ముంగిలి > శిరోభారం > సభామర్యాదలు పాటించని చట్ట సభలు – Unparliamentary Democracy

సభామర్యాదలు పాటించని చట్ట సభలు – Unparliamentary Democracy

దేశానికి “ఒక్క మగాడు” కావాలి. “ఇందిర” లాంటి ఆడది కూడా ఓ.కే.

తమ తోటివాడి దవడ వాయగొట్టిన రోజైనా కలవరేమిటి? మరీనూ!!! పార్లమెంటు సజావుగా సాగి ఎన్నేళ్ళయిందో!?! చట్ట సభలకు వక్తలు కాదు భయంకరమైన స్వరపేటికలున్నవాళ్ళు ఎన్నికవుతున్నారేఁ?

“మగాడు” దొరక్కపోతే ఒకటే శరణ్యం. పార్లమెంటు భవనాన్ని సంగ్రహాలయంగా మార్చేసి, సభను కాన్పరెన్స్ బ్రిడ్జ్ (Conference bridge) మీద నిర్వహించడం.

వార్షిక, త్రైమాసిక ఫలితాలను వెల్లడించడానికి వాణిజ్య సంస్థలు వీటినే వాడుతుంటాయి. అద్భుతంగా ఉంటుంది. లాభాలేంటి?

 1. ప్రభుత్వానికి సభ్యుల ఢిల్లీ రాను పోను ఛార్జీలు కలిసొస్తాయి.
 2. సభాకాలంలో ఢిల్లీలో 500 పైచిలుకు సభ్యులకు తాత్కాలిక వసతి సౌకర్యాల ఖర్చు తగ్గుతుంది.
 3. పార్లమెంటు సభ్యుడు తన నియోజక వర్గం నుండి బయటకు వెళ్ళాల్సిన పనీ లేదు. ఏ ఆటంకము లేకూండా ప్రజాసేవ చేసుకొవచ్చు. (అబ్బా ఛా!)
 4. ఎవరన్నా సభను స్థంబింపజేసే ప్రయత్నాలు చేస్తే, వారిని మ్యూట్‌లో (Mute) లో పెట్టేయొచ్చు.
 5. ఏ సభ్యుడికైనా రక్త పోటోచ్చి ఒళ్ళు మరిచి ప్రవర్తించేటంతటి కోపావేశాలు పుట్టుకొస్తే, మహా అంటే సెల్‌ఫోను బద్దలవుతుంది. దాని ఖర్చు మైకులు ఊడబెరికినపుడు టేకు చెక్కతో చేసిన బల్లల మరమ్మత్తుకన్నా ఎంతో తక్కువ.
 6. ఇంట్లో కూర్చొని సభ హాజరవుతే, బల్ల గుద్దేం ఖర్మ, గంట కోట్టి కూడా చెప్పొచ్చు. (పార్లమెంటులో గంటలు తేనివ్వరట)
 7. వాకౌట్లు, రనౌట్లూ గట్రా చెయ్యాలంటే, ఫోన్ కట్టేస్తే సరి.

అబ్బో. ఇంకా చాలా లాభాలుంటాయనుకుంటా. అన్నీ నేనే రాసేస్తే ఎలా?

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
 1. 9:00 ఉద. వద్ద నవంబర్ 25, 2011

  ఆ కలిసొచ్చిన డబ్బులు ఆ మంత్రులకే మళ్ళీ జీతాలు పెంచడానికి భేషుగ్గా ఉపయోగపడతాయి కూడానూ..

 2. 10:27 ఉద. వద్ద నవంబర్ 25, 2011

  (refined version – spelling mistakes reduced)

  work from home లాగా అన్నమాట!!
  నిజమే మరీ !!
  ఆ రోజు తప్పకుండ వస్తుంది, త్వరగా రావాలని కోరుకుంటున్నాను కుడా…!!
  మన Hyderabad లోనే ఆర్డినరీ bus ఎక్కి పటాన్చెరు నుంచి Ecil వెళ్తే సామాన్యుడి సగం పూట సమయం ఖర్చౌతుంది
  దీనికి కొన్ని కోట్ల రెట్లు విలువ చేసే సభ్యుల సమయాన్ని అసభ్యంగా అపసవ్యంగా నిష్ప్రయోజనం గా వృధా చేస్తుంటే
  సభాకాలం దుర్వినియోగం అవుతుంటే అసలు ” democracy లోనే ఎమన్నా లోపం ఉందేమో ?” అనే సందేహమే చుట్టుముడుతున్నది ప్రతి ఒక్కరికి !!
  (కాని మనం కుడా వీళ్ళ వ్యవహారం అంతా చూస్తూ ఊరుకోవటం తప్ప ఏమి చేయలేక పోతున్నాం!)

