ముంగిలి > పిచ్చాపాటి > మీరేనా జలకాలాడేది?

మీరేనా జలకాలాడేది?

ఇవాళ పొద్దున దేశ రాజధానిలో ఉన్నాను. అక్కడ పొద్దున, ఏడింటికి, నేను బస చేసిన హోటల్లోని Swimming Pool లో జలకాలాడటానికి వచ్చిన పావురాళ్ళను నా ఫొన్లో బంధించే ప్రయత్నం చేశాను. ‘జగదేక వీరుని కథ’ కాలంలో దేవకన్యలొచ్చేవారనుకుంటాను; ఈ కలికాలంలో పావురాళ్ళతో సరిపెట్టుకోవాలి మరి. ఓ ఇరవై పావురాళ్ళ వరకు దిగాయి. కానీ చుట్టుపక్కల మానవుణ్ణైన నేనున్నందున, ఆ దేవ కన్యలు (ఈ కాలపు పావురాళ్ళు) కాస్తంత జంకాయి. ఓ ఐదిటిని మాత్రమే బంధించగలిగాను.

ఒక పావురం

ఒక పావురం

రెండు పావురాలు

రెండు పావురాలు

మూడు పావురాలు

మూడు పావురాలు

నాలుగు పావురాలు

నాలుగు పావురాలు

ఐదు పావురాలు

ఐదు పావురాలు

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 6:41 సా. వద్ద డిసెంబర్ 6, 2011

  1 పావురం (ఒంటరిగా): నాకొక తోడు దొరికితే బాగున్ను, ఎంచక్కా జలకలాడోచ్చు
  అదే పావురం (జత దొరికాక): దీనితో ..bore కొట్టేస్తుంది……ఇంకొక పావురాయి దొరికితే….నా సామి రంగా…!
  అదే పావురం (ఇంకో జత దొరికాక): ఎన్ని జత లున్నా… చివరికి బోరే కదా…..ఓ ఇద్దరు పిల్లలుంటే …ఎంత బాగుణ్ణు …జీవితానికొక పరమార్థం…వాటిని చూస్తూ గడిపెయోచ్చు…..
  అదే పావురం (ఇద్దరు పిల్లలు వచ్హాక): జీవితం లో అన్ని సాధించాం …అని అనిపిస్తుంది….ఇప్పుడొక నేస్తం ఉంటె కాలక్షేపం అవుతుంది …అని అనిపిస్తుంది…
  అదే పావురం (ఒక నేస్తం దొరికాక): మళ్లీ పాత రోజుల్లోకి వెళ్ళాలనిపిస్తుంది…..జంట పక్షుల్లాగా …made for each other లాగ….. మొదటి జత తో జీవితం ఎంత బాగుండేదో అప్పుడు అని అనిపుస్తింది….. (అందు కే ఈ పావురం దూరంగా వెళ్లి నిలబడింది చూడండి 🙂 )
  అందుకే …Olden days are golden days ….అంటాను…

  మీరు తీసిన చిత్రాలు చూడగానే ….ఏదో వ్రాయాలనిపించి వ్రాసాను…….just for fun ….

 2. అన్వేషి
  10:50 సా. వద్ద డిసెంబర్ 6, 2011

  చిత్రాలు బాగు, బాగు! చిత్రాల పై అల్లిన కధ బహుబాగు!!

 3. 2:59 ఉద. వద్ద డిసెంబర్ 7, 2011

  మీ ఛాయా చిత్రాలు, వేణు గారి వ్యాఖ్య రెండూ బాగున్నాయి.

 4. 6:44 ఉద. వద్ద డిసెంబర్ 8, 2011

  ‘అన్వేషి’ గారు, ‘రసజ్ఞ’ గారు: నిజమే. వేణుగారు వైవిధ్యంగా ఆలోచించారు.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s