face నువ్వూను”
  అని తిడితే అదే మహా తిట్టు !! అనుకున్నాను
  ఏమంటారు? ఒకందుకు సంతోషమే మీరు తిట్టు అన్నారు కనుక రిప్లై ఇస్తున్న బూతు అనుంటే చదివేవాడిని కాదేమో?

  ఇంతకి dash లు పూరించేదరా? లేదా?

  nice
  అవును ఇంతకి మీకు

  “పిచ్చి” అను పదమునకు definition తెలుసా?
  ఇవాళ నా బ్లాగ్ లో పోస్ట్ చేద్దమంకున్తున్నాను దీని నిర్వచనాన్ని
  maro manchi amsam post cheyandi comment tho kalusthanu

  sairam

  ?!
  ?!

  “పిచ్చి” అను పదమునకు definition తెలుసా?
  ఇవాళ నా బ్లాగ్ లో పోస్ట్ చేద్దమంకున్తున్నాను దీని నిర్వచనాన్ని
  ?!

 5. 11:39 ఉద. వద్ద నవంబర్ 26, 2011

  నువ్వున్నావే, ఓ తెలుగు బ్లాగర్ వి !

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s