ముంగిలి > సరదాగా, హాస్యం > అందమైన స్త్రీని ఎక్కువగా ఎవరు చూస్తారు?

అందమైన స్త్రీని ఎక్కువగా ఎవరు చూస్తారు?

ఉప్పుడూ…చూడగానే దిమ్మతిరిగిపోయే అందగత్తె అలా వెళుతోందనుకోండి, ఆమెను ఎక్కువగా ఎవరు చూస్తారు?

‘ఇంకెవరు మగాళ్ళే’ కదా? ఇది సిద్దాంతం మాత్రమే. కానీ ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, ఎవరికి వారే పరిశోధన చేయవలసి ఉంటుంది. ఎలా అంటారా? జనాలున్నచోట (మరీ కిక్కిరిసినట్టుండకూడదు) ఓ మూలను కూర్చొని, అటువంటి స్త్రీరాకకై నిరీక్షించి – కనపడిన వెంటనే – పరిశోధన చేస్తున్న కారణాన నిగ్రహంవహించి – ఆ స్త్రీని కాక ఇతరులను – ముఖ్యంగా ఆ స్త్రీని చూస్తున్నవారి కళ్ళను చూడాలి. అరెరె! ఇంతకాలం మగాళ్ళంటే అపార్థం చేసుకున్నానే అని మగాళ్ళు కూడా వీస్తూ పోయే నిజం బట్టబయలవుతుంది. సరే ఎత్తాను కాబట్టి, ఊరించకుండా నా అనుభవం చెబుతాను దానిని మీరే శోధన చేసి ౠఢీ చేసుకోండి.

అందరూ చూస్తారు. కానీ చూసే విధానం వేరు వేరుగా ఉంటుంది. మగాళ్ళేమో ఆ రెండు క్షణాల్లో ఓ సినిమా చూసేస్తారు. సినిమా అంటే ‘ఆదిమధ్యాంతములు’ గలదని నా ఉద్దేశ్యం. ఇక సినిమా ఎలాంటిదో వారి సభ్యతా-వయసులపై ఆధార పడి ఉంటుంది. కొందరు black & white అయితే కొందరు Eastman Colour. ఇతర రంగులలో మరి కొందరు.

అదే ఆడవారు ఎలా చూస్తారన్నది వర్ణించడం కొంత జటిలమైన విషయం. అయినా, ఒక మానవ ప్రయత్నం చేస్తాను. మగవాళ్ళు సినిమా చూస్తే, ఆడవాళ్ళు ఒక టీ.వీ. సీరియల్ కానిచ్చేస్తారు. ‘మొదలు’ అనేది ఉంటుంది కానీ, మధ్యాంతముల సంగతి తెలియదు. ఎన్ని ఎపిసోడ్లనేది ఆ కనపడిన స్త్రీ అందం మోతాదుకు సరిపడి ఉంటుంది. 13, 52, 365 లేదా అంతమేలేని ఎపిసోడ్‌ల సంఖ్య వరకు. ఒకవేళ ఎపిసోడ్‌ల సంఖ్య కనుక్కోవాలనిపిస్తే, ఒక కోలమానమున్నది. ఆ చూస్తున్న స్త్రీతో మీకు సంబంధం ఉంటే, ఓ చిన్న కెలుకుడు మాటంటే సరిపోతుంది. “ఏంటా చూడటం?” వెంటనే వచ్చిన ప్రతిక్రియ ఘాటునిబట్టి సంఖ్యను లెక్కేయవచ్చు. అలా అనగానే, ఏమనకుండా తేరుకున్నదంటే 13 ఎపిసోడ్లు. ‘నేనేం చూడట్లేదులే’ అంటూ బహిర్ముకురాలయితే, 52 ఎపిసోడ్లు. ‘నన్నంత మాటంటారా’ అన్నట్టు తీక్షణమైన లుక్కిస్తే 356 ఎపిసోడ్లు. వీటన్నిటికీ అతీతమైనదేమన్నా జరిగితే – లెక్కే లేని ఎపిసోడ్లన్నమాట.