  కాని కుక్క ఎక్కడున్నా కుక్కే కదండీ దాని స్వభావం మార్చుకున్టుందన్న నమ్మకం నాకైతే ఇప్పట్లో లేదు
  క్షమించండి ఇంతకన్నా un – parliamentary గా మాట్లాడటం వినటం మనకు నప్పని పని చేత కాని పని …!!

  ఇప్పుడు కాలం మారింది! Technology పెరిగింది, ఇది వరకటిలా కానే కాదు, స్థూలంగా వెళ్లి మరీ చేయాల్సిన పని లేదు
  అంతా సూక్ష్మగానే అంతర్జాల సౌకర్యం తో నడుస్తున్నాయి
  ప్రపంచం లో లక్ష కోటి లావాదేవీలు వ్యాపారాలు ఒకరిని మరొకరు చూడాల్సిన పని లేని రీతిలోనే సవ్యంగా నడుస్తుంటే ఇది మాత్రం ఎందుకు సాధ్యం కాదు?
  సంకల్పం ఉండాలే కాని అంతా సవ్యం గా దివ్యంగా సాగుతుంది

  అయిన democracy అంటే “ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన”
  అంటే ప్రతి మాట లోను ప్రతి చేత లోను ప్రతి వాక్కులోనూ లక్ష్యం ప్రజా సంక్షేమం అనే స్ఫూర్తి ఇందులోని అంతరార్థం

  అయ్యో ఒక పక్క మతిలేని media ద్వార కొన్ని కోట్ల మంది మనల్ని చూస్తున్నరనైన కనీసం భావింపక
  తమ హీన జన్మ సంస్కారాలను సభాకాలంలో ప్రదర్శించే తీరు సామాన్యునికి సైతం ఒళ్ళు మండదా మరి?

  వీళ్ళంతా ముసలోళ్ళు అయ్యిపోయారండి, వయసులు కాదు మనసులు ముసలివి అయిపోయినాయి
  పెద్దలు అంటే పెద్దరికం గా హుందాతనం తో వ్యవహరించే వాళ్ళు, అంతే కాని media కనపడితే చాలు సొల్లు వాగే వాళ్ళు కానే కాదు,
  ఎక్కడో విన్నాను – సగం జీవితం రాజకీయ స్థిరత్వం కోసం ఇంకా కాస్త జీవితం దాన్ని నిలబెట్టుకోవటం చక్క వేట్టుకోవటం కోసం
  అచ్చం అలానే ఉంది వీళ్ళందరి తీరు … తెన్నూ …..వగైరాను ….!!

  తండ్రి బిడ్డ తప్పు చేస్తే మందలించాలి, కోప్పడాలి, అప్పటికి మాట వినకపోతే చేయిచేసుకున్న తప్పులేదు
  ఎందుకంటే ఆ ఒక్క పనితోనే వాడు సంస్కరింప బడతాడు వాడి భావి life బాగుపడుతుంది కనుక

  కాని ఇక్కడ తండ్రి స్థానం లో వాళ్ళు యాంత్రికముగా వ్యవహారం సలుపుతున్నారు robo కి కోపం ఉండదు మంచిదే
  ” ధర్మాగ్రహం ” లేకపోవటం నిజంగా శోచనీయం…!!

