ముంగిలి > మన సంస్కృతి, సనాతన ధర్మం > బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నపుడు కొన్ని కారణాలు దొరికాయి. ‘పునర్జన్మను నమ్మే వారు బొట్టు పెట్టుకుంటారు’ అన్న వివరణ, ఒక సామాన్యుడు తేలికగా అర్థం చేసుకోగల Practical లౌకిక సమాధానం అనిపించింది. సరే – పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నానని నలుగురికీ తెలియజేయాలా? ఆ సిద్ధాంతాన్ని మనము ‘నమ్మినదీ – లేనిది’ అన్న విశ్వాసంతో ఇతరులకు ఏమిటి? “పునర్జన్మను మనసా వాచా కర్మణా నమ్ముతాను – కానీ బొట్టు పెట్టను” మరి ఇటువంటివారి సంగతో? మరయితే, ఒకరు కుంకుమ, మరొకరు విభూతి, ఇంకొకరు చందనం, మరికొందరు శ్రీచందనం – ఇలా ఒకొక్కరు ఒకో రకం పెట్టుకుంటారు. అంటే పునర్జన్మ సిద్దాంతంలో వేరు వేరు రకాలుంటాయా?

పునర్జన్మ

అబ్బా! ఏం పాపం చేశానో – నాకీ కష్టాలు“, “అదృష్టం భలే కలిసొచ్చిందే!“, “చీమకు కూడా హాని తలపెట్టలేదు – మరి నాకెందుకు ఇలాంటి పరీక్షలు?“, “ఇలా కలిసొచ్చిందంటే, అంతా దేవుడి దయ” ఇలాంటివి మనము అన్నప్పుడల్లా పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలిసో-తెలియకో నమ్మినట్టే! ఒక పని చేసినపుడు, దాని ప్రతిఫలంగా మనము ఊహించినదేదన్నా జరిగితే, మన మనసు ఒప్పుకుంటుంది. కానీ నిష్కారణంగా లేక ఊహించనిదేదన్నా జరిగితే, దానిని మనము ‘అదృష్టం’ లేక ‘దురదృష్టం’ అని పిలిచి వదిలేస్తాము. అదృష్ట-దురదృష్టాలు పురాకృత-సుకృత-దుష్కృతాల పరియవసానాలే. తెలిసో తెలియకో చేసిన పాప పుణ్యాలే, మనము అనుభవించే దుఃఖము –  సుఖమూ. హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తి నమ్మేది ఇదే. పాప పుణ్య విశేషాన్ని బట్టి, కొన్నిటిని అదే జన్మలో అనుభవిస్తే – కొన్ని మరుజన్మలో.

పునర్జన్మ అనేది చాలా లోతైన విషయం. ఒక్క ముక్కలో ‘అవును’/’కాదు’ అని తేల్చి పడేసే విషయం కాదు. ఎప్పుడన్నా ఈ విషయంపై వేరే టపాలో నా భావాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి మటుకు, పునర్జన్మ ఉంటుందనుకుందాం.

తిలకధారణలో అన్నన్ని రకాలెందుకు?

ఒక్క ముక్కలో సమాధానం – “సంప్రదాయం.” వారి వారి సాంప్రదాయానికనుగూణంగా బొట్టు – తిలకం ధారణ చేస్తుంటారు. ‘నేను ఎల్లవేళలా పునర్జన్మను నమ్ముతాను‘ అని తెలియజేసేవే – ఏ రకంగానైనా ఉన్న ధారణా వైవిధ్యాలు.

నమ్మకాన్ని ప్రదర్శించాలా?

ఇది ముఖ్యమైన ప్రశ్న. నమ్మకానికి ప్రదర్శన ఎందుకు? బొట్టు పెట్టకుండా పునర్జన్మను నమ్మలేమా? పెట్టకపోతే నమ్మినట్టు కాదా?

పెట్టకపోయినా నమ్మవచ్చు.  బొట్టు పెట్టుకుంటున్న ప్రతి సారీ, మనకు మనము ‘పాప-పుణ్యాల పరియవసానమే పునర్జన్మ’ అని గుర్తుచేసుకుంటున్నట్టే! బొట్టు పెట్టుకున్న వ్యక్తి ఎదురుపడ్డప్పుడు ప్రతీ సారీ ‘పాప-పుణ్యాల పరియవసానమే పునర్జన్మ’ అని గుర్తుకు తెచ్చుకోవాలి. పైపెచ్చు అది మఫ్టీలో (Mufti) ఉన్న పోలీసువాడి వంటిది. ఉద్యోగరిత్యా అతను పోలిసే కావచ్చు – కానీ ఆ ఖాకీ రంగు దుస్తులేసినపుడే అతనికి పరిచయంతో పనిలేకుండా తగిన విలువ దొరుకుతుంది. ట్రాఫిక్ పోలిసులకిచ్చిన విలువ మనము Volunteersకి ఇస్తామా?

‘నాలాగా నమ్మేవారిలో నువ్వొకడివా?’ అన్నది కాదు ‘నీకు నువ్వు నమ్ముతూ – ఇతరులకు గుర్తు చేయడం’ బొట్టుపెట్టుకోవడం వెనుకనున్న పరమార్థం.