నమ్మరా? సరే మరో ప్రామాణం. అలా ఓ స్త్రీ రంగ ప్రవేశం చేసి నిష్క్రమించిన తరువాత, మీరు interviewలు చేయవలసి ఉంటుంది. ఆ అందమైన స్త్రీ దుస్తులను వర్ణించమని అడిగితే చాలు. నిజాయితీ గల మగాళ్ళయితే సాధారణంగా ‘ఏమో మాకేం తెలుసు? మా ధ్యాస మరెక్కడో ఉంది కదా’ అని objective type సమాధానమిస్తారు. ఇదే ప్రశ్నకు ఆడవారయితే రెండు మూడూ పేజీలు నింపగల వ్యాసం అంటే detailed సమాధానమిస్తారు. వేసుకున్న బట్టలు ఏ రంగు? అవి ఏ రకం? శుమారుగా ఖరీదెంత ఉండవచ్చు? ఎక్కడ కొని ఉండవచ్చు? లేటెస్ట్ ఫాషనా కాదా? చెవులకు ఏం పెట్టుకుంది? ఏ అంగరాగాలు  వాడిఉండవచ్చు? ఇతర అలంకారాల సంగతేమిటి? ‘ఇక చాలు’ అనాలే తప్ప మన దిమ్మ తిరిగిపోతుంది. ఇంత తక్కువ సమయంలో అంతగా పరిశీలించవచ్చా అనిపిస్తుంది!

ప్రతీ విషయానికీ exceptions ఉన్నట్టు, దీనికీ కొన్నున్నాయి. ఉదాహరణకు – కొడుకుకి పెళ్ళిచేద్దామనుకుంటున్న తల్లిదండ్రులు మాత్రం ‘हम आपके हैं कौन’ (హమ్ ఆపకే హైఁ కౌఁన్‌) సినిమా – లేకపోతే, ‘बडे अच्छे लगते हैं’ (బడే అచ్ఛే లగ్‌తే హైఁ) సీరియల్ చూస్తారు.

ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో రాయలేదని గమనించగలరు. ఏదో సరదాగా… ‘A thing of beauty is joy for ever’ అంటారు కదా? చూడటం తప్పు కాదు. ఓ విరబూసిన గులాబిపువ్వు కనిపిస్తే ‘ఆహా! ఏమి అందం’ అని ఆస్వాదించడం తప్పేమీ కాదు. కానీ, దాన్ని నిష్కారణంగా తెంపి – రేకులు విరిచి – ఆస్వాదించాలనుకుంటే అది రాక్షసత్వమవుతుంది. అది తప్పు.

ప్రకటనలు
వర్గాలుసరదాగా, హాస్యం ట్యాగులు:
 1. 3:55 సా. వద్ద డిసెంబర్ 3, 2011

  మీరు మరీ ‘తెగులు బావ’ సుమండీ ! వై దిస్ చంపేంత వెర్రి !

  • 8:16 సా. వద్ద డిసెంబర్ 4, 2011

   “మడిసన్నాక కుసింత కలాపోసనుండాలి” అని మీ వ్యాఖ్య నన్ను ఈ ‘చంపేంత వెర్రికి’ పురికొల్పిందండి…!!!

 2. 1:22 ఉద. వద్ద డిసెంబర్ 4, 2011

  100% నిజం
  మగవాళ్ళు చటుక్కున రెండు సెకన్లలో అన్ని కొలిచేస్తారు . ఇంకా ఎప్పువ సేపు చూస్తె ఎవరన్న గమనిస్తారు అని.

  కానీ ఆడవాళ విషయం లో మాత్రం వేరే
  ఒక అమ్మాయిని వర్ణించడానికి మరొక అమ్మాయి కావాలి 🙂

 3. 8:12 ఉద. వద్ద డిసెంబర్ 4, 2011

  Beauty lies in the eyes of beholder అని కూడా అన్నట్టున్నారు!

  • 8:23 సా. వద్ద డిసెంబర్ 4, 2011

   ‘రసజ్ఞ’ గారు: దానికేఁ? బ్రహ్మాండంగా ఒప్పుకుంటా! కానీ మీ వ్యాఖ్యలోగనక ఏమన్నా message ఉంటే, నా బుఱకెక్కలేదు! వివరించగలరా?

 4. visali
  6:18 సా. వద్ద డిసెంబర్ 26, 2011

  అందమైన అమ్మాయి వెళ్తుంటే మాత్రం చాలా కళ్ళే చూస్తాయి. కొన్ని కళ్ళు ఆశ్చర్యంతో చూస్తే, కొన్ని అభినందనలతో, కొన్ని అసూయతో చూస్తాయి. కొందరు కళ్ళు పెద్దవి చేసి మరీ తమని తాము మరచిపోయి చూస్తూ ఉంటారు, మరి కొందరు నోర్లతో చూస్తారు. ఒకటి నిజం అందమైన అమ్మాయిని మాత్రం అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చూస్తారు.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s