ముంగిలి > పిచ్చాపాటి > ప్రపంచ స్త్రీల శిరచ్చాదనలు

ప్రపంచ స్త్రీల శిరచ్చాదనలు

2011 నోబెల్ శాంతి పురస్కారాన్నందుకున్న ముగ్గురూ స్త్రీలే! యమను దేశస్తురాలైన తవ్వకుల్ కర్మాన్‌, లైబీరియా నుండి లెయ్‌మాహ్ గ్బోవీ మరియూ లైబీరియా దేశాధినేత్రి ఎల్లెన్‌-జాహ్న్‌సన్‌. ముగ్గురూ స్త్రీలే అన్న విషయం కాకుండా మరో విషయం నా ధ్యాసను ఆకట్టుకుంది. వీరి ముగ్గురి బట్ట కట్టు ఇంకా జుత్తు కనబడకుండా వారు కట్టుకున్న శిరచ్చాదనలు (Headscarf). Headscarf అన్న పదానికి, తెలుగులో పర్యాయ పదం ‘శిరచ్చాదన’ అనుకుంటాను. తప్పు అయితే చెప్పండి. సరిదిద్దుతా.

2011 నోబెల్ శాంతి పురస్కారగ్రహీతలు

2011 నోబెల్ శాంతి పురస్కారగ్రహీతలు

పెద్దగా పట్టించుకోముగానీ, ఎన్నెన్ని రకాలో కదా ఈ Headscarves! సరే, ఎన్నున్నాయి – అవి ఏమిటి? ఏ దేశ సంస్కృతి బట్టి అవి ఎలా ఉంటాయి? ఓ చిన్ని ప్రయత్నం చేశాను. నాకు దొరికిన వివరాలు ఈ టపలో…

ముఖ్యంగా ఇస్లాం దేశాలలో వీటి వాడకం అనివార్యం అని తెలుస్తోంది. ఎంత ఖచ్చితంగా ‘షరియా’ చట్టం అమలులో ఉందో – దానిని బట్టి వీటిలో తేడాలు కనిపించాయి. కొన్ని దేశాల్లో ఇవి ప్రధాన దుస్తులనుండి వేరుగా ఉంటే కొన్నిటిలో మనకు సాధారణంగా తెలిసిన ‘బుర్ఖా’కు అంతర్భాగమై ఉంటాయి.

హిజాబ్

ఇది ఒక తేలికపాటి ఆచ్చాదనము. అభ్యుదయ ముస్లిం స్త్రీలు ఎక్కువగా వాడే రకంగా కనిపించింది.

హిజాబ్ పెళ్ళికూతురు

హిజాబ్ పెళ్ళికూతురు / Bridal Hijab

హిజాబ్ / Hijab

హిజాబ్ / Hijbab

హిజాబ్ షాయ్లా / Hijab Shayla

హిజాబ్ షాయ్లా / Hijab Shayla

టుడాంగ్

మలేషియా మరియూ బ్రూనై లో, ఇస్లాం మతంయొక్క బుర్ఖాకనుగూణంగా దీనిని ధరిస్తారు. ముఖాన్ని కాకుండా జుత్తును మాత్రమే కప్పి ఉంచుతుంది.

టుడాంగ్ / Tudong

టుడాంగ్ / Tudong

కెరుడంగ్

ఇది ఇండోనేషియా దేశ స్త్రీలు వాడే రకం. లోపల ఒక టోపీ వంటిది ఉండి దానిపై ఓ బట్ట కట్టు. టుడాంగ్ కేరుడంగ్‌లు పెద్దగా భిన్నంగా కనిపించనట్టుంది. కానీ ఇవి కాస్తంత వేర్వేరు అని తెలిసింది.

కెరుడంగ్ / Kerudong

కెరుడంగ్ / Kerudong

జిలాబహ్

ఇది కూడా ఇండోనేషియాతో ముడిపడినట్టుగా తెలుస్తున్నా, ఇతర దేశాల్లోకూడా దీనిని వాడతారు. బహువచనంలో జిల్బాబ్ అంటారు. తలనుండి శరీరాన్ని కప్పుకోడానికి వాడే ఏకవస్త్రం. అదనంగా తల/జుత్తును కప్పిఉంచడానికి మరో వస్త్రాన్ని కూడా వాడుతారు. దీనిని ఖురాన్ పవిత్ర గ్రంథం ప్రస్తావించింది అని తెలిసింది.

జిలాబహ్ / Jilaabah

జిలాబహ్ / Jilaabah

ఖిమార్

తలనుండి నడుము వరకు స్త్రీ లావణ్యాలను కప్పి ఉంచే ఆచ్చాదనం.

