ముంగిలి > శిరోభారం > ఎందుకీ ‘మేడిపండు’ యవ్వారాలు?

ఎందుకీ ‘మేడిపండు’ యవ్వారాలు?

కొంతకాలంక్రితం, అంటే నేను టీ.వీ. చూసే రోజుల్లో, సాయంత్రం ఓ తెలుగు వార్తా ఛానెల్ చూస్తూ రాత్రి భోజనం చేస్తున్నాను. ముద్ద మింగుడు పడక నీళ్ళు తాగుతున్న ఘడియలు. “కాథరీన్ ఝెఠా ఝోన్స్‌” అన్న శబ్ధం చెవినపడేసరికి ఉలిక్కి పడ్డ నాకు, కొర పోయి ఉక్కిరిబిక్కిరయింది. తేరుకోడానికి అరగంట పట్టింది. “Catherine Zeta Jones” కి వచ్చిన తిప్పలవి. “Michael Douglas” గానీ తెలుగువాడై ఉంటే, ఓ బిల్లియన్ డాలర్ల కేసెట్టి ఉండే వాడు.

వార్తలు చదివేటావిడ డ్రెస్సేంటి? ఆ ఉచ్ఛారణేంటి? నిజానికి చీరో, చుడీదారో కట్టుకొనుంటే అంత దిమ్మ తిరిగుండేది కాదేమో! ఎంతైనా డిస్కౌంట్ ఇచ్చి వుండే వాడిని. పర సంస్కృతి నామధేయమే కదా – తెలుగమ్మాయిగనుక అలవాటు లేక అలా పలికి ఉంటుండని. ఏ సంక్రాంతికో, దీపావళికో మెహెర్భానీ కోసమన్నట్టు చీరల్లో కనపట్టం – మిగతా అన్ని రోజుల్లో Western Formals! ఎందుకంట ఈ లేని పోని హంగులు?

మగవాళ్ళు కూడా ఎం తక్కువ కాదు. పర సంస్కృతుల విషయాలు అటుంచండి – మన సంస్కృతికి సంబందించిన విషయాలు కూడా నోరు తిరగవు. ఓ పెద్ద పేరున్నాయన అయోధ్య కేసు తీర్పు వెలువడే ముందు రోజు, అరగదీసిన కాసెట్టుకుమల్లే వాడిన graphicsనే వాడేస్తూ, అక్కడ దొరికిన “దేవనగిరి” శిలా ఫలకాల గురించి వివరిస్తున్నాడు. భద్రగిరి, శోణగిరుల గురించి చదివా. యాదగిరీ తెలుసు. ఈ “దేవనగిరి” ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడీ వ్యక్తి అనిపించింది. కాసేపాగి సంగతి అర్థమయింది. “దేవనాగరి“కొచ్చిన తిప్పలని. ఏఁ? “Devanagari” అని కూడా పలకలేమా? “Devanagari” ఎక్కడ? “Devanagiri” ఎక్కడ? ఇలా చెబుతూపోతే – ఎన్నో! ఎన్నెన్నో!

‘సరిగా చదవడం’ అనే మౌలిక అర్హత లేకపోయినా, టిప్పు-టాపు సూటూ-బూటు. ఎందుకీ ‘మేడిపండు’ యవ్వారాలు?

నా జీవితంలో ఎదురుపడ్డ కొందరు ఉత్తమ శ్రేణి ఆంగ్ల వక్తలు, తెలుగులో (మీడియమ్‌) చదువుకున్నవారే. ఒక్కటంటే ఒక్క తప్పు కూడా దొరకదు – వారు ఆంగ్ల భాషలో మాట్లాడినా, వ్రాసినా. కానీ ఇప్పుడే ఓ దొరసాని కడుపునుండీ ఊడిపడ్డట్టుండవు – వారి వేషాలు.

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
 1. v s n prasad
  5:05 సా. వద్ద నవంబర్ 26, 2011

  బాగుందండి

 2. 7:23 సా. వద్ద నవంబర్ 26, 2011

  ప్రతిభాషకీ ఓ అందముంది. దాన్ని సరిగ్గ ఉఛ్ఛరిస్తేనే అది ఆవిష్కృతమౌతుంది. తెలుగుని తెలుగులా పలకాలి, ఇంగ్లీషుని ఇంగ్లీషులా పలకాలి.

  మీరన్నాట్టు సరిగ్గా పలకటంకూడా చేతకాని వీళ్ళు న్యూసురీడర్లవటమేంటో! వీళ్ళని మనం వినాల్సి, చూడాల్సి రావడమేంటో! అంతా ఖర్మండీ.

 3. 3:50 ఉద. వద్ద నవంబర్ 27, 2011

  ఎందుకీ ‘మేడిపండు’ యవ్వారాలు?

  వెరీ వెరీ సింపుల్ , కూటి కొరకు ‘ కోతి’ విద్యలు – చూడటానికి డార్విన్ మహాశయుని వారసులు వుండనే వుండారు !

  చీర్స్
  జిలేబి.

 4. 6:01 ఉద. వద్ద నవంబర్ 27, 2011

  అయ్యయ్యో! ఇలా నిజాలు చెప్పేస్తే ఎలా?

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s