Good, Bad and Dirty Posters

డిసెంబర్ 1, 2011

నెలకు 1200 కిలోమీటర్లు కార్యాలయానికి వెళ్ళిరావటానికే తిరుగుతాను – అంటే రోజుకెంతసేపు భాగ్యనగర రహదారులపై గడుపుతానో ఒక అంచనా వెయ్యొచ్చు. అలా ఒక్కడినే ప్రయాణించే నాకు, రెండు వ్యాపకాలు. ఒకటి – గొర్రెల మీద రీసెర్చ్‌; రెండవది – పోస్టర్లను చూడటము. ట్రాఫిక్ జామ్‌లవల్ల నడిపేది తక్కువ – నిరీక్షించేది ఎక్కువ. అంచేత బోలెడంత సమయం – ఈ రెండు వ్యాపకాలకీ.

ప్రతి కూడలిలో నిరీక్షణ చిరాకు తెప్పించినా, ఒక కూడలిలో మాత్రం ‘ఇంకాసేపు జామ్ ఉంటే బాగుండు’ అనిపిస్తుంది. కారణం – ఓ పెద్ద పోస్టర్‌. R.S Brothers వారిది. అందులో ఒక మోడల్‌ నవ్వు మహాద్భుతంగా ఉంటుంది. ‘ఏమీ స్మైల్‌రా దేవుడా!’ అనిపిస్తుంది. తరువాతి కూడలిలో కూడా అదే మోడల్ ఇంకో పోస్టర్‌ ఉంటుంది కానీ, అక్కడ తన విరబూసిన నవ్వుండదు – కాబట్టి అంత గొప్పగా ఉండదు. ఫోన్ కెమెరాతో ప్రయత్నించాను, కానీ నాకే నచ్చలేదు. నెట్‌లో అతి కష్టం మీద దొరికాయి. నిండుగా నవ్వుతూ ఒకటి – మామూలుగా ఒకటి. ఇవి పాతవనుకుంటాను.

విరబూసిన నవ్వుతో

విరబూసిన నవ్వుతో

మామూలుగా

మామూలుగా

‘ఆహా!’ అనుకొని ముందుకు సాగగానే ఒక వందడుగులలోపే ఓ Dirty పోస్టర్‌. విద్యా బాలన్ మరీ బరి తెగించేసింది. అంటే ‘రాముడు మంచి బాలుడు’ అని బిల్డప్ కాదు. నిజంగానే The Dirty Picture పోస్టర్‌లు చెండాలంగా ఉన్నాయి. ఒక అందమైన ఆడదాన్ని ఇంత అసహ్యంగా చిత్రీకరించినవారెవరో! ప్రచారంకోసం ఎంతకైన దిగజారడం కొత్తేమీ కాదు – కానీ ఇవి మరీ Dirty గా ఉన్నాయి. ఎప్పుడు వీటిని పీకేస్తారోనని నిరీక్షణ.

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి, సరదాగా ట్యాగులు: