ముంగిలి > సరదాగా > డిసెంబర్ 12, 2012 – గ్రహగతులు

డిసెంబర్ 12, 2012 – గ్రహగతులు

సరిగ్గా ఒక సంవత్సర దూరంలో ఉన్నాము. 12/12/12; ఆ సమయం గ్రహగతులను మరికాస్త క్షుణ్ణంగా పరిశీలించడానికి – ఒక చిన్న animation video ను రూపొందించి, Youtube లో upload చేసాను.

[డిసెంబర్ 12, 2012] నాడు ఏమి జరుగుతుందో విశ్లేషించే వారికి ఉపయోగపడే animation ఇది. [నవంబరు 2011] నుండి [డిసెంబరు 2013] వరకు, గ్రహాల కదలికలను ఈ video లో చూడవచ్చును. గ్రహకూటములు, గ్రహాల వక్రగతులు వగైరా అన్నీ చలనంలో దర్శించవచ్చును.

ఈ video గతి మొదట 48 గంటలతో మొదలై, [అక్టోబరు 2012] నుండి 12 గంటల వ్యవధి పెట్టాను. [నవంబరు 2012]కు వేగాన్ని 6 గంటలకు తగ్గిచ్చి, [డిసెంబరు 2012]కు గ్రహగతిని రెండు గంటల వ్యవధిలో చూపించాను. [15 డిసెంబరు, 2012] నుండి మళ్ళీ వేగాన్ని మెల్లిగా పెంచుకుంటూ తిరిగి 48 గంటలకు తెచ్చి – పూర్తి వీడియో [డిసెంబరు 2013] వరకు గహాల స్థితులను తెలుపుతున్నది. మొత్తం ఒక నిమిషం 23 సెకెన్లలో, [2012 నవంబరు] నుండి [2013 డిసెంబరు] వరకు గల గ్రహాల కదలికలను చూడవచ్చును.

‘ఐదు’ లేక అంతకన్నా ఎక్కువ గ్రహ కూటములేమన్నా ఏర్పడుతున్నాయా – అని వెదుకులాట మొదలుపెట్టాను. సాధారణంగా ‘ఐదు’ గ్రహాలు – మహా అంటే ‘ఆరు’ గ్రహాలు అప్పుడప్పుడు ఒకే రాశిలో కలిసిఉన్నట్టు తెలుస్తోంది. సరే సాగదీద్దాం అని [2030] వరకు వెతికాను. కనీసం ఒక్క ‘సప్త’ గ్రహ కూటమి కనిపిస్తేనే కదా ‘అష్ట’గ్రహ కూటమి తగలడానికి. Maximum ‘ఆరు’ గ్రహాలు. అతి దగ్గిరలో అంటే [22 మే, 2012]న ఆరు గ్రహాలు కలిసి కనిపిస్తున్నాయి. తరువాత [2019] – అటుపై [2021] – దానిపై [2025]. ఉత్సాహం ఉంటే ఆ పట్టి Video క్రింద జత చేస్తున్నాను. ఉచ్చ-నీచ స్థానాలు, వక్ర గమనాలను తెలుపుతూ, పట్టికను తయారు చేశాను.

[2012]లో నాలుగు సార్లు ‘ఐదు’ లేక ‘ఆరు’ గ్రహాల కూటమి ఏర్పడుతోంది. నిజానికి ‘రెండు’ సార్లే! [మే 21] నుండి ‘ఐదు’ – వెనువెంటనే బుధుడు కలిసి ‘ఆరు’ గ్రహాలు ఒకే రాశిలో చేరి – చంద్రుడు నిష్క్రమించి మళ్ళీ సంఖ్య ‘ఐదు’కు చేరుతోంది. [21 మే] నాడు మొదలై ఈ మూడు కూటములు [4 జూన్] వరకు అంటే 15 రోజులపాటు సుధీర్ఘంగా కలిసిఉంటున్నాయి.

గ్రహగతులు

‘ఐదు’ లేక అంతకన్నా ఎక్కువ గ్రహ కూటములు

మొదలు వరకు రోజులు రాశి సంఖ్య గ్రహాలు
21-May-12 21-May-12 1 వృషభం 5 రవి చంద్ర (ఉచ్ఛ) గురు శుక్ర (వక్ర) కేతు
22-May-12 23-May-12 2 వృషభం 6 రవి చంద్ర (ఉచ్ఛ) బుధ గురు శుక్ర (వక్ర) కేతు
23-May-12 4-Jun-12 13 వృషభం 5 రవి బుధ గురు శుక్ర (వక్ర) కేతు
11-Dec-12 13-Dec-12 3 వృశ్చిక 5 రవి చంద్ర (నీచ) బుధ శుక్ర రాహు
10-Apr-13 10-Apr-13 1 మీన 5 రవి చంద్ర కుజ బుధ (నీచ) శుక్ర (ఉచ్ఛ)
28-Apr-13 10-May-13 13 మేష 5 రవి (ఉచ్ఛ) కుజ బుధ శుక్ర కేతు
23-May-13 27-May-13 5 వృషభం 5 రవి కుజ బుధ గురు శుక్ర
6-Jul-13 8-Jul-13 3 మిథున 5 రవి చంద్ర కుజ బుధ (వక్ర) గురు
2-Nov-13 4-Nov-13 3 తుల 5 రవి (నీచ) చంద్ర బుధ (వక్ర) శని (ఉచ్ఛ) రాహు
7-Mar-16 9-Mar-16 3 కుంభం 5 రవి చంద్ర బుధ శుక్ర కేతు
4-Aug-16 6-Aug-16 3 సింహ 5 చంద్ర బుధ గురు శుక్ర రాహు
29-Aug-19 31-Aug-19 3 సింహ 5 రవి చంద్ర కుజ బుధ శుక్ర
28-Sep-19 29-Sep-19 2 కన్య 5 రవి చంద్ర కుజ బుధ (ఉచ్ఛ) శుక్ర (నీచ)
28-Nov-19 30-Nov-19 3 ధనుస్సు 5 చంద్ర గురు శుక్ర శని కేతు
25-Dec-19 27-Dec-19 3 ధనుస్సు 6 రవి చంద్ర బుధ గురు శని కేతు
28-Dec-19 13-Jan-20 17 ధనుస్సు 5 రవి బుధ గురు శని కేతు
13-Dec-20 14-Dec-20 2 వృశ్చిక 5 రవి చంద్ర (నీచ) బుధ శుక్ర కేతు
14-Jan-21 15-Jan-21 2 మకర 5 రవి చంద్ర బుధ గురు (నీచ) శని
5-Feb-21 9-Feb-21 5 మకర 5 రవి బుధ (వక్ర) గురు (నీచ) శుక్ర శని
9-Feb-21 11-Feb-21 3 మకర 6 రవి చంద్ర బుధ (వక్ర) గురు (నీచ) శుక్ర శని
12-Feb-21 12-Feb-21 1 మకర 5 రవి బుధ (వక్ర) గురు (నీచ) శుక్ర శని
27-Feb-22 1-Mar-22 3 మకర 5 చంద్ర కుజ (ఉచ్ఛ) బుధ శుక్ర శని
26-Oct-22 26-Oct-22 1 తుల 5 రవి (నీచ) చంద్ర బుధ శుక్ర కేతు
5-Jun-24 6-Jun-24 2 వృషభం 5 రవి చంద్ర (ఉచ్ఛ) బుధ గురు శుక్ర
28-Mar-25 29-Mar-25 2 మీన 5 రవి చంద్ర బుధ (నీచ, వక్ర) శుక్ర (ఉచ్ఛ, వక్ర) రాహు
29-Mar-25 30-Mar-25 2 మీన 6 రవి చంద్ర బుధ (నీచ, వక్ర) శుక్ర (ఉచ్ఛ, వక్ర) శని రాహు
30-Mar-25 7-Apr-25 9 మీన 5 రవి బుధ (నీచ, వక్ర) శుక్ర (ఉచ్ఛ, వక్ర) శని రాహు
7-Apr-25 12-Apr-25 6 మీన 5 రవి బుధ (నీచ) శుక్ర (ఉచ్ఛ, వక్ర) శని రాహు
13-Apr-25 13-Apr-25 1 మీన 5 రవి బుధ (నీచ) శుక్ర (ఉచ్ఛ) శని రాహు
25-Apr-25 26-Apr-25 2 మీన 5 చంద్ర బుధ (నీచ) శుక్ర (ఉచ్ఛ) శని రాహు
18-Jan-26 20-Jan-26 3 మకర 5 రవి చంద్ర కుజ (ఉచ్ఛ) బుధ శుక్ర
17-Feb-26 19-Feb-26 3 కుంభం 5 రవి చంద్ర బుధ శుక్ర రాహు
23-Feb-26 26-Feb-26 4 కుంభం 5 రవి కుజ బుధ శుక్ర రాహు
26-Feb-26 1-Mar-26 4 కుంభం 5 రవి కుజ బుధ (వక్ర) శుక్ర రాహు
1-Aug-27 3-Aug-27 3 కర్కాటక 5 రవి చంద్ర బుధ శుక్ర కేతు
25-Jan-28 27-Jan-28 3 మకర 5 రవి చంద్ర కుజ (ఉచ్ఛ) బుధ (వక్ర) రాహు
24-Apr-28 26-Apr-28 3 మేష 5 రవి (ఉచ్ఛ) చంద్ర కుజ బుధ శని (నీచ)
14-Apr-29 16-Apr-29 3 మేష 5 రవి (ఉచ్ఛ) చంద్ర బుధ శుక్ర శని (నీచ)
3-Jan-30 4-Jan-30 2 ధనుస్సు 5 రవి చంద్ర బుధ (వక్ర) శుక్ర (వక్ర) రాహు
31-May-30 2-Jun-30 3 వృషభం 5 రవి చంద్ర (ఉచ్ఛ) కుజ శని కేతు
5-Jun-30 15-Jun-30 11 వృషభం 5 రవి కుజ బుధ శని కేతు
18-Jun-30 20-Jun-30 3 వృషభం 5 కుజ బుధ శుక్ర శని కేతు
16-Nov-30 24-Nov-30 9 వృశ్చిక 5 రవి బుధ గురు శుక్ర రాహు
25-Nov-30 26-Nov-30 2 వృశ్చిక 5 రవి చంద్ర (నీచ) గురు శుక్ర రాహు
ప్రకటనలు
వర్గాలుసరదాగా ట్యాగులు:, ,
 1. 8:55 ఉద. వద్ద డిసెంబర్ 13, 2011

  పూర్తిగా గుర్తులేదు కాని ఒక అష్టగ్రహ కూటమి చూసిన వాడిని. వివరాలు రాస్తే బాగుండేది.వీడియో బాగుంది కాని దృష్టి నిలపడం కష్టమయింది

  • 9:20 ఉద. వద్ద డిసెంబర్ 13, 2011

   ‘కాష్టేఫలే శర్మ’ గారు: నిజమే! 4 February, 1962 లో ఒక అష్ట గ్రహ కూటమి ఏర్పడింది. మకర రాశిలో – రవి, చంద్ర, కుజ (ఉచ్ఛ), బుధ (వక్ర), గురు (నీచ), శుక్ర, శని ఇంకా కేతువులతో కూడినది.

 2. ?!
  2:22 సా. వద్ద డిసెంబర్ 13, 2011

  Sir,

  Animation Bhale chesare ela chesaaro vivaristhaara please

  Telusukovaalani jignnasa ga unnadi

  ?!

 3. 5:29 సా. వద్ద డిసెంబర్ 13, 2011

  ఎంత simple గా animation ద్వారా తెలియ చేసారు. కాని నాకు ఈ పరిజ్ఞానం అంతగా లేదు, మీ పుట చదివిన తరువాత interest వచ్చింది. Animation ఎలా చేసారో కొంచం వివరిస్తే చాల సంతోషిస్తాను. గ్రహ కూటమి అని నేను మొదటి సారి విన్నది “మగధీర ” సినిమా ద్వార మాత్రామే, మళ్ళీ ఇప్పుడు మీ animation ద్వారా………. చాల బాగా అర్ధం అయ్యింది.
  గ్రహ కూటమి ఎప్పుడూ చెడు మాత్రమే తెస్తుందని అనుకోవాలా? మీ లెక్క ప్రకారం 12 -12 -12 నాడు వినాశనం జరగదనే అనుకోమంటారా?

 4. 12:46 ఉద. వద్ద డిసెంబర్ 14, 2011

  ఒకటి-రెండు రోజుల గడువివ్వండి. నేను animation ఎలా చేశానో నుండి ఇతర గంభీరమైన ప్రశ్నల వరకు – సమాధానంగా ఒక టపా ప్రచురిస్తాను…

 5. 1:01 ఉద. వద్ద డిసెంబర్ 14, 2011

  మేజిక్ బాగుందండీ ! మొత్తం మీద 12 డెసెంబర్ ఎమీ లేకుండా మరో రోజు అవుతుందని ఆశిద్దాం!

  చీర్స్

  జిలెబి.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s