ఖిమార్ / Khimaar

ఖిమార్ / Khimaar

నిఖాబ్

బుర్ఖా – నిఖాబ్ (నఖాబ్‌) పదాలను ఒక్కోసారి తప్పుగా వాడుతుంటారు. నిఖాబ్ కేవలం శరీర పైభాగాన్ని కప్పి ఉంచే వస్త్రం. బుర్ఖా ఏమో పూర్తి శరీరాన్ని కప్పే వస్త్రం.

నిఖాబ్ / Nikab

నిఖాబ్ / Nikab

జెరుసలెమ్

జెరుసలెమ్ రకం / Jerusalem Headscarf

జెరుసలెమ్ రకం / Jerusalem Headscarf

టిచెల్

ఇది యూదులలో పెళ్ళయిన స్త్రీలు ధరిస్తారట.

టిచెల్ / Jewish Tichel

టిచెల్ / Jewish Tichel

అమిష్

అమిష్

అమిష్ / Amish

క్రిష్టియన్ రకాలు

తెల్లదేమో Veil of probation అట నల్లదేమో Veil of profession.

క్రిష్టియన్ రకాలు

క్రిష్టియన్ రకాలు / Christian Head-wraps

హుఇ తెగ

చైనా హుఇ తెగ వారు వాడేవి

చైనా హుఇ తెగ వారు వాడేవి / China Hui Headscarf

ఆఫ్రికా రకాలు

వీటిని గెలె (Gele) అని పిలుస్తారు.

ఆఫ్రికా హిజాబ్

ఆఫ్రికా హిజాబ్ / African Hijab

గెలె రకాలు

గెలె రకాలు / Gele Types

గెలె-1

గెలె-1 / Gele 1

గెలె-2

గెలె-2 / Gele 2

ఓ! ఇంకా చాలా దేశాలవి చాలా రకాలున్నాయి. ఇక చాల్లే అని ఆపేశాను. మరోశారి గోళ్ళుగిల్లుకోవాలనిపించినపుడు మగవారి సంగతి చూస్తా!

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
 1. 9:54 ఉద. వద్ద డిసెంబర్ 12, 2011

  nice!

 2. 12:56 సా. వద్ద డిసెంబర్ 12, 2011

  మీ గురించి మీరు సరిగ్గా పరిచయం చేసుకోలేదనుకొంటాను.
  మీ లేఖలు బాగున్నాయి. ప్రపంచ స్త్రీల గురించి చదివాను.
  మీ సేకరణ కొనియాడ దగిన్దే.

 3. 3:52 సా. వద్ద డిసెంబర్ 12, 2011

  ‘ప్రపంచ స్త్రీల శిరాచ్చాదనలు ‘మంచి సంకలనం . పదం ‘ఆచ్చాదనలు’ కాబట్టి ‘ర’ కు దీర్ఘం ఉండాలి . సేకరణకు ధన్యవాదాలు .

 4. 7:37 సా. వద్ద డిసెంబర్ 12, 2011

  ‘ ప్రపంచ స్రీల శిరస్సుఆచ్చాదనలు ‘ అని ఉంటే బాగుంటుందేమో

 5. 3:33 ఉద. వద్ద డిసెంబర్ 13, 2011

  ఇందులో , జిలేబి ‘శిరచ్చేదనం’ కనిపించడం లేదే మరి ? అదీ ఒక ‘సిరా’ చ్చేదనమే కదా ?

  చీర్స్
  జిలేబి.

 6. 8:49 ఉద. వద్ద డిసెంబర్ 13, 2011

  ‘శిరచ్చాదన’ బహుశః తెలుగులో లేని పదమేమో! Internet లో ఎక్కడా ఈ పద వాడకం కనిపించలేదు. శంకరనారాయణ గరి నిఘంటువులో ‘Scarf’ అంటే ‘తలపాగా’ అని తెలిపారు – కానీ ఈ సంధర్భంలో తలపాగా ఎందుకో సరిపోలేదు అనిపించింది.

  ‘కొల్లూరి’ గారు: మీ వ్యాఖ్య అర్థం కాలేదు. నా గురించి మరింకేమన్నా తెలుపమంటారా?

  ‘లక్కాకుల’ గారు: మీరు చెప్పినట్టు ‘శిరస్సు ఆచ్చాదన’ సరైనదేమో! ‘శిరాచ్చాదన’ కూడా సరైనది – అని అనిపించటంలేదు. వేచి చూస్తాను – మరేఁవన్నా సవరణలు వస్తాయేమో!

  ‘జిలేబి’ గారు: ‘తప్పు’ అని hint ఏమన్నా ఇస్తున్నారా? మరి సరైనదేమిటో కూడా మీరే చెప్పి పుణ్యం కట్టుకోకూడదా! Head-wrap నుండి Head-roll కు తీసుకేళ్ళారు…

 7. p.mallikarjunara@
  5:26 సా. వద్ద జనవరి 23, 2012

  good data collection mallikarjuna

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s