జ్ఞానేంద్రియాలు-మనసు ఎప్పుడూ మనిషిని ‘సుఖం’ అనిపించే విషయాలవైపుకు ఈడుస్తుంటాయి. నిజానికి, ఇప్పుడు సుఖాన్ని కలిగించినది, ఎల్లపుడూ సుఖాన్ని అందిస్తుందని నమ్మకం లేదు. చాలాసార్లు అంతరాత్మ అడ్డు పడుతున్నా, సుఖాపేక్షలో దాన్ని అణిచి – తప్పులు చేస్తుంటాము. ఎవరో కాదు, మనలోనున్న ఆ పరంజ్యోతియే సాక్షి. ‘ఆఁ! ఏం ఫరవాలేదులే‘ అనుకొని చేస్తున్నవన్నీ పాపాలే కదా? పరులతో కాదు – మన అంతరాత్మతోటే మనం అలా వాదించి చేయాలనిపించినవి చేసేసి – వాటి పరియవసానము అనుభవించాల్సినపుడు మాత్రం ‘అదృష్టాలు’ ‘దురదృష్టాలు’ అని పేర్లు పెడుతుంటాము. ఇటువంటి సంధర్భాలలో పునర్జన్మను గుర్తు చేసే ‘జాగ్రత్త’ చిహ్నమే బొట్టు. అందుకేనేమో తిలకం ఎఱ్ఱని వర్ణాలలో ఉండేది!

కేవలం పునర్జన్మను నమ్మటమేనా ఇందుకు కారణం?

తేలికగా పోల్చుకొనటానికో లేక గుర్తుంచుకోడానికో మాత్రమే ‘పునర్జన్మను నమ్మడం’ అనే నెపం. పునర్జన్మ సిద్ధాంతం వెనుక ‘కర్మ యోగం’ లేదా? నా ఉద్దేశ్యంలో ‘పునర్జన్మను నమ్మటం’ అన్నా ‘సనాతన ధర్మాన్ని నమ్మడం’ అన్నా – రెండూ ఒకటే. It is merely a tip of the ice-berg.

మన తెలుగునాట సాధారణంగా ‘ప్రసాదం’ అంటే ఏదన్నా భుజించే పదార్థం అని భావిస్తుంటాము. అదే కేరళ రాష్ట్రంలోనో లేక తమిళనాట, దేవతా ప్రసాదంగా చందనమో, కుంకుమో లేక విభూతో ఇస్తుంటారు. ధరించే బొట్టు దేవతా ప్రసాదమైతే, ఇంకేం కావాలి?

బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఏమన్నా తేడా ఉంటుందా?

పైప్రశ్నకు సమాధానం, మామిడి పండు రుచి ఎలా ఉంటుందో వర్ణిస్తూ ఒక టపా రాయడం వంటిది. కొన్ని కొన్ని విషయాలు మనంతట మనము తెలుసుకోవాలి తప్ప, ఎంత విన్నా ఇంకెంత చదివినా – పాటించి అనుభవించక పోతే, పెద్దగా లాభం ఉండదు. బొట్టు పెట్టుకొని కూడా ‘తప్పుడు పనులు యధేచ్చగా చేస్తాను’ అని ఎవరన్నా భావిస్తే, దాని ప్రయోజనం ఏమీ లేదు. అంతకన్నా పెట్టుకోకపోవడం మేలు. ‘తప్పులు చేయటం మానే ప్రయత్నం చేస్తాను’ అని అనుకునేవాళ్ళకు మటుకు, బొట్టు ఓ చక్కని సాధనం.

ప్రకటనలు
 1. 11:23 ఉద. వద్ద డిసెంబర్ 8, 2011

  బొట్టు ఒక్క ముక్క
  అది లేనిదే నీ జేవితం ఒక ముక్క !

 2. 1:00 సా. వద్ద డిసెంబర్ 8, 2011

  ఆజ్ఞా చక్ర స్థానం భ్రుకుటి
  సో daily touch చేయటం వల్ల అది activate అయ్యే chances ఉంటాయని
  ఆ సంప్రదాయాన్ని పెద్దలు అలవాటు చేశారు

  ఇక పోతే నిలువు నామం అనేది
  “ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు చిహ్నం” అని విన్నాను

  విభూది ధారణ చివరకు సర్వము బూడిద అయ్యేదే
  “యద్ద్రుశ్యం తన్నశ్యం” అని “అద్దం” అంతరార్థం

 3. 8:10 సా. వద్ద డిసెంబర్ 8, 2011

  ‘Zilebi’ గారు: Zilebi బదులు, ‘ఏకశ్లోకి’ అని మీ పరిచయాన్ని మారిస్తే ఎలా ఉంటుందంటారు?

  ‘ఎం.ఏ’ గారు: మీరు ప్రస్తావించినవి విన్నాను. కానీ, వాటితో నేను పూర్తిగా తృప్తి పొందలేదు – అందుకే ప్రస్తావించలేదు.

 4. kothapalli ravibabu
  3:38 ఉద. వద్ద డిసెంబర్ 22, 2011

  bottu ku punarjanma ku sambandham gurinchi ippude vintunnanu.

 5. mary
  8:58 సా. వద్ద డిసెంబర్ 29, 2011

  bottuku mariyu shivuni thalaloni ganga ku sambandhamu unnada?

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s