ముంగిలి > శిరోభారం > దుర్ఘటనలా లేక హత్యలా?

దుర్ఘటనలా లేక హత్యలా?

రహదారుల మీద దుర్ఘటనలు జరగడం సర్వ సాధారణం. ఒకరి తప్పనుకోండి లేదా మరొకరి దౌర్భాగ్యం అనుకోండి. నా వద్ద గణాంకాలు లేవు కానీ బహుశః చాలా సార్లు దుర్ఘటనకులోనైన వ్యక్తులు ప్రాణాలతో బయట పడుతుంటారు – కాకపోతే దెబ్బలు, వాహనాలకు సొట్టలు – వీటివల్ల ధననష్టం. ఇలాంటి వాటిని పక్కన పెడితే, కొన్ని కొన్ని ప్రాణాంతకమైనవి. ఎక్కువగా రక్తం శ్రవించి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంటుంది. ఏదో ఒక అంగానికి తీవ్రమైన గాయాలయి, ఎంత త్వరగా వైద్య సహాయం అందే విషయంతో ముడిపడి ఆ వ్యక్తి ప్రాణాలు నిలిచేదీ-లేనిదీ! రహదారుల వెడల్పు పెరగకుండా, నాలుగు చక్రాల వాహనాల సంఖ్య ఎక్కువైన ఈ రోజుల్లో, ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నవారు బ్రతికి బయట పడటం మరీ కష్టమైపోతోంది.

నేను ఎనిమిదవ తరగతిలో చదువుతున్న రోజుల్లో, మా నాన్నగారు ఒక పెద్ద వాహన దుర్ఘటన బారిన పడినపుడు – కుటుంబాలు ఎంత క్షోభకులోనవుతాయో – స్వయంగా అనుభవించిన జ్ఞాపకాలు జీవితాంతం మరిచిపోలేను. ఆయన ప్రాణాలతో బయట పడ్డా, కొన్ని నెలల పాటు, ఆయనతో సహా, మెమందరమూ ఎంతో బాధను అనుభవించాము. ఈ కాలంలోకానీ అటువంటిది జరిగితే, ఆ పరిస్థితులలో ఉన్న వ్యక్తి బతికి బట్ట కట్టడం చాలా కష్టం

దుర్ఘటన జరిగినపుడు తాత్కాలికంగా సగం రోడ్డు పనికిరాకుండాపోవడంవల్ల, వాహనాల గతి సగానికి పడిపోతుంది. దీనికి ఎవరూ ఏమీ చేయలేరు. కానీ పక్కనుండి వెళ్ళే ప్రతీ వాహన చోదకుడు, తిరుమల వెంకన్న దర్శనంలా, ఓ రెండు క్షణాలు తన వాహనాన్ని మెల్లిగా నడుపుతూనో లేక ఆపో ‘ఏమి జరిగుంటుందని’ కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. సహాయం చేయాలని నూటికో కోటికో ఒక్కడికి ఉంటుంది – మిగతా అందరూ చోద్యం చూసే రకాలే. మనలో సహాయం చేసేతంటతటి దైవీగుణం లేకపోయినా ఫరవాలేదేమో – కానీ ఒక్కొక్క క్షణం ఎంతో విలువైన పరిస్థితులలో ఉన్న ఆ వ్యక్తికి సమయానికి వైద్య సహాయం అందకుండా ప్రతీవాడు తనవంతుగా రెండేసి క్షణాలు జతచేసి మొదటికే ముప్పు తెచ్చిపెడతారు. వీరివల్ల వెనుక వాహనాల రాకపోకలు ఇంచుమించుగా స్థంబించిపోయి – ఆంబులెన్స్ వంటివి సమయానికి చేరుకోలేకపోయి ఆ వ్యక్తి మరణిస్తే, అది దుర్ఘటనా లేక హత్యా?

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:
 1. subha
  2:03 సా. వద్ద డిసెంబర్ 2, 2011

  నేనైతే ఖచ్చితంగా హత్యే అని అంటాను. పక్క వాడి గురుంచి వదిలేయండి,ఈ విషయం మీద మనమెంత స్పృహతో ఉంటున్నామన్న సంగతి మనకే తెలియాలి.ఇక్కడ మద్రాసులో చూస్తూ ఉంటాను ఎప్పుడైనా రోడ్డు మీదికి వెళ్తే, మనుషులు నడిచే ఫుట్ పాత్ ఒని ఒక్కడికి కూడా కనీస జ్ఞానం ఉండి చావదు. రయ్ రయ్ మని ద్విచక్ర వాహనాల వాళ్ళు దూసుకుపోతూ ఉంటారు. ఇక నడవడానికే భయం. వాళ్ళకి రోడ్డు కూడా సరిపోవట్లేదు. ఏదేమైనా ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది.

 2. 4:57 సా. వద్ద డిసెంబర్ 2, 2011

  పోలీసులు కాల్చుకుని తింటారని భయం వల్ల తప్పించి సహాయం చేయకూడ దని కాదు. చాలా కేసుల్లో సహాయం చేసినతన్ని నువ్వే ఏక్సిడెంటు చేసావని పోలీసులు ఏడిపించిన సంఘటనలు కోకొల్లలు.

 3. 8:51 ఉద. వద్ద డిసెంబర్ 3, 2011

  ‘సుభ’ గారు: పక్కవాడుకూడా తనలాంటి మనిషే అని అర్థం చేసుకుంటే ఈ అగచాట్లు తప్పుతాయి.

  ‘కష్టేఫలే శర్మ’ గారు: మీతో నేను కాస్తో కూస్తో ఏకీభవిస్తాను. నా టపా సహాయం చెయనివారి గురించి కాదు – సహాయం అందకుండా (తెలియకుండా) నష్టం కలిగిస్తున్నవారి గురించని గమనించమని మనవి.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s