ముంగిలి > మన సంస్కృతి > ప్రియా సిస్టర్స్ గాత్ర కచేరి

ప్రియా సిస్టర్స్ గాత్ర కచేరి

సికందరాబాదు కీస్ గర్ల్‌స్ హై స్కూలులో ‘కళాసాగర’ వారి 44వ వార్షిక సంగీతోత్సవాలు ఆరంభమైయ్యాయి. రెండవ రోజైన నిన్న (నవంబరు 28, 2011), ప్రియా సిస్టర్స్ వారి గాత్ర కచేరి. శుమారుగా వీరు ఆలపించిన కృతులన్నీ నావద్దనున్నాయి. కానీ, ఎప్పుడు వీరిని చూసినది లేదు. కేసెట్టులు, సీ.డీ. లతోనే తృప్తి పడుతూ వచ్చాను. అదృష్టం కలిసివచ్చి నిన్న వారి గాత్ర కచేరి in-person చెవులారా ఆస్వాదించే అవకాశం దొరికింది. ఇప్పటి వరుకు, వీరిలో షణ్ముఖ ప్రియ ఎవరు, హరి ప్రియ ఎవరో తెలియదు; అంటే తెలియాల్సిన అవసరం లేదు లెండి. ‘ప్రియా సిస్టర్స్‌’ చాలు.

చక్కగా నిర్వహించారు. మంచి ప్రేక్షకులు. ఎటువంటి అల్లరీ లేదు. ఎటొచ్చీ, కాస్తంత ఎక్కువ ఆశ పడ్డానేమో అనిపించింది. This was not their best ever concert. ఐనా సరే, మూడు గంటలు ఇట్టే గడిచిపోయినట్టయింది. సమయం అసలు తెలియలేదు. చివరిలో వీరు ఆలపించిన అన్నమయ్య కృతులు శ్రవణానందాన్ని కలిగించాయి. ఇప్పటివరకు నా వద్దలేని కృతిని ఒకదాన్ని, ఈ సభలో రికార్డు చేయగలిగాను. తెలుగు వాగ్గేయకారులైన త్యాగయ్య-అన్నమ్మయ్యలను స్తుతిస్తూ, వారి గురువుగారైన Prof. టీ.ఆర్‌. సుబ్రహ్మణ్యంగారు రచించిన కృతిని నటభైరవి రాగంలో ఆలపించారు. మిశ్రచాపు తాళం. నా ఫోన్లో అంత గొప్పగా కాకపోయినా, ఫరవాలేదన్నట్టు రికార్డయింది. ఆసక్తి గలవారికోసం ఇక్కడ దాన్ని జత పరచాను.

ప్రియా సిస్టర్స్ గాత్ర కచేరి – MP3 link…

ప్రకటనలు
వర్గాలుమన సంస్కృతి ట్యాగులు:
  1. Raju
    7:45 సా. వద్ద నవంబర్ 28, 2011

    Good info to music lovers. Some people looking for good options to spend time during the weekend. They end up going to movie theatres (spending Rs. 500 person), shopping (buying unnessary things for the sake of shopping), passing time with TV (the time killer & free of headache), etc. If this is know to them, they will be very happy. These events are less cost and more happy; good time to spend with family; especially with parents.

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s