ముంగిలి > పిచ్చాపాటి > టెంకాయ చిట్కా!

టెంకాయ చిట్కా!

కొంతకాలం క్రితం, దైవతార్చనలో – కొబ్బరినీళ్ళతో అభిషేకం చేయాలంటే కాస్తంత ఇబ్బంది పడేవాడిని.

అ. ఒక్క దెబ్బకు పగలాలి – కానీ రెండు మూడు సార్లు కొడితేకానీ పగిలేది కాదు.
ఆ. బలంగా కొట్టినప్పుడు, చాలాసార్లు టెంకాయ అడ్డదిడ్డంగా పగిలి – నీళ్ళు చుట్టుపక్కల పడి, పుజా మందిరం రచ్చు-రచ్చయ్యేది.
ఇ. పెద్ద నష్టమేమీ లేకపోయినా, రెండు చెక్కలూ అడ్డ-దిడ్డమైన షేపుల్లో పగిలేవి.
ఈ. అభిషేకానికి నీటిని ఒక లోటాలో సేకరిస్తుంటే, ఆ నీళ్ళనిండా పొట్టూ – పీచు. నీరు శుభ్రంగా ఉంటే అభిషేకం బాగా చేయవచ్చు – కానీ అలా ఏవేవో తేలుతూ కనిపిస్తే, కాస్తంత చిరాకు పుట్టుకొచ్చేది.
ఉ. ఒక్కోసారి, ‘లోటాలో తక్కువ – చుట్టుపక్కల ఎక్కువ’ అన్నట్టు నీరు కింద పడి వృధా అయిపోయేది.

ఏవేవో ప్రయత్నించాను. తడి బట్ట పరచడం; నీళ్ళు సేకరించడానికి లోటా బదులు పెద్ద పాత్ర వాడటం వంటివి. కానీ పెద్దగా లాభంలేకపోయింది. చివరికి ఓ ప్రయత్నం ఫలించి, అన్ని సమస్యలకూ పరిష్కారం ఒకటి దొరికింది. అదేమనిన…

మామూలు టెంకాయ

మామూలు టెంకాయ

సాధారణంగా టెంకాయను పైపీచు తీసి అమ్ముతారు. పెద్దగా గమనించము కానీ, దానికి అంటుకొని పీచు కాస్తో కూస్తో ఉండిపోతుంది. అన్ని తిప్పలకీ, అదే మూల కారణం.  అంచేత, వంటింట్లో వాడే పాత కత్తినొకదాన్ని తీసుకొని, మెల్లిగా టెంకాయపైనున్న మిగతా పీచును జాగ్రత్తగా చెక్కినట్టు తొలగించాలి. పొట్టు మొత్తం పోయింది – అని అనిపించిన తరువాత, కుళాయి కింద తడపాలి. అలా process చేస్తే టెంకాయ ఇలా ఉంటుంది…

Processed టెంకాయ

Processed టెంకాయ

ఇక చూడండి, సునాయాసంగా – పరిసరాలు పాడవకుండా – ఒక్క దెబ్బలో రెండు వక్కలయ్యేట్టు, ఇట్టె పగులుతుంది. ఒకటేం ఖర్మ? పది టెంకాయలు కూడా ఇట్టే కొట్టేయవచ్చు. కొబ్బరినీళ్ళు కూడా పీచూ-పోట్టు వంటివి ఏమీ లేకుండా – శుభ్రంగా సేకరించొచ్చు.

‘పాత కత్తి’ అని ఊరికే అనలేదు. ఈ పనికి వాడితే, కత్తి పదును తగ్గుతుంది.

పైన చెప్పిన చిట్కా, పూజకు కూర్చునే ముందే చేయాలి. ముందు రాత్రి చేసిపెట్టుకుంటానంటే కుదరదు. ముఖ్యంగా ఎండాకాలంలో – మీరు ఏమీ చేయకుండానే, వేడికి టెంకాయలో పగుళ్ళొస్తాయి.

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:,
  1. 8:30 సా. వద్ద డిసెంబర్ 14, 2011

    బాగుంది చిట్కా ఈ సారి ప్రయత్నించి చూస్తాను.

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s