  నిజాయితీ పరుడైతేనే నిర్మోహ మాటంగా నియంతగా వ్యవహరించా గలడు. సర్వ జనుల శ్రేయస్సు కోసం,

  నిజమే sir మీరు ఉద్దేశ్యిన్చినట్లు మగాడు కావలి, మగతనం పుంసత్వం ఉన్న వీర్యవంతుడైన మగధీరుడు యుగపురుషుడు కావలి రావాలి
  ఇప్పటి మనవాళ్ళకు అవన్నీ లోపించి “నానా” గా తయారైనట్లు ఉన్న తయారౌతున్న దౌర్భగ్య స్థితిలో
  సౌభాగ్య బీజాలు నాటేందుకు, కలుపు మొక్కలల అల్లుకు పోతున్న అవినీతి శకలాలు అరాచక శక్తుల ఆగడాలను మూలాలతో సహా పెకలించేందుకు !!

  అది శంకరుడు ఎంత డెమొక్రటిక్ personality యో అంత నియంత కూడా!
  మొత్తం దేశ శ్రేయస్సు కోసం అయన కొన్ని సందర్భాలలో నియంత లానే వ్యవహరించారు.
  అది ఆధ్యాత్మిక జాతిని ఉద్దేశ్యించి ఆధ్యాత్మ శ్రేయస్సు దృష్ట్యా !!
  అప్పట్లో ఆధ్యాత్మ వాదానికి పట్టిన తెగులు అలా అయన వదిలించారు

  ఇప్పుడు అదే తెగులు భౌతికనికి దేశ భవిష్యత్తు కి పట్టింది
  ఇప్పుడు అలాంటి అవతారమే అత్యావశ్యకమై ఉన్నది ఇకాడ కుడా…!!

  అసలు ఆ అసలైన స్థితి కి వెళ్తే….
  ఏదైనా (సామ్యవాదమో, ప్రజాస్వామ్యమో, నియంత్రుత్వమో) అన్నీ ఒక్కటే !!
  అయితే ఆంతర్యం లోను ఆచరణ లోను శుద్ధి ఉండాలి,
  “దేశ శ్రేయస్సే ప్రధానం, తక్కిన వన్నె తరువాతే ” అనే లక్ష్యం తొలి నుంచి తుది వరకు ఉండాలి
  ఇప్పుడు నిర్లక్ష్యమే నిజమైన లోపమై వ్యవస్థను నిర్వీర్య మొనర్చుతున్నది!!
  మన democracy ఎంత power full ఎవడికైనా ఎదేశానికైనా ఉన్నదా ? ఇంతటి ఔన్నత్యం !! మనకి బుద్ధి కి శుద్ధి లేక పాడుజేసుకుంటున్నాం కాని,

  ఒక ప్రజాస్వామికుడే “ప్రజలకు స్వామి”గా “స్వామిత్వం” అనే అధిష్టాన్నాన్ని అధిరోహించి అరాచకాలను అప శ్రుతులను నియంత్రించగలడు

  నిజానికి మన Democratic system లోనే ఆ మగతనం origin ఉంది,
  కాని దానిని నిర్వీర్యం చేసే యీ నపుంసకులు media వేస్తున్న తాళాలకు నాట్యాలు చేస్తున్నారు నేడు….
  ఇదీ వొద్దేకాలం సాగదు !! Media గురించే మరోమారు మాట్లాడుదాం ….
  టైం అవుతున్నది పనులు పిలుస్తున్నాయి మళ్ళీ meet అవుతాను !!

  మంచి topic fire ఉన్న current affair ఇదీ కేవలం తెలుగోడి భావం మాత్రమే కాదు ప్రతి ” సామాన్య భారతీయుడి ఆత్మ ఘోష “

 3. 10:29 ఉద. వద్ద నవంబర్ 25, 2011

  మీరన్నది బాగున్నది.

  కాకపోతె అసభ్యకరమైన ప్రవర్తనకి unparliamentary behaviour కన్నా “parliamentary behaviour” అన్నదే సరైనదని నా అభిప్రాయం. ఇప్పటివరకూ అదేవాడుతున్నాను.

 4. వేణు
  10:36 ఉద. వద్ద నవంబర్ 25, 2011

  చాలా బాగుంది మీ ఉపాయం. మీ లాంటి ఉపాయాలు మన ఆర్ధిక శాకా మంత్రి కొస్తే బాగుంటుంది.
  కాని చిన్న సందేహం, మరి ఒకరి ఫై ఒకరు కుర్చీలు విసురుకోవాలంటే…ఏదైనా కొత్త technology కనిపెట్టాలేమో….:) ?